F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్
'ఎఫ్3' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటిస్తోన్న సినిమా 'ఎఫ్3'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఎఫ్ 2' సినిమాలో కనిపించిన తారలే ఈ సినిమాలో కూడా కనిపించనున్నారు. వీరితో పాటు కొన్ని పాత్రలను యాడ్ చేశారు. అందులో సునీల్, సోనాల్ చౌహన్ లాంటి స్టార్లు ఉన్నారు. ఈ సినిమాను మే 27న విడుదల చేయనున్నారు.
దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పాటలు, ట్రైలర్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి క్లీన్ 'యు' సర్టిఫికెట్ ను జరీ చేసింది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ మధ్యకాలంలో ఇలాంటి కామెడీ సినిమా రాలేదని.. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు.
సెన్సార్ బోర్డు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమాలో సమ్మర్ లో ఆడియన్స్ ను చిలీ చేయడం ఖాయమని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి!
Also Read: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Also Read: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
View this post on Instagram