X

WHO on Covid Vaccines: పేద దేశాలకు కరోనా టీకాలు చేరేలా డబ్ల్యూహెచ్ఓ పక్కా స్కెచ్!

కొవిడ్‌పై మరో పోరాటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్ధమవుతోంది. పేద దేశాలకు సరిపడే వ్యాక్సిన్లు, కొవిడ్ టెస్టింగ్ కిట్లను సరఫరా చేసేందుకు ఓ కార్యక్రమాన్ని చేపట్టనుంది.

FOLLOW US: 

పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్‌లు, పరీక్షలు, చికిత్స అందడానికి ఓ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) శ్రీకారం చుట్టింది. కరోనా బాధితులకు ఓ కోర్సు యాంటీవైరల్ డ్రగ్స్ 10 డాలర్లకే అందేలా డబ్ల్యూహెచ్ఓ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 

మెర్క్ అండ్ కో (ఎమ్ఆర్‌కే.ఎన్) ప్రయోగాత్మక డ్రగ్స్ పిల్స్‌ను కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉన్నవారికి ఈ కార్యక్రమంలో భాగంగా అందించనున్నారు. ఈ మేరకు రైటర్స్ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద దేశాలకు మొత్తం ఒక బిలియన్ కొవిడ్-19 టెస్టింగ్ కిట్స్ పంపేందుకు డబ్ల్యూహెచ్ఓ సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 120 మిలియన్ల రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన డ్రగ్స్‌ను సిద్ధం చేస్తోంది. రాబోయే 12 నెలల్లో 200 మిలియన్ల కొవిడ్ కేసులు వచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది.

అయితే ఇవి ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉన్నట్లు రైటర్స్ పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నెల చివరిలో జరగనున్న జీ-20 సదస్సు కంటే ముందే దీన్ని జీ-20 దేశాల ముందు పెట్టే అవకాశం ఉంది.

తాజా హెచ్చరికలు..

కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరికలు చేసింది. కరోనా కథ ముగిసిందని అనుకోవద్దని పేర్కొంది. కరోనా నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని, ముప్పు ఇంకా పోలేదని, మధ్యలోనే ఉన్నామని హెచ్చరించింది. కొందరు కొవిడ్ ముగిసిపోయిందని అనుకుంటున్నారని.. ఇది చాలా ప్రమాదకరమని తెలిపింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదంది.

" కరోనా కాలం మొదలై దాదాపు రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని చోట్ల ఐసీయూలు, ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రజలు చనిపోతున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా ముగిసిందని నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. "
-ప్రపంచ ఆరోగ్య సంస్థ

Also Read: UP Assembly Election 2022: 'ఓ మహిళా మేలుకో.. అభివృద్ధిని కోరుకో.. 40 శాతం టికెట్లు మహిళలకే'

Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం

Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: covid WHO Covid vaccines Poor Nations G20 Nations

సంబంధిత కథనాలు

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Omicron Variant Cases in India: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక

Omicron Variant Cases in India: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక

TS Omicron : ఒమిక్రాన్ ఎప్పుడైనా రావొచ్చు... తెలంగాణలో హైఅలర్ట్ !

TS Omicron :  ఒమిక్రాన్ ఎప్పుడైనా రావొచ్చు... తెలంగాణలో హైఅలర్ట్ !

Corona Cases: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు, 477 మంది మృతి

Corona Cases: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు, 477 మంది మృతి

Omicron Variant: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!

Omicron Variant: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!

టాప్ స్టోరీస్

AP NGT Polavaram : పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !

AP NGT Polavaram :  పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !

OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

Siddharth : టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?

Siddharth : టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?

IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రేపే.. తెలుగు తేజానికి అవకాశం దక్కేనా?

IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రేపే.. తెలుగు తేజానికి అవకాశం దక్కేనా?