Viduthalai Movie Update : హీరోగా కమెడియన్ - కొడైకెనాల్‌లో పీటర్ హెయిన్ ఇంటెన్స్ ఫైట్
తమిళ కమెడియన్ సూరి కథానాయకుడిగా జాతీయ పురస్కార గ్రహీత వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న సినిమా 'విడుతలై'. ఇందులో విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్ ప్రధాన తారాగణం.
జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) రూపొందిస్తున్న తాజా చిత్రం 'విదుతలై'. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో హాస్య నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న సూరి (Tamil Comedian Soori) కథానాయకుడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వాతియర్‌గా నటిస్తున్నారు.
కొడైకెనాల్‌లో ఇంటెన్స్ ఫైట్ ఫినిష్
'విడుతలై' (Viduthalai Movie) సినిమా లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... కొడైకెనాల్‌లోని (Kodaikanal) పూంబరైలో ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి చేశారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ (Peter Hein) నేతృత్వంలో భారీ స్థాయిలో ఫైట్ తీశారు. బల్గెరియా నుంచి వచ్చిన కెమెరా సిబ్బందితో అత్యున్నత స్థాయిలో చిత్రీకరించామని యూనిట్ వర్గాలు తెలిపాయి. సూరి, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా... యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు.
'విడుతలై 1' షూటింగ్ పూర్తి
ఆర్.ఏస్ ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జైయంట్ మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. దీనికి ఎల్‌డ్రెడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ నిర్మాతలు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేశారు. ఇప్పుడు కొడైకెనాల్‌లోని తీసిన యాక్షన్ సీన్స్ రెండో పార్ట్ కోసం అన్నమాట.
చిత్ర నిర్మాతలు ఎల్‌డ్రెడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) మాట్లాడుతూ ''కొడైకెనాల్‌లో ఫైట్ బాగా వచ్చింది. అద్భుతమైన నటీనటులు సాంకేతిక బృందంతో 'విడుతలై' మొదటి భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండో భాగంలోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలుంది. ఖర్చుకు వెనుకాడకుండా రెండు భాగాలను తెరకెక్కిస్తున్నాం. తమిళ పరిశ్రమలో ఇప్పటి వరకు తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రాల్లో మా సినిమా ఒకటిగా నిలవనుంది'' అని చెప్పారు.
#VetriMaaran's #Viduthalai- Kodaikanal schedule is completed! Intense action scenes choreographed by @PeterHeinOffl@VijaySethuOffl @ilaiyaraaja @elredkumar @Udhaystalin @BhavaniSre @rsinfotainment @GrassRootFilmCo @RedGiantMovies_ @mani_rsinfo @VelrajR @DoneChannel1 @CtcMediaboy pic.twitter.com/OYukpuJ8HF
— Actor Soori (@sooriofficial) September 19, 2022
పది కోట్ల విలువ చేసే సెట్స్...
'విడుతలై' కోసం కళా దర్శకుడు జాకీ నేతృత్వంలో పది కోట్ల రూపాయలు విలువ చేసే రైలు, రైలు బ్రిడ్జి సెట్ వేశామని నిర్మాతలు తెలిపారు. ఇప్పుడు ఆ సెట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. ఇటీవల సిరుమలై ప్రాంతంలో పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా మరో భారీ సెట్ నిర్మించినట్లు చెప్పారు. ప్రస్తుతం యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో కోడైకెనాల్‌లో ఉత్కంఠభరిత సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బల్గేరియా నుంచి వచ్చిన నిష్ణాతులైన స్టంట్ బృందం అందులో పాల్గొంటున్నారు.
Also Read : ఈ వారం థియేట్రికల్ - ఓటీటీ రిలీజెస్ ఇవే!
విజయ్ సేతుపతి, సూరితో పాటు భవాని శ్రీ, ప్రకాశ్ రాజ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon), రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. వెల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 'విడుతలై 1', 'విడుతలై 2' విడుదల తేదీలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read : ‘జైలర్’ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం! నిజంగానే రజనీ మూవీ నుంచి తప్పుకుందా?