Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చెప్పులేసుకుని ప్రమోషన్స్‌కు వచ్చేది అందుకే!
లైగర్ సినిమా ప్రమోషన్స్ లో చెప్పులు వేసుకోవడానికి కారణం చెప్పేశాడు మన రౌడీ బాయ్.
సాధారణంగా సినిమా వాళ్ళంటే బ్రాండెడ్ దుస్తులు, యాక్సెసరీస్ ధరించే కనిపిస్తారు. ఇక సినిమా ప్రమోషన్స్ అంటే ఇంకొంచెం ఎక్కువ రెడీ అవుతూ ఉంటారు. కానీ మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాత్రం లైగర్ ప్రమోషన్స్ లో చాలా సింపుల్ గా కనిపిస్తున్నారు. చెప్పులేసుకుని ప్రమోషన్స్ లో పాల్గొంటూ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు. రౌడీ బ్రాండ్ తో బిజినెస్ నడుపుతున్న విజయ్ సినిమా ప్రమోషన్స్ అంటే ఎంత స్టైలిష్ గా ఉండాలి. తన దుస్తులు దగ్గర నుంచి అన్నీ బ్రాండెడ్ వేసుకుంటాడని అనుకుంటారు. కానీ మన హీరో మాత్రం చాలా సింపుల్ గా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు. బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ కూడా ఇదే అడిగేశాడు. అదేంటబ్బా ఎందుకు అలా వస్తున్నారని నెటిజన్లు తెగ ఆలోచించేస్తున్నారు. చెప్పులు వేసుకుని రావడానికి రౌడీ బాయ్ సమాధానం ఇచ్చేశాడు.
సమయం వెస్ట్ కాకుండా ఉండేందుకే ఇలా చెప్పులతో వస్తున్నాడట. ఇటీవల ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు విషయం చెప్పేశాడు. "సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండేందుకే ఇలా చెప్పులు వేసుకుని వెళ్తున్నాను. లైగర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు నేను రోజు వెళ్ళాలి. రోజు మంచి బట్టలు వాటికి మ్యాచ్ అయ్యే విధంగా షూస్ వెతికి పెట్టుకోవడం చాలా కష్టం. దానికి ఎక్కువ టైం కేటాయించాలి. అందుకే సింపుల్ గా ఉండేలాగా చెప్పులు కొనుక్కున్నా. ఇవి అయితే అన్నిటికీ సెట్ అవుతాయి. త్వరగా రెడీ అయిపోవచ్చు” అని అసలు విషయం చెప్పేశాడు మనోడు. అదండీ మరి అసలు విషయం. అందుకే రౌడీ బాయ్ ఎక్కడ చూసినా చెప్పులతోనే కనిపించేందుకు కారణం.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా తెరకెక్కిన చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు ప్రేక్షకులని ఉర్రూతలుగిస్తున్నాయి. ఆగస్టు 25 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటివరకు నాలుగు పాటలు విడుదల కాగా, ఒక్కో దానికి ఒక్కో సంగీత దర్శకుడు పనిచేశారు. మొదట విడుదలైన ‘ది లైగర్ హంట్ థీమ్’కు విక్రం మోంట్రోస్, ‘అక్డీ పక్డీ’కి లిజో జార్జ్, డీజే చేటాస్, సునీల్ కశ్యప్, ‘Watt Laga Denge’కు సునీల్ కశ్యప్, ‘ఆఫట్’కు తనిష్క్ బగ్చి సంగీతం అందించారు.
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్నా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండకు స్టార్‌డం తీసుకొచ్చిన అర్జున్ రెడ్డి విడుదలైన రోజే లైగర్ కూడా రిలీజ్ కానుండటంతో ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
View this post on Instagram