Viral Video: ఇష్టంలేని పెళ్లి చేస్తే ఇంతే, స్టేజి పైనే కొట్టుకున్న వధూవరులు
బంధువులు ఉన్నారన్నా విచక్షణ కూడా లేకుండా ఇద్దరు వధూవరులు ఎలా ప్రవర్తించారో చూడండి.
సోషల్ మీడియా వల్ల ఏ మూల జరిగిన విషయమైన వీడియో రూపంలో వైరల్ గా మారిపోతోంది. ఈ మధ్య పెళ్లిలో జరిగే ఫన్నీ డ్రామాలు మరింత వైరల్ అవుతున్నాయి. అలాంటి సంఘటనే ఇది కూడా. వీడియోను బట్టి చూస్తుంటే వధూవరులకిద్దరికి పెళ్లి ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. వరుడు చాలా చికాకుగా, కోపంగా ఉన్నాడు. వధువు కొంగు కప్పుకుని ఉంది కాబట్టి ముఖంలోని ఫీలింగ్స్ కనిపించడం లేదు, కానీ పెదాలపై ఉండాల్సిన నవ్వు, పెళ్లిలో సహజంగా కనిపించే సిగ్గు మాత్రం ఆమెలో లేవు. వారికి అంతగా ఇష్టంలేకపోయినా తల్లిదండ్రులు ఎందుకు పెళ్లి చేస్తున్నారో మాత్రం అర్థం కావడం లేదంటూ చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ పెళ్లి తంతు ఉత్తరప్రదేశ్ లో జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో వరుడు, వధువు ఎదురెదురుగా నిల్చుని ఉన్నారు.స్టేజిపై వరమాల కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా వధూవరులు ఒకరికొకరు స్వీటు తినిపించుకోవాలి. వరుడు స్వీటు తినిపించబోతుండగా వధువు నిరాకరించింది. దీంతో వరుడు ఆ స్వీటును ఆమె ముఖం మీదకు విసిరికొట్టాడు. కోపం వచ్చిన వధువు కూడా అతడి ముఖం మీదకు స్వీటును గట్టిగా విసిరికొట్టింది. కోపం పట్టలేకపోయినా వరుడు స్టేజి పైనే వధువును చెంపదెబ్బలు కొడుతూ విరుచుకుపడ్డాడు. అంతటితో వీడియో ఆగిపోయింది. ఇంత జరిగాక కూడా ఆ పెళ్లి పూర్తయిందా లేక మధ్యలోనే ఆగిపోయిందా తెలియరాలేదు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. వరమాల వేసేప్పుడు కూడా వధువు లేదా వరుడు ముఖం మీదకి విసిరికొట్టడం వంటి వీడియోలు కూడా గతంలో చాలా వైరల్ అయ్యాయి.
ఈ వీడియో కూడా వైరల్ అయింది...
View this post on Instagram