అన్వేషించండి
Advertisement
Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీలో రాబోయే సినిమాలివే..
ఈ వారం థియేటర్లో అలానే ఓటీటీలో కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!
'కొండపొలం'..
వైష్ణవ్ తేజ్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కొండపొలం'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను అలరించింది. 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న వైష్ణవ్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!
'ఆరడుగుల బుల్లెట్'..
గోపీచంద్, నయనతార జంటగా తెరకెక్కిన ఈ సినిమాను బి.గోపాల్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయి ఐదారేళ్లు అవుతున్నా.. కొన్ని కారణాల వలన విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 8న సినిమాను విడుదల చేయనున్నారు. ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషిస్తోన్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు.
Action packed powerful trailer of @YoursGopichand's #AaradugulaBullet ! Out now on @telugufilmnagar ! 🔥🔥
— Ramesh Bala (@rameshlaus) October 4, 2021
🔗 https://t.co/mxwkuQAEid
In theatres from 8th October #Gopichand #Nayanthara #BGopal #Manisharma #ThandraRamesh #VakkanthamVamsi #JayaBalajeeRealMedia @MangoMusicLabel pic.twitter.com/c6rxhLfn1X
'నేను లేని నా ప్రేమకథ'..
నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'నేను లేని నా ప్రేమకథ'. సురేష్ ఉత్తరాది డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గాయత్రి, అదితి మైకేల్ హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 8న ఈ సినిమా థియేటర్లోకి రానుంది.
'వరుణ్ డాక్టర్'..
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 9న విడుదల చేయనున్నారు. అమ్మాయిల కిడ్నాప్ లను అడ్డుకునే డాక్టర్ కథే ఈ సినిమా.
ఓటీటీ రిలీజ్ లు..
'రాజ రాజ చోర'..
శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 8 నుంచి 'జీ5'లో స్ట్రీమింగ్ కానుంది. హసిత్ గోలి తెరకెక్కించిన ఈ సినిమాలో మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా నటించారు.
'భ్రమమ్'..
బాలీవుడ్ లో ఘన విజయాన్ని అందుకున్న 'అంధాధూన్' సినిమాను తెలుగులో 'మ్యాస్ట్రో'గా రీమేక్ చేశారు. అదే సినిమాను మలయాళంలో 'భ్రమమ్' అనే పేరుతో తెరకెక్కించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమాను రవి.కె.చంద్రన్ డైరెక్ట్ చేశారు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ కీలకపాత్ర పోషిస్తుంది. అక్టోబర్ 7న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
'కోల్డ్ కేస్'..
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను జూన్ 30న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఈ మలయాళ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేసి 'ఆహా' వేదికగా అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నారు.
Also Read: సినీ పెద్దల ఆశీర్వాదం నాకొద్దు.. నరేష్ నీ చక్రం దొబ్బేశాం.. సిగ్గుపడేలా మాట్లాడకు: ప్రకాష్ రాజ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion