Best Health States : ఫస్ట్ కేరళ... తర్వాత తమిళనాడు, తెలంగాణ- ! 2019-20 హెల్త్ ఇండెక్స్ ర్యాంకులు ప్రకటించిన నీతిఆయోగ్ !
నీతి ఆయోగ్ విడుదల చేసిన హెల్త్ఇండెక్స్ జాబితాలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడు, తెలంగాణ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
దేశంలో కేరళ మరోసారి ఉన్నతంగా నిలిచింది. నీతిఆయోగ్ ప్రకటించిన హెల్త్ ఇండెక్స్ జాబితాలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. 2019-20కి సంబంధించి రాష్ట్రాలు ప్రజల ఆరోగ్యం కోసం తీసుకున్న అనేక చర్యలను విశ్లేషించి నీతిఆయోగ్ నిపుణుల బృందం హెల్త్ ఇండెక్స్ ర్యాంకులను ప్రకటించింది. ఇలాప్రకటించడం నాలుగో సారి . పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళమొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ప్రజలను ఆరోగ్య పరంగా పట్టించుకోకుండా .. అత్యంత వరస్ట్‌గా పేరు తెచ్చుకున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. పెద్దరాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉంది.
లోయర్ త్రీ స్టేట్స్ జాబితాలో మిగతా రెండు బీహార్, మధ్యప్రదేశ్.చిన్న రాష్ట్రాల్లో మిజోరం అన్నింటికన్నా మెరుగైన ఫలితాల్ని చూపించింది. కేరళ ఆరోగ్య సూచీల్లో మొదటి స్థానంలో ఉండటం ఇదే మొదటి సారి కాదు. నీతి ఆయోగ్ ర్యాంకులు ఇస్తున్నప్పటి నుండి కేరళది అదే స్థానం. నాలుగో సారి కేరళ హెల్త్ ఇండెక్స్‌లో మొదటి ర్యాంక్ సాధించింది. ఓవరాల్ పర్‌ఫార్మెన్స్, ఇంక్రిమెంటల్ ఫర్‌ఫార్మెన్స్ ను నీతి ఆయోగ్ క్యాలిక్యులేట్ చేసింది. ప్రభుత్వాల విధానాలు.. ప్రజల ఆరోగ్యం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు.. అమలు చేస్తున్న పద్దతి ఇలా 24 సూచికల సాయంతో ఈ హెల్త్ ఇండెక్స్‌ను సిద్దం చేస్తారు. ఒక్కో కేటగిరీకి స్కోర్లు కేటాయిస్తారు. ప్రపంచ బ్యాంకు సాంకేతిక సహకారంతో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో నీతిఆయోగ్ దీన్ని సిద్ధం చేస్తుంది.
కరోనా ప్రపంచంపై విరుచుకుపడుతున్న సమయంలో ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వాలకు అత్యంత కీలకంగా మారింది., ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ఎంత చురుకుగా వ్యవహరిస్తున్నాయో.. ఈ ఇండెక్స్ ద్వారా వెల్లడవుతోంది. ప్రజారోగ్యానికి ప్రభుత్వ విధానాలు .. ఎంత బాగా అణల్లో ఉన్నాయో కూడా తెలుస్తుంది. ప్రత్యేకమైన పారామీటర్స్ ద్వారాఈ హెల్త్ ఇండెక్స్ తయారు చేశారు. గతంతో పోలిస్తే మెరుగుపడుతున్న రాష్ట్రాల పనితీరునూ నీతి ఆయోగ్ విశ్లేషించింది.