అన్వేషించండి

తరచూ ముక్కు నుండి రక్తం కారుతుందా? అది ఆ తీవ్రమైన వ్యాధిని సూచిస్తుంది

ముక్కు నుంచి రక్తం కారడం అనేది సర్వసాధారణంగా పరిగణిస్తారు. కానీ కొన్నిసార్లు అది తీవ్రమైన వ్యాధికి లక్షణంగా చెప్పుకోవచ్చు.

వేడి చేసినప్పుడు లేక ముక్కుకి దెబ్బ తగిలినప్పుడు ముక్కు నుండి రక్తం కారడం సర్వసాధారణం. కానీ ఎలాంటి కారణాలు లేకుండా ముక్కు నుంచి తరచూ రక్తం కనిపిస్తూ ఉంటే మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు సంకేతంగా భావించవచ్చు. అందులోనూ ఈ వ్యాధి తీవ్రమైన దశకు చేరుకున్నప్పుడే ఇలా తరచూ ముక్కు నుండి రక్తం కారుతుంది. ఆల్కహాల్ అతిగా తాగే వారిలో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. ఆల్కహాల్ అలవాటు లేకపోయినా వచ్చేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని తినడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకు పోతుంది. ఇదే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధిగా చెప్పుకోవచ్చు.

ముందస్తు హెచ్చరికలు లేకుండా
ఈ వ్యాధి వచ్చినప్పుడు ప్రారంభంలో ఎటువంటి హెచ్చరిక సంకేతాలు కనిపించవు. కాలేయంలో  కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. కాలేయంలో ఇన్ఫ్లమేషన్ కలుగుతుంది. దీన్నే నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అంటారు. కాలేయంపై మచ్చలు ఏర్పడతాయి. దీర్ఘకాలంగా చికిత్స అందకపోతే అది సిర్రోసిస్ వ్యాధిగా మారిపోతుంది. సిర్రోసిస్ అనేది ఫ్యాటీ లివర్ వ్యాధిలో తీవ్రమైన దశగా చెప్పుకుంటారు. ఈ దశలో కాలేయం కుచించుకుపోతుంది. కాలేయంపై మచ్చలు, చిన్న చిన్న గడ్డలు ఏర్పడతాయి. 

ముక్కు నుండి రక్తం రావడం
తరచూ ఇలాంటి దెబ్బలు తగలకపోయినా, ముక్కు నుండి రక్తం కారడం అనేది సిర్రోసిస్ వ్యాధి లక్షణంగా చెబుతారు. దీన్ని ఎపిస్టాక్సెస్ అని కూడా పిలుస్తారు. నోట్లోని చిగుళ్లలో కూడా రక్తస్రావం కనిపిస్తుంది.

ఇతర లక్షణాలు 
ఫ్యాటీ లివర్ వ్యాధి సిర్రోసిస్ గా మారాక కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముక్కు నుండి రక్తస్రావం అవడంతో పాటు అలసట, బలహీనత, ఆకలి వేయకపోవడం, బరువు తగ్గడం, కండరాలు క్షీణించడం, వికారంగా ఉండడం, వాంతులు, కాలేయం ఉన్న ప్రదేశంలో నొప్పి రావడం, చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం, జుట్టు రాలిపోవడం, కాళ్లు పాదాలలో నీరు చేరడం, పొత్తికడుపులో వాపు రావడం వంటివి కనిపిస్తాయి.

ఈ లివర్ సిర్రోసిస్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల్లో ఇతక మార్పులు కూడా కనిపిస్తాయి. నిద్ర పట్టక ఇబ్బంది పడతారు. జ్ఞాపకశక్తి కోల్పోతారు. గందరగోళంగా ఉంటుంది. ఏ విషయం పైనా ఏకాగ్రత పెట్టలేరు. టాక్సిన్స్ మీ మెదడును ప్రభావితం చేస్తున్నప్పుడు, కాలేయం వాటిని శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. కానీ ఎప్పుడైతే కాలేయం సిర్రోసిస్ వ్యాధి బారిన పడుతుందో, మెదడులోని టాక్సిన్లను బయటికి పంపలేదు. దీనివల్ల పైన చెప్పిన ఇబ్బందులు కలుగుతాయి. 

కాలేయంలో కొవ్వు చేరే ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఊబకాయం లేదా అధిక బరువు. ఊబకాయం బారిన పడిన వారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.  థైరాయిడ్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి కూడా ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. 

Also read: ప్రతి భారతీయ మహిళా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన హక్కులు, చట్టాల జాబితా ఇదిగో

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Maruti Dzire Sales: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
Crime News: 'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
Jio vs Airtel vs Vi vs BSNL: రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget