అన్వేషించండి

SBI Clerks Halltickets: ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

SBI Admitcard: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్‌ అసోసియేట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రాథమిక పరీక్ష పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు.

State Bank of India Clerks Halltickets: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)లో జూనియర్‌ అసోసియేట్(SBI Clerk) పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రాథమిక పరీక్ష (Prelims) పరీక్ష హాల్‌టికెట్లు ఫిబ్రవరి 10న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. మార్చి 1 వరకు అడ్మిట్‌కార్డులు అందుబాటులో ఉంటాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫిబ్రవరి 22, 27, 28 తేదీలతోపాటు మార్చి 1న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు.. మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.

దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్లర్క్‌ (జూనియర్‌ అసోసియేట్‌) పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 17న నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 13,735 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 342; అమరావతి సర్కిల్‌లో 50 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి నవంబరు 17 నుంచి డిసెంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

క్లర్క్స్ ప్రిలిమ్స్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

* జూనియర్‌ అసోసియేట్స్‌ (క్లరికల్‌ కేడర్‌) పోస్టులు

ఖాళీల సంఖ్య: 13,735 పోస్టులు 

రాష్ట్రాల వారీగా ఖాళీలు: గుజరాత్- 1073, ఆంధ్రప్రదేశ్- 50, కర్ణాటక- 50, మధ్యప్రదేశ్- 1317, ఛత్తీస్‌గఢ్- 483, ఒడిశా- 362, హరియాణా- 306, జమ్ము & కశ్మీర్ యూటీ- 141, హిమాచల్ ప్రదేశ్- 170, చండీగఢ్ - 32, లడఖ్ యూటీ- 32, పంజాబ్- 569, తమిళనాడు- 336, పుదుచ్చేరి- 04, తెలంగాణ- 342, రాజస్థాన్- 445, పశ్చిమ బెంగాల్- 1254, అండమాన్‌ & నికోబార్‌ దీవులు- 70, సిక్కిం- 56, ఉత్తర్‌ప్రదేశ్- 1894, మహారాష్ట్ర- 1163, గోవా- 20, దిల్లీ- 343, ఉత్తరాఖండ్- 316, అరుణాచల్ ప్రదేశ్- 66, అస్సాం- 311, మణిపుర్- 55, మేఘాలయ- 85, మిజోరం- 40, నాగాలాండ్- 70, త్రిపుర- 65, బిహార్- 1111, జార్ఖండ్- 676, కేరళ- 426, లక్షద్వీప్- 02.

ప్రిలిమినరీ పరీక్ష విధానం: మొత్తం100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు-30 మార్కులు; న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు; రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 (0.25) మార్కుల చొప్పున కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి తర్వాతి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.  

మెయిన్‌ పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 190 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. ఇందులో జనరల్‌/ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు; క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు; రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
ఆంధ్రప్రదేశ్‌: అనంతపురం, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.

బేసిక్‌ పే: నెలకు రూ.26,730.

నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే
UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే
SSC Results 2026: పదతరగతి ఫెయిల్ అయినా పిలిచి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు! పూర్తి వివరాలు ఇవే!
పదతరగతి ఫెయిల్ అయినా పిలిచి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు! పూర్తి వివరాలు ఇవే!
Oracle layoffs: ఇప్పుడు ఒరాకిల్ వంతు - 20వేల మంది సీనియర్లకు ఊస్టింగ్ - ఏఐ మింగేస్తోంది!
ఇప్పుడు ఒరాకిల్ వంతు - 20వేల మంది సీనియర్లకు ఊస్టింగ్ - ఏఐ మింగేస్తోంది!
8th Pay Commission: కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?
కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Woman in Muscat: కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Karuppu: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
IPL 2026 KKR VS SRH Result Update: బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
Dating Trend : అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Embed widget