News
News
X

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

అన్‌స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

అన్‌స్టాపబుల్ మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్ ప్రోమోను ఆహా శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ ఎపిసోడ్‌కు పవన్ కళ్యాణ్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా వచ్చాడు.

‘ఈశ్వరా... పవనేశ్వరా... పవరేశ్వరా...’ అంటూ పవన్ గురించి బండ్ల గణేష్ ఇచ్చిన వైరల్ స్పీచ్‌ను బాలకృష్ణ ఇమిటేట్ చేయగా... అన్‌స్టాపబుల్‌లో బాలయ్య రెగ్యులర్‌గా చెప్పే ‘నేను మీకు తెలుసు. నా స్థానం మీ మనసు.’ అనే మాటను పవన్ కళ్యాణ్ అన్నారు.

‘గుడుంబా శంకర్ సినిమాలో ప్యాంట్ మీద ప్యాంట్ వేశావు. అలా ప్యాంటేసి పాతిక సంవత్సరాలు వయసు తగ్గావు తెలుసా?’ అని పవన్‌ను బాలయ్య ఆటపట్టించారు. ఆ తర్వాత ఇద్దరూ మొదటి సారి కలిసినప్పటి ఫొటోను చూపించి ‘అప్పుడు నేను యంగ్‌గా ఉన్నాను కదా’ అని బాలయ్య అనగా ‘ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు’ అని పవన్ కాంప్లిమెంట్ ఇచ్చారు.

‘నువ్వు, త్రివిక్రమ్ మంచి ఫ్రెండ్స్ కదమ్మా’ అని అడిగినప్పుడు ‘ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చిందండీ’ అని పవన్ సమాధానం ఇచ్చారు. అలాగే ‘రామ్ చరణ్ ఎలా నీకు క్లోజ్ అయ్యాడమ్మా’ అని అడిగినప్పుడు ‘క్లోజ్ అవ్వాల్సి వచ్చిందండీ.’ అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు.

‘నాకు వీళ్ల డ్యూటీ ఉండేది చినప్పుడు’ అని పవన్ అంటుండగా, బాలయ్య మధ్యలో ‘నాగబాబు ఉన్నాడుగా మధ్యలో’ అని అడిగారు. ‘ఆయన నిర్మాతగా ఉండేవాడు కాబట్టి నేనొక్కడ్నే ఇంట్లో దొరికిపోయే వాడిని.’ అని పవన్ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత రామ్ చరణ్‌కు కూడా ఫోన్ చేసి ‘ఏమయ్యా ఫిటింగ్ మాస్టరూ... మొన్న ప్రభాస్ గురించి ఫోన్ చేసినప్పుడు నీ గుడ్ న్యూస్ మింగేసి అతని న్యూస్ చెప్పావు.’ అని ఆట పట్టించారు.

‘నీకు మీ అమ్మంటే భయమా? లేకపోతే మీ ఆవిడంటే భయమా?’ అని కూడా అడిగారు. ఆ తర్వాత షోలోకి సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇచ్చారు. పంచె కట్టుకుని వచ్చిన తేజ్‌ను చూసిన బాలకృష్ణ ‘ఏమ్మా... పెళ్లి చూపులకు వచ్చావా? ఇక్కడే ఉన్నారు చూడు’ అని ఆట పట్టించారు. ‘అమ్మాయిలని ఎలా గౌరవించాలో కూడా ఆయనే నేర్పారండీ.’ అని పవన్ కళ్యాణ్ గురించి తేజ్ చెప్పారు.

‘తొడ కొట్టి వెళ్లిపో’ అని సాయి ధరమ్ తేజ్‌కు బాలయ్య చెప్పారు. అప్పుడు తేజ్ బాలకృష్ణ దగ్గరకు వెళ్లగా ఆయన ‘నా తొడ కాదమ్మా నీ తొడ కొట్టాలి.’ అన్నారు. సాయి ధరమ్ తేజ్ వెళ్లిపోయాక బాలకృష్ణ వివాదాస్పదమైన పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి అడిగారు. ‘ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా’ అని అడిగినప్పుడు దానికి పవన్ చెప్పిన సమాధానాన్ని పూర్తిగా చెప్పలేదు. అలాగే తనకు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు వచ్చిన విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు.

ప్రభాస్ ఎపిసోడ్ తరహాలో రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్ కూడా స్ట్రీమ్ కానుంది. మొదటి భాగాన్ని ఫిబ్రవరి మూడో తేదీన ఆహా యాప్‌లో విడుదల చేయనున్నారు.

Published at : 27 Jan 2023 07:05 PM (IST) Tags: Nandamuri Balakrishna Sai Dharam Tej Pawan Kalyan Unstopabble With NBK Unstopabble Pawan Kalyan Promo

సంబంధిత కథనాలు

Shastipoorthi Movie : మళ్ళీ 'లేడీస్ టైలర్' జోడీ - 37 ఏళ్ళ తర్వాత 'షష్టిపూర్తి'తో!

Shastipoorthi Movie : మళ్ళీ 'లేడీస్ టైలర్' జోడీ - 37 ఏళ్ళ తర్వాత 'షష్టిపూర్తి'తో!

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

Sreeleela Role In NBK 108 : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?

Sreeleela Role In NBK 108 : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

టాప్ స్టోరీస్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

AP News  :  ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...