Pineapple Juice : పైనాపిల్ జ్యూస్ ఉపయోగాలు తెలిస్తే, డాక్టర్ అవసరం ఉండదేమో!
పైనాపిల్ ఫ్లేవర్ అంటే ఇష్టపడని వారు ఉండరు. దీని రసం తాగేందుకు అందరూ ఇష్టపడతారు. పైనాపిల్ వైద్యపరంగా కూడా ఒక దివ్యౌషధం అని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టపడే ఫలాల్లో పైనాపిల్ కూడా ఒకటి. దీని ఫ్లేవర్ చాలా ఫేమస్. పైనాపిల్ జ్యూస్ తాగేందుకు అందరూ ఇష్టపడతారు. ముళ్ల జాతికి చెందిన పైనాపిల్ నేరుగా తినడం కన్నా కూడా పండ్ల రసం రూపంలో తాగేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా పైనాపిల్ రసం అంటే పిల్లలకు చాలా ఇష్టం. తెలుగులో దీన్ని అనాస పండు అనిపిలుస్తారు. మన దేశంలో ఆంగ్లేయులు ఈ పంటను ప్రవేశపెట్టారు. ఇది భారతదేశంలో మాత్రమే కాకుండా థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, కెన్యా, చైనా, ఫిలిప్పీన్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. అనేక దేశాల్లో పైనాపిల్ రసాన్ని వివిధ వ్యాధులను నిరోధించడానికి సాంప్రదాయ ఔషధంగా ఉపయోగిస్తారు.
ఆధునిక పరిశోధనలు పైనాపిల్ జ్యూస్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, అసిడిటీ, కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కోసం కూడా పైనాపిల్ జ్యూస్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
పైనాపిల్ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం:
పైనాపిల్ రసంలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి:
పైనాపిల్ రసంలో ముఖ్యంగా మాంగనీస్, కాపర్, విటమిన్ బి6, సి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, తక్షణ శక్తి ఉత్పత్తి వంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో కొంత మొత్తంలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కోలిన్, విటమిన్ కె, బి సైతం ఉంటాయి.
యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం:
పైనాపిల్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది మీ శరీరాన్ని డ్యామేజ్ చేసే వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్‌ల సమూహం కూడా ఉంటుంది, ఇది ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
శస్త్రచికిత్స నుంచి కోలుకోవడానికి దివ్యౌషధం.:
పైనాపిల్ రసంలో బ్రోమెలైన్ ఉంటుంది, ఇది వివిధ ఎంజైమ్‌ల సమూహం. ఇది గాయం నుంచి రికవరీ అవడం, శస్త్రచికిత్స, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కలిగే వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో పైనాపిల్ రసం పెద్ద పాత్ర పోషిస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. యాంటీ బయాటిక్స్ ప్రభావాన్ని పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది.
జీర్ణక్రియలో కూడా సహాయపడుతుంది:
పైనాపిల్ జ్యూస్‌లో బ్రోమెలైన్ ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, హానికరమైన, అతిసారం కలిగించే బాక్టీరియా నుంచి రక్షిస్తుంది , ప్రేగు పూత ఉన్నవారిలో వాపును తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చు:
పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అనేక పరిశోధనలలో గుర్తించారు.
అనేక రకాల క్యాన్సర్లతో పోరాడగలదు:
బ్రోమెలైన్ జీర్ణక్రియ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా అనేక రకాల క్యాన్సర్ల నుంచి మిమ్మల్ని కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆస్తమా లక్షణాలను కూడా తగ్గించవచ్చు:
ఆస్తమాతో సంబంధం ఉన్న లక్షణాలను తగ్గించడంలో పైనాపిల్ రసం ప్రభావవంతంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల్లో పైనాపిల్ లో ఉండే బ్రోమెలైన్ ఆస్తమా ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా, ఇందులో ఉండే విటమిన్ సి జలుబు , దగ్గు నుంచి కూడా కాపాడుతుంది.
Also Read : వంకాయ తరచూ తింటే గుండెపోటును అడ్డుకోవచ్చా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.