అన్వేషించండి

Wet Clothes : తడి దుస్తులను ఇంట్లో ఆరేస్తున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే, ఎందుకంటే?

ఉతికిన తర్వాత తడి దుస్తులను ఇంట్లో ఆరేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే కారణాలు ఏంటో తెలుసుకుందాం.

చలికాలంలో సూర్య కాంతి ఎక్కువగా ప్రకాశించదు. వర్షాకాలంలో కూడా ఎండ ఎక్కువగా ఉండదు. పైగా వచ్చే నాలుగు రోజుల్లో వర్షం వచ్చే అవకాశముందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆ సమయంలో దుస్తులు ఆరబెట్టుకోవడం చాలా కష్టం. వర్షం పడని ప్రాంతంలో వాటిని వేసినా అవి చల్లగానే ఉంటాయి. అందుకే చాలామంది తడి ఆరేందుకు ఇంట్లో ఫ్యాన్ కింద బట్టలు ఆరేస్తారు. కొందరు దుస్తులు ఆరేసేందుకు సరైన ప్లేస్ లేక.. ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరోస్తారు.  అయితే గదిలో తడి దుస్తులు ఆరేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అవి ఇంటి లోపల తేమను పెంచడమే కాకుండా, ఇంట్లో ఫంగస్ సహా అనేక రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని సూచిస్తున్నారు. చిన్న పిల్లలలో సైనస్, అలెర్జీలు  న్యుమోనియాకు కారణమవుతుందని  నిపుణులు సూచిస్తున్నారు.

దుస్తులను ఎండలో కాకుండా ఇంటి లోపల తరచుగా ఆరబెట్టినట్లయితే.. అది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని ఓ అధ్యయనం తెలిపింది. మాంచెస్టర్‌లోని నేషనల్ ఆస్పెర్‌గిలోసిస్ సెంటర్‌లోని పరిశోధకులు తమ అధ్యయనం ఆధారంగా, తడి దుస్తులను ఇంటి లోపల ఆరబెట్టే వ్యక్తులకు కొన్ని రకాల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. పరిశోధన ప్రకారం, దుస్తులు లోపల ఆరబెట్టడం వల్ల గదిలో తేమ 30 శాతం పెరుగుతుంది. ఇది ఆర్స్పెగిల్లస్ ఫ్యూమిగేటస్ స్పోర్స్ అనే ఫంగస్ వృద్ధికి కారణమవుతుంది. ఇది శ్వాసకోశ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శ్వాసనాళాలు, సైనస్, ఊపిరితిత్తులు దీనికి ప్రభావితం అవుతాయి. ఒకవేళ ఇంట్లో దుస్తులను ఆరేయాల్సిన పరిస్థితి వస్తే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

దుస్తులు ఇంట్లో ఆరవేసినప్పుడు దుర్వాసన రాకుండా ఉండాలంటే.. గదిలో ఒక మూల అగరబత్తులు వెలిగించండి. కానీ దుస్తుల నుంచి దూరంగా వెలిగించండి. అగరబత్తుల నుంచి వచ్చే పొగ.. అవి త్వరగా ఆరిపోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మంచి వాసన కూడా వస్తాయి. అలాగే ఉతికేటప్పుడు 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ ని నీళ్లలో వేయాలి. ఇది ఇంట్లో దుర్వాసన రాకుండా చేస్తుంది. దుస్తులకు మృదుత్వాన్ని కూడా ఇస్తుంది.

ఉప్పుతో తేమకు చెక్..

దుస్తులు తడిగా ఉన్నప్పుడు.. వాటిలోని తేమ స్థాయిని తగ్గించడానికి ఉప్పు మంచి మార్గం. దీనికోసం బ్యాగ్‌లో ఉప్పు నింపి గదిలో ఒక మూల ఉంచండి. ఉప్పు తేమను గ్రహిస్తుంది. తద్వార ఫంగస్ కంట్రోల్​ అవుతుంది. 

 నీరు లేకుండా దుస్తులను పిండండి..

ఎండలో అయినా.. నీడలో అయినా దుస్తులు ఆరవేయాల్సి వస్తే.. ముందే వాటిని బాగా పిండండి. అనంతరం వాటిని హ్యాంగ్ చేయండి. దుస్తులను ఇంట్లో ఆరవేసినప్పుడు కిటికీలు బాగా తెరిచి ఉంచండి. వెంటిలేషన్ బాగా ఉంటే.. దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.  

 హ్యాంగర్లు ఉపయోగించండి 

దుస్తులు త్వరగా ఆరేందుకు మీరు హ్యాంగర్లు ఉపయోగించవచ్చు. ఇవి దుస్తులు కలిసిపోకుండా.. వదులుగా ఉండి త్వరగా ఆరేందుకు వీలవుతుంది. 

Also Read : పైనాపిల్ జ్యూస్ ఉపయోగాలు తెలిస్తే, డాక్టర్ అవసరం ఉండదేమో!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Perni Nani Wife Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
AP In WEF 2025: దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Perni Nani Wife Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
AP In WEF 2025: దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
Lucknow Crime News : అక్కాచెల్లెళ్లను హైదరాాబాద్‌లో అమ్మేస్తారని చంపేశా - సంచలనం రేపుతున్న లక్నో హత్య కేసు నిందితుడి వీడియో
అక్కాచెల్లెళ్లను హైదరాాబాద్‌లో అమ్మేస్తారని చంపేశా - సంచలనం రేపుతున్న లక్నో హత్య కేసు నిందితుడి వీడియో
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Embed widget