(Source: Poll of Polls)
Adivi Sesh: ఒక్కో కుటుంబంలో పది మంది హీరోలున్నారు - టాలీవుడ్‌పై అడవి శేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
తెలుగు సినిమా పరిశ్రమపై హీరో అడవి శేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో బంధుప్రీతి కారణంగా బయటి వ్యక్తులను మెయిన్ రోల్స్ కోసం ఆడిషన్స్ కు పిలవరని తేల్చి చెప్పారు.
హీరో అడవి శేష్ టాలీవుడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీలో బంధుప్రీతి చాలా ఎక్కువగా ఉందని, అందుకే సినిమాల్లో మెయిన్ రోల్స్ చేయడానికి బయటి వ్యక్తులను ఆడిషన్స్‌కు పిలిచే సాహసం చేయడం లేదని శేష్ అన్నాడు. ‘బాలీవుడ్ హంగామా’ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో శేష్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఆ మీటింగ్‌లో అడవి శేష్ మాట్లాడుతూ.. తెలుగులో ఆడిషన్స్ సంస్కృతి లేదని తెలిపాడు. ఇప్పటికే సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు మెయిన్ రోల్స్ కు నేరుగా సెలక్ట్ అవుతున్నట్లు పేర్కొన్నాడు. సినిమా కుటుంబం నుంచి రాని వారిని ప్రధాన పాత్రలకు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నాడు. “వాస్తవానికి తెలుగులో ఆడిషన్ సంస్కృతి లేదు. కీలక పాత్రల కోసం ఆడిషన్స్ జరగవు. కేవలం హీరో పక్కన ఉండే వారి కోసమే ఆడిషన్స్ జరుగుతాయి. నేను ఈ పద్దతిని నియంత్రించాలని అనుకున్నాను. అందుకోసమే స్క్రీప్ట్ రాయడం మొదలు పెట్టాను” అన్నాడు.
ఒక్క కుటుంబంలో 10 మందికి పైగా హీరోలున్నారు
తెలుగులో ఒక సినిమా కుటుంబంలో దాదాపు పది మంది హీరోలు ఉన్నారని, అందుకే బయటి వారికి మంచి అవకాశాలు రావడం లేదని అడవి శేష్ పేర్కొన్నాడు. “నేను ఆరు సినిమాలు చేశాను. వాటిలో నాలుగు సినిమాలకు నేను స్క్రిప్ట్ రాశాను. తెలుగులో ఒక్కో సినిమా కుటుంబంలో పది మంది హీరోలు ఉంటారు. కాబట్టి, వారి నుంచి మంచి స్క్రిప్ట్ రావాలంటే, ఛాయిస్ నంబర్ 53లా ఉంటుంది” అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. జాతీయ మీడియాలో ఇప్పుడు అడవి శేష్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
అడవి శేష్ తాజాగా సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ ‘HIT 2’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. మీనాక్షి చౌదరితో కలిసి సినిమాలో నటించాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ‘మేజర్’తో మంచి సక్సెస్ అందుకున్నాడు. స్త్రీలను లక్ష్యంగా చేసుకునే సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు స్టోరీతో ఈ సినిమా ముందుకుసాగుతోంది. ఇందులో పోలీస్ అధికారి కృష్ణ దేవ్(కేడీ) అడవి శేష్ నటించాడు.
View this post on Instagram
Read Also: అరెరే ‘అవతార్-2’ ఎంత పనిచేసింది - జపాన్ థియేటర్లకు ఊహించని దెబ్బ, పాపం ప్రేక్షకులు