(Source: ECI/ABP News/ABP Majha)
Cow Milk: హెవీ వెయిట్‌తో బాధపడుతున్న వాళ్లకు గుడ్ న్యూస్, ఈ పాలు తాగుతూ బరువు తగ్గిపోండి!
ఆవు పాలతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అలాగే బరువు కూడా తగ్గొచ్చని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్టులు.
అధికబరువు తగ్గాలనుకునే వారు ముందుగా చేసే పని ఆహారం తక్కువ తినడం.దీనివల్ల వారు బరువు తగ్గడం పక్కన పెడితే నీరసంగా మారిపోతారు. సంపూర్ణఆహారంగా చెప్పుకునే పాలను తాగడం మానేస్తారు. కానీ పాలు తాగుతూనే బరువు కూడా తగ్గొచ్చు. అధిక బరువు ఉన్న వారికి మంచి ఎంపిక ఆవు పాలు. వీటిలో సంతృప్త కొవ్వు ఉండడం వల్ల ఈ పాలను తాగకూడదనుకుంటారు చాలా మంది, కానీ హ్యాపీగా తాగచ్చని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అంతేకాదు ఆవు పాలు తాగుతూ బరువు తగ్గొచ్చని సూచిస్తున్నారు.
బరువు తగ్గేలా చేస్తుంది...
కొవ్వు పేరుకుంటుందన్న భయంతో చాలా మంది పాలను అప్పడప్పుడు తాగుతారు. ఆవు పాలు మాత్రం ఎలాంటి భయం లేకుండా రోజూ తాగమని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఇందులో కాల్షియం, పొటాషియం, విటమిన్ బి12, విటమిన్ డి, రిబోఫ్లేవిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో పాలను చేర్చుకోవడం వల్ల జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ డేటా ప్రకారం వందగ్రాముల ఆవు పాలలో 3.25 శాతం కొవ్వు, 61 కేలరీల శక్తి, 113 మైక్రోగ్రాముల కాల్షియం కలిగి ఉంటుంది.
ప్యాకెట్ పాలు వద్దు...
బరువు తగ్గాలనుకునేవారు ప్యాకెట్ పాలు తాగకూడదు వీటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. వీటిలో ప్రిజర్వేటివ్‌లు,స్వీటెనర్‌లు కలుపుతారు. కాబట్టి ఇవి బరువు పెంచుతాయి. తాజా పాలను మాత్రమే తాగితే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ. ఈ పాలలో పసుపు, జాజికాయ, దాల్చిన చకెక్క, చేమంతి పూలు, అశ్వగంధ వంటి సుగంధ ద్రవ్యాలు కలుపుకుని తాగితే మరీ మంచిది. జీవక్రియ మరింత జోరుగా పనిచేసి బరువును తగ్గిస్తుంది.
అధ్యయనాల చెప్పిన దాని ప్రకారం ఆహారంలో తగినంత మొత్తంలో కాల్షియం ఉండడం వల్ల ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలు కలుగుతాయి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.