X

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలివే.. 

ఈ వారం థియేటర్లో అలానే ఓటీటీలో కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

FOLLOW US: 

మహాసముద్రం: 

ఆర్ఎక్స్ 100' తోనే తన సత్తా నిరూపించుకున్న దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న నూతన చిత్రం 'మహాసముద్రం'. శర్వానంద్, సిద్ధార్థ్ లు హీరోలుగా నటిస్తుండగా.. అదితిరావ్ హైదరీ- అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 14న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, రావు రమేష్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్: 

చాలా కాలంగా హిట్లు రాక ఇబ్బంది పడుతున్న అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. దానికి నాగచైతన్య గెస్ట్ గా కూడా వచ్చారు. అల్లు అరవింద్ సమర్పిస్తోన్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

పెళ్లి సందD:

ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం 'పెళ్లి సందD'. ఈ సినిమాతో గౌరీ రోనంకీ దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్‏గా నటిస్తోంది. రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ 'పెళ్లి సందD' సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో దర్శకేంద్రుడు వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుగా అక్టోబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్లు పాల్గొన్నారు. ఓటీటీ రిలీజ్ లు.. 

ఉదన్ పిరప్పే: 
ప్రముఖ నటి జ్యోతిక, సముద్రఖని, శశి కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఉదన్ పిరప్పే'. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. అక్కా, తమ్ముల బాండింగ్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. తమిళ నేటివిటీకు తగ్గట్లుగా రూపొందించిన ఈ సినిమాను అక్టోబర్ 14న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు. 
  
Also Read: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు! 

Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..

Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Tags: Most Eligible Bachelor akkineni akhil Pelli Sandadi maha samudram movie

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Annaatthe trailer: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..

Annaatthe trailer: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..

Aryan Khan Bail Hearing: ఆర్యన్ ఖాన్‌కు మరో 'సారీ'.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Aryan Khan Bail Hearing: ఆర్యన్ ఖాన్‌కు మరో 'సారీ'.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Bigg Boss 5 Telugu: సన్నీ వర్సెస్ కాజల్.. ఎవరు గెలుస్తారో..?

Bigg Boss 5 Telugu: సన్నీ వర్సెస్ కాజల్.. ఎవరు గెలుస్తారో..?

Balakrishna 'Unstoppable': 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' బాలయ్య ప్రోమో.. అదిరిపోయిందంతే..

Balakrishna 'Unstoppable': 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' బాలయ్య ప్రోమో.. అదిరిపోయిందంతే..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Romantic: 'రొమాంటిక్' ప్రీమియర్ షోకి రాజమౌళితో సహా.. స్టార్లంతా.. 

Romantic: 'రొమాంటిక్' ప్రీమియర్ షోకి రాజమౌళితో సహా.. స్టార్లంతా.. 

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..