By: Haritha | Updated at : 30 Nov 2022 10:10 AM (IST)
(Image credit: Pixabay)
వాతావరణం చల్లబడితే చాలు శ్వాసకోశ సమస్యలు రావడానికి సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా కఫం పట్టి ఊపిరి సరిగా ఆడదు. ముక్కు దిబ్బడతో నిద్ర సరిగా పట్టదు. దీనికి కూడా దగ్గు కూడా జత చేరితే ఇక ఇబ్బంది మామూలుగా ఉండదు. అందులోనూ ఇంకా కరోనా పోలేదు, ఇవి దేనివల్ల వచ్చాయో తెలియక చాలా ఇబ్బంది పడతారు. కఫం వల్ల ముఖంలోని నుదుటి భాగంలో కూడా నొప్పులు రావడం మొదలవుతుంది. అలా వచ్చిందంటే అర్థం, ఈ శ్లేష్మం బాగా ఉందని అర్థం. దాన్ని వదిలించుకోవాలంటే ఇంగ్లిషు మందులే కాదు ఆయుర్వేదం చెప్పే ఇంటి చిట్కాలతో కూడా సాధ్యమే.
లవంగ టీ తయారీ
లవంగ టీ రోజుకు రెండు సార్లు తాగితే ఇది కఫాన్ని విరిచేస్తుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా లవంగాలు, చిన్న అల్లం ముక్క, చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకోవాలి.రెండు కప్పుల నీళ్లు పోసి, పైన చెప్పిన వన్నీ వేసి మరిగించాలి. బాగా మరిగాక వడకట్టేయాలి. ఆ నీటిలో అరచెంచా తేనె కలుపుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు. దీనివల్ల తేనెలోని ఎన్నో సుగణాలు పోతాయి. గోరువెచ్చగా అయ్యాక కలుపుకుని సిప్ చేస్తూ తాగాలి. ఈ మిశ్రమం గొంతులోకి జారుగుతుంటేనే ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంది.
అలాగే కఫం పట్టినప్పుడు ఆహారం కూడా ప్రత్యేకంగా తీసుకుంటే మంచిది. కాకరకాయను అధికంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాకర కాయ పులుసు, లేదా వేపుడు రూపంలో తింటే మంచిది. కఫం పట్టిన వేళ మూడు పూటలా కాకరకాయల వంటలు తిన్నా మంచిదే. ఇలా తినడం వల్ల ఊపిరితిత్తుల్లో,ముక్కులో పట్టిన కఫం అంతా విరిగిపోయి, ముక్కు ద్వారా, నోటి ద్వారా వచ్చేస్తుంది. దగ్గు, జలుబు త్వరగా తగ్గిపోతాయి.
ఈ టీలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇతర సమస్యలను ఇది అడ్డుకుంటుంది. సైనస్ సమస్యతో బాధపడేవారు కూడా ఈ మిశ్రమాన్ని తాగితే ఎంతో మంచిది. శ్వాసకోశ సమస్యలు వచ్చినప్పుడే కాదు, ఈ టీని తరచూ తాగడం అలవాటు చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, జ్వరం, దగ్గు వంటివి త్వరగా దాడి చేయవు.
Also read: రోజుకో గుడ్డు తినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి
Ayurvedic Diet: ఆయుష్షు కావాలా? ఆయుర్వేదం చెప్పిన ‘70-30’ ఫార్ములా ఫాలో అయిపోండి
కడుపులో మంటగా ఉందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో వెంటనే ఉపశమనం
Triphala Churnam: త్రిఫల చూర్ణం తీసుకుంటే అందం, ఆరోగ్యం- దాన్ని ఎలా తీసుకోవాలంటే?
Belly Fat: పొట్ట దగ్గర కొవ్వు కరగడం లేదా? ఈ ఆయుర్వేద మార్గాలు ట్రై చేసి చూడండి
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్ని కూడా !
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
RBI Policy: దాస్ ప్రకటనల్లో స్టాక్ మార్కెట్కు పనికొచ్చే విషయాలేంటి?