అన్వేషించండి

Covid treatment: కరోనా వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లకి ప్రభుత్వం సూచించిన మందులివే

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులు జ్వరం వస్తే పారాసెటమాల్ దగ్గు వస్తే ఆయుష్‌ సిరప్‌ వేసుకోవచ్చని చెప్తున్నారు నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్.

దేశంలో కరోనా కేసులు, అందులో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మందులు ఇష్టారీతిన వాడకం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 
మితిమీరిన మందుల వాడకంపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కొన్ని మందులను సూచించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లు వీటిని ఉపయోగించ వచ్చని పేర్కొన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లు జ్వరం వస్తే పారాసెటమాల్, దగ్గు వస్తే ఆయుష్‌ సిరప్‌ వాడొచ్చని సలహా ఇచ్చారు. 
"జ్వరానికి పారాసెటమాల్ ఇస్తాం. దగ్గుకు ఆయుష్ సిరప్‌ వాడొచ్చు. హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు మేం సూచించే మందులివే. దగ్గు మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటే బుడెసోనైడ్‌ అనే ఇన్‌హెల్లర్‌ వాడొచ్చు. ఈ మూడింటిని వాడితే చాలు" - డా. వీకే పాల్‌

వీటితోపాటు వేడినీళ్లను పుక్కిలిస్తూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే చాలు అంటున్నారు వీకే పాల్. 

Covid treatment: కరోనా వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లకి ప్రభుత్వం సూచించిన మందులివే

ఆసుపత్రిలో చేరే వాళ్లకు  వినియోగించాల్సిన మందులపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని దాని ప్రకారమే ట్రీట్‌మెంట్‌ చేయాలన్నారాయన. ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ప్రకారమే డెక్సామెథాసోన్ మరియు రెమెడిసివిర్ వాడాలని తెలిపారు వీకే పాల్‌.

"రోగులు ఆసుపత్రిలో చేరినప్పుడు ఆక్సిజన్ అవసరమైనప్పుడు రూల్స్‌కు అనుగుణంగా మిథైల్ప్రెడ్నిసోలోన్ లేదా డెక్సామెథాసోన్ మెడిసిన్ వాడాలి. హెపారిన్‌ను కూడా ఆసుపత్రుల్లో వైద్యులే ఇస్తారు. రెమ్‌డెసివిర్‌కి ఇచ్చేందుకు కూడా  స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ మందులను ఇంట్లో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అది మరింత ప్రమాదకరం. మితిమీరిన వినియోగం ఆందోళన కలిగిస్తోంది." - డా. వీకే పాల్‌

అత్యుత్తమ వైద్య నిపుణులతో ఈ ప్రోటోకాల్‌  డెవలప్‌ చేశామని... మందుల దుర్వినియోగం ఆందోళన కలిగిస్తోందన్నారు డాక్టర్ వీకే పాల్. 

ఎక్కువ స్టెరాయిడ్స్ వాడకం వల్ల మ్యూకోర్మైకోసిస్ వచ్చే అవకాశం ఉందన్నారు వీకే పాల్. స్టెరాయిడ్స్‌కు ప్రాణాలను రక్షించే శక్తి  ఉందని... అదే టైంలో వాటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయన్ననారు. రోగనిరోధక శక్తిని తగ్గించి బాడీలోని జీవప్రక్రియలకు భంగం కలిగిస్తాయని తెలిపారు. 

ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకొని స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు వీకేపాల్. కరోనా ప్రోటోకాల్‌ ప్రకారం మందులు వేసుకొని కరోనా నుంచి క్షేమంగా బయటపడాలన్నారు.

Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Philippines Earthquake Videos: స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
IND vs AFG Test Highlights: భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Philippines Earthquake Videos: స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
IND vs AFG Test Highlights: భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rajinikanth Annamalai New Party TN: అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
RERA Rules: ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
Carpal Tunnel Syndrome : యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
Embed widget