అన్వేషించండి

Varasudu Release Date : తెలుగు రాష్ట్రాల్లో విజయ్ ‘వారసుడు’ సినిమా వాయిదా?

తమిళ నటుడు విజయ్ నటించిన ‘వారసుడు’ గత రెండు రోజులుగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. తెలుగు వెర్షన్ లో విడుదల వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి..

తమిళ స్టార్ హీరో విజయ్ తాజాగా నటించిన సినిమా ‘వారిసు’. ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘వారసుడు’ పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉంది. ఏకకాలంలో తమిళంతో పాటు తెలుగు లోనూ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు దర్శకనిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 11న తెలుగు రాష్ట్రాల్లో భారీగా సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. తెలుగు వెర్షన్ లో విడుదల వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్ కు మంచి పాపులారిటి పెరుగుతోంది. ఆయన సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అందుకే విజయ్‌కు తెలుగు మార్కెట్ లో ఉన్న పాపులారిటీతోనే ‘వారిసు’ చిత్రాన్ని ఏకకాలంలో రెండు భాషల్లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ అనుమతుల విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ముందుగా ప్రకటించిన తేదీకి సినిమా విడుదల కాకపోచ్చనే వార్తలు వస్తున్నాయి. అందుకే మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ను మారుస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం, విడుదల తేదీ దగ్గరపడిపోవడం ఇవన్నీ మూవీ రిలీజ్ పై ప్రభావం చూపుతున్నాయి.

అయితే దిల్ రాజు కాంపౌండ్ నుంచి మాత్రం మరో విధంగా వార్తలు బయటకు వస్తున్నాయి. ‘వారసుడు’ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేవని, అనుకున్న సమమయానికి తెలుగు రాష్ట్రల్లో విడుదల చేస్తామని దిల్ రాజు సన్నిహితులు బల్లగుద్ది చెబుతున్నారట. రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అనుకున్న సమయానికి రిలీజ్ కష్టమే అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే వార్తలు వస్తున్నాయి. ఇక సినిమా సక్సెస్ టాక్ వస్తేనే దిల్ రాజు సేఫ్ జోన్ లో ఉంటాడు. లేదంటే చాలా కష్టమే అంటున్నారు మూవీ క్రిటిక్స్.

సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తెలుగు ప్రేక్షకుల మాట అటుంచితే తమిళ ప్రేక్షకులు మాత్రం రచ్చ రచ్చ చేయడం గ్యారెంటీ అంటున్నారు. మూవీ విడుదలపై చిత్ర బృందం వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తెలుగులో ‘వారసుడు’ ట్రైలర్ పై కాస్త నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. మరి దిల్ రాజు వీటన్నిటినీ ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి. ఈ సినిమా తో పాటు తమిళ నటుడు అజిత్ నటిస్తోన్న సినిమా ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదల కాబోతోంది. అలాగే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. 

Read Also: ఒక్కో కుటుంబంలో పది మంది హీరోలున్నారు - టాలీవుడ్‌పై అడవి శేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today November 19th: కార్తీకదీపం 2 సీరియల్: కుమిలిపోతున్న జ్యోత్స్న.. గ్రానీ ఇక నా జీవితంలో లేదు! జ్యోత్స్నని మర్చిపోతున్న సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: కుమిలిపోతున్న జ్యోత్స్న.. గ్రానీ ఇక నా జీవితంలో లేదు! జ్యోత్స్నని మర్చిపోతున్న సూరజ్!
Bigg Boss Season 10 Today November 18th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బెడ్‌రూం ఆధిపత్యం త్రిగుణ్‌దే! ఇక నో పవర్ కీస్‌! అల్టిమేట్ పవర్ కోసం పోరాటం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బెడ్‌రూం ఆధిపత్యం త్రిగుణ్‌దే! ఇక నో పవర్ కీస్‌! అల్టిమేట్ పవర్ కోసం పోరాటం!
ENE Repeat OTT : ఓటీటీలోకి 'ENE Repeat' - తరుణ్ భాస్కర్ కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి 'ENE Repeat' - తరుణ్ భాస్కర్ కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Panchayat Series Season 5 OTT: ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 5 - ఫులేరాలో మళ్లీ మొదలుకానున్న రాజకీయ రచ్చ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 5 - ఫులేరాలో మళ్లీ మొదలుకానున్న రాజకీయ రచ్చ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget