Vijay: కొడుకు డెబ్యూ ఫిల్మ్ పై స్టార్ హీరో రియాక్షన్ ఇదే
తన కొడుకు డెబ్యూ ఫిల్మ్ పై రియాక్ట్ అయ్యారు హీరో విజయ్.
కోలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న తలపతి విజయ్ 'బీస్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిజానికి చాలా ఏళ్లుగా విజయ్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. కానీ 'బీస్ట్' కోసం మాత్రం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. గతంలో తను చెప్పిన విషయాన్ని మీడియా మార్చి రాసిందని.. అందుకే అప్పటినుంచి ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు విజయ్.
అలానే తన కొడుకు సంజయ్ డెబ్యూ గురించి మాట్లాడారు. సంజయ్ యాక్టివిటీస్ చూస్తే అతడికి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉందనే అనిపిస్తుంది. ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించడంతో పాటు డైరెక్ట్ కూడా చేశాడు సంజయ్. దీంతో చాలా మంది దర్శకులు అతడిని లాంచ్ చేయాలని చూస్తున్నారు. అయితే తన కొడుకు ఈ విషయంపై ఏం ఆలోచిస్తున్నాడో తనకు తెలియదని చెప్పారు విజయ్.
సంజయ్ నిర్ణయం గురించి తనకు ఐడియా లేదని.. కానీ అతడి ఎలాంటి డెసిషన్ తీసుకున్నా సపోర్ట్ చేస్తానని అన్నారు. కొన్నాళ్లక్రితం 'ప్రేమమ్' సినిమా డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ తనను కలిసి స్టోరీ నేరేట్ చేశాడని.. ముందు తన కోసం కథ చెబుతున్నారేమో అనుకున్నానని విజయ్ అన్నారు. కానీ ఆ తరువాత సంజయ్ కోసం కథ చెబుతున్నారని రియలైజ్ అయ్యానని అన్నారు. అయితే సంజయ్ ఆ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేశాడని.. తనకు ఇంకా సమయం కావాలని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు విజయ్. దర్శకుడు చెప్పిన కథ మాత్రం తనకు నచ్చిందని అన్నారు.
Also Read: 'బీస్ట్' సినిమా టికెట్స్ కొంటే పెట్రోల్ ఫ్రీ - ఎక్కడో తెలుసా?
Also Read: రాజమౌళి, నాగ చైతన్య వాడే ఈ కారు ప్రత్యేకతలు తెలుసా? ఆస్తులు అమ్మినా దీన్ని కొనలేం!
View this post on Instagram
View this post on Instagram