అన్వేషించండి
Advertisement
Deepthi Sunaina: మనదొక టాక్సిక్ జనరేషన్ - దీప్తి సునైనా ఎమోషనల్ పోస్ట్
బ్రేకప్ తరువాత దీప్తి సునైనా సోషల్ మీడియాలో కొన్ని ఎమోషనల్ పోస్ట్ లు పెట్టేది. తాజాగా ఈ బ్యూటీ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఓ పోస్ట్ పెట్టింది.
డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయింది దీప్తి సునైనా. ఆ తరువాత సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. తన క్యూట్ లుక్స్, మాటలతో చాలా మంది ఫాలోవర్స్ గా మార్చుకుంది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకి నాలుగు మిళియన్లకు దగ్గరగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ నెంబర్ పెరుగుతూనే ఉంటుంది. షార్ట్స్ ఫిలిమ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు ఒకట్రెండు సినిమాల్లో కూడా నటించింది. చాలా కాలం పాటు షణ్ముఖ్ జస్వంత్ తో డేటింగ్ చేసిన ఆమె రీసెంట్ గా బ్రేకప్ చెప్పేసింది.
బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్.. సిరితో సన్నిహితంగా ఉండడమే వీరి బ్రేకప్ కి కారణమని చెబుతుంటారు. బ్రేకప్ తరువాత దీప్తి సునైనా సోషల్ మీడియాలో కొన్ని ఎమోషనల్ పోస్ట్ లు పెట్టేది. ఆ తరువాత మెల్లగా మూవ్ ఆన్ అయిపోయింది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోషూట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఓ పోస్ట్ పెట్టింది.
''హెల్తీ రిలేషన్షిప్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలియని ఒక టాక్సిక్ జనరేషన్ మనది. 'నేను ఎవరికీ రుణపడి లేను' అని లైన్స్ మాత్రం చెప్తుంటాం. కానీ నిజానికి మనం చాలా మందికి రుణపడి ఉంటాం. మీరు బాధపెట్టిన వారికి క్షమాపణ చెప్పాలి.. సపోర్ట్ చేసిన వారికి కృతజ్ఞతగా ఉండాలి. అలానే మీరు అగౌరవపరిచే, గౌరవించే వారికి కూడా రుణపడి ఉంటారు. జవాబుదారీతనంగా ఉంటూ.. మన నిజాయితీను, మోరల్ ప్రిన్సిపల్స్ ను కాపాడుకోవాలి. ఇతరుల జీవితాలపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపించే మన యాక్షన్స్ గురించి తెలుసుకునేవరకు వరకు మనం ఎప్పటికీ ఈ బ్రోకెన్ సొసైటీలోనే బతుకుతాం'' అంటూ రాసుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
గాసిప్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion