Covid 19 Restrictions: కేంద్రం కీలక నిర్ణయం.. నవంబర్ 30 వరకు కొవిడ్ మార్గదర్శకాలు పొడిగింపు
దేశవ్యాప్తంగా కొవిడ్ మార్గదర్శకాలను నవంబక్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఉన్న కొవిడ్ మార్గదర్శకాలను నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో నిబంధలనలు అమలయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఓ లేఖ రాశారు.
కొవిడ్ -19 సమర్థవంతమైన నిర్వహణ కోసం ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా-కరోనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంపై నిరంతరం దృష్టి ఉంచాలని ఆ లేఖలో సూచించారు.
కొవిడ్-19 కట్టడికి అవసరమైన చర్యలు తీసుకునేలా స్థానిక, జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను భల్లా కోరారు. కొవిడ్ నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక అధికారులదేనని స్పష్టం చేశారు. దేశంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున కొవిడ్-19 ప్రోటోకాల్ పాటించే విషయంలో అలసత్వం ప్రదర్శించరాదని లేదని లేఖలో పేర్కొన్నారు.
సెప్టెంబర్ 28న కొవిడ్ మార్గదర్శకాలను అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. గడువు ముగుస్తుండటంతో మరో నెలరోజుల పాటు పొడిగించింది.
పండుగ వేళ..
దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో దీపావళి సహా పలు పండుగలు ఉన్నాయి. దీంతో పండుగ వేళల్లో గుంపులుగుంపులుగా ఉండరాదని, కరోనా నియమాలను పాటించాలని సూచించింది హోంశాఖ. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా మూడో వేవ్‌కు స్వాగతం పలికినవాళ్లమవుతామని హెచ్చరించింది.
గత కొన్నిరోజులుగా దేశంలో రోజువారి కరోనా కేసులు 10-20 వేల లోపే నమోదవుతున్నాయి. అయితే గురువారం మాత్రం 16,156 కరోనా కేసులు నమోదయ్యాయి. 733 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 34,321,809కి చేరింది. మరణాల సంఖ్య 456,386గా ఉంది. గత వారం వ్యాక్సినేషన్‌లో భారత్ అరుదైన మైలురాయిని చేరుకుంది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసి రికార్డు సృష్టించింది.
Also Read: NEET Result 2021: నీట్ పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
Also Read: Cruise Chip Drugs Case: ముంబయి డ్రగ్స్ కేసు అప్‌డేట్.. కీలక సాక్షి గోసవీ అరెస్ట్
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
Also Read: T20 WC, Ind vs NZ: న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత్‌కు కీలకం కానున్న టాప్-5 ప్లేయర్లు వీరే!
Also Read: IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?
Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి