SSC MNS: మిలిటరీ నర్సింగ్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల, మహిళలకు ప్రత్యేకం
త్రివిధ దళాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మిలిటరీ నర్సింగ్ సర్వీస్ నోటిఫికేషన్ వెలువడింది. మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
SSC MNS Recruitment: త్రివిధ దళాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 'మిలిటరీ నర్సింగ్ సర్వీస్ 2023-24' నోటిఫికేషన్ వెలువడింది. మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబర్ 11 నుంచి 26 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
* షార్ట్ సర్వీస్ కమిషన్ - మిలిటరీ నర్సింగ్ సర్వీస్ 2023-24
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ (నర్సింగ్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్)/ బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.
వయోపరిమితి: 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 25.12.1988 - 26.12.2002 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.900.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలు, మార్కుల సెల్ఫ్ అటెస్టెట్ కాపీలు, పాస్ సర్టిఫికేట్లు, స్టేట్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష విధానం: దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తుంది. వచ్చే ఏడాది (2024) జనవరి 14న దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో రాతపరీక్ష నిర్వహించనుంది. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, నర్సింగ్‌కు సంబంధించి పరీక్షలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో కనీస అర్హత మార్కులను 50 శాతంగా నిర్ణయించారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు.
ఇంటర్వ్యూ విధానం: రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఢిల్లీలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారికి తదనంతరం మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. వీటి కోసం 3 - 5 రోజుల సమయం తీసుకుంటారు.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.12.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 26.12.2023.
ALSO READ:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 52 ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఘజియాబాద్ యూనిట్- తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 52 ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
26,146 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - అర్హతలు, పూర్తి వివరాలివే
కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 26,146 ఖాళీలను భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో పురుషులకు 23347 పోస్టులు, మహిళలకు 2799 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 24 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి, డిసెంబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..