Trinayani Serial Today May 4th: 'త్రినయని' సీరియల్: మీ కన్న కూతురే గాయత్రీ పాప అని మాకు తెలుసన్న డమ్మక్క, షాక్‌లో విశాల్, పరుగులు పెట్టించిన చున్నీ!
Trinayani Serial Today Episode గాయత్రీ పాప తలపై గాయత్రీ దేవి చున్నీ కప్పితే నిజం తెలుస్తుందని అఖండ స్వామి తిలోత్తమతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode తిలోత్తమ, వల్లభలు అఖండ స్వామి దగ్గరకు వెళ్తారు. గాయత్రీ దేవి వస్త్రం అని చెప్పి చిన్న పిల్లల చున్నీని పోలీస్ అధికారి ముఖానికి చుట్టారని తిలోత్తమ అఖండ స్వామితో చెప్తుంది.
అఖండ: గాయత్రీ దేవి నీడ కనిపించింది అని చెప్పారు కదా.
తిలోత్తమ: అవును స్వామి చిన్న పిల్లలా ఉంది ఆ ఛాయ.
వల్లభ: తలకు కొంగు వేసుకొని గోపికలా ఉంది ఆ ఛాయ.
అఖండ: ఛాయ కనిపించినప్పుడు గాయత్రీ దేవి తలకు కప్పుకున్న వస్త్రమే చంద్ర శేఖర్ తలకు చుట్టారేమో.
వల్లభ: నేను అప్పుడే అడిగితే ఎవరూ పట్టించుకోలేదు.
తిలోత్తమ: నువ్వు ఆపరా.. చెవిలో జోరీగలా ఉంచవు.
అఖండ: తిలోత్తమ విసుక్కోకు. నీ కొడుకు అనుమానించడం వల్లే నువ్వు నా దగ్గరకి వచ్చావ్ కదా.
తిలోత్తమ: స్వామి ఎక్కడో ఉన్న గాయత్రీ అక్కయ్య వస్త్రం ఇంటికి ఎలా వచ్చింది.
అఖండ: మీ ఇంట్లోనే ఉందని నేను అంటాడు. ఇంట్లో కేవలం ఫొటో ఉందని మీరు అనుకుంటున్నారు. ఆ వస్త్రం గాయత్రీ దేవి వేసుకున్నది. కంట్లోకి కనిపించింది అంటే తన కోసం తెచ్చింది పెద్దబొట్టమ్మ వాడింది.
తిలోత్తమ: తన కోసం ఎవరు తెచ్చారు స్వామి.
వల్లభ: సింపుల్ మమ్మీ గాయత్రీ పెద్దమ్మ ఏ రోజు అయినా రావొచ్చు అని పెద్ద మరదలు నయని తెచ్చిపెట్టుంటుంది.
తిలోత్తమ: తను తీసుకొచ్చానని నయని చెప్పలేదు కదరా.
అఖండ: ఒక పని చేయండి తిలోత్తమ ఆ వస్త్రం నయని తెచ్చిందో లేదో పక్కన పెట్టి ఒకసారి ఆ వస్త్రాన్ని గాయత్రీపాప తల మీద కప్పి చూడండి. మీ అనుమానాలు అన్నీ పటాపంచలవుతాయి.
మరోవైపు గాయత్రీ పాపని పావనామూర్తి, హాసినిలు హాల్‌లో ఆడిస్తుంటారు. ఇక డమ్మక్క గాయత్రీ పాప తల మీద ఉంచిన వస్త్రం తిలోత్తమకు దొరికితే నువ్వే ఇబ్బందుల్లో పడతావ్ అని హసినికి చెప్తుంది. దీంతో డమ్మక్క ఏదో ఉపదేశం చేస్తుందని అందరూ హాల్‌లోకి వస్తారు. ఇంతలో తిలోత్తమ, వల్లభలు వస్తారు. తిలోత్తమ హాసిని ఇప్పుడు డ్రాయింగ్ వేస్తుందని అంటుంది. అందరూ హాసినికి డ్రాయింగ్ రాదు కదా ఎలా వేస్తుంది అని అడుగుతారు. ఏం చేద్దామని తిలోత్తమ నయనిని అడిగితే ఎలా వస్తే అలా బొమ్మ గీయమని అంటుంది.
డమ్మక్క: నయని కన్న కూతురి చిత్రం వేయించాలి అంటుంది.
తిలోత్తమ: భళా నువ్వు సూపర్ డమ్మక్క.
వల్లభ: హాసిని చేత గీయించబోయేది గానవి చిత్రం గాయత్రీ చిత్రం.
విశాల్: అన్నయ్య ఏమంటున్నావ్.
వల్లభ: అరే నీకు నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా. అక్కడ ఫొటో చూసి బొమ్మ గీయమంటాను అనుకుంటున్నావా. నో.
విక్రాంత్: అయినా పెద్దమ్మ ఇప్పుడు ఎలా ఉంటారో ఎవరో చూశారు.
నయని: హాసిని అక్క తప్ప అందరూ చూశారు.
హాసిని: అవును..
విశాల్: నయని అసలు నువ్వే చూడలేదు. అందరూ చూశారు అంటావ్ ఏంటి.
నయని: అమ్మగారుని ప్రస్తుతం ఎవరు చూశారు అని మీరు సందిగ్ధంలో పడ్డారు కానీ తిలోత్తమ అత్తయ్య ఉద్దేశం నాకు అర్థమైంది. పౌర్ణమి అమృత ఘడియల్లో కనిపించిన ఛాయ ద్వారా ఒక చిత్రాన్ని గీయమని అంటున్నారు అత్తయ్య.
హాసిని: నీడని బట్టి గీయడమే కష్టం అలాంటిది నేను ఆ నీడ కూడా చూడలేదు. మీరు రకరకాలుగా చెప్పినా సరిగా గీయలేను.
తిలోత్తమ: నీ ప్రతిభని సరైన రీతిలో వాడుకుంటామ్ హాసిని. పెద్దబొట్టమ్మ వాడిని ఆ చున్నీని తీసుకొస్తే మేం సరిగా వాడుకుంటాం. ఈ గాయత్రీ లాగే సరిగ్గా ఏడాదిన్నర వయసు ఉంటుంది ఆ గాయత్రీ అక్కయ్యకి. సో ఆ చున్నీని ఈ గాయత్రీకి చుట్టీ మనకు కనిపించిన నీడను బట్టి సలహాలు, సూచనలు ఇస్తే మీరు కన్న తొలి బిడ్డ ఊహాచిత్రం వస్తుంది కదా నాన్న.
నయని: ఎంత బాగా చెప్పారు అత్తయ్య.
వల్లభ: తంబీ ఆ చున్నీని తీసుకురావా..
వల్లభ డ్రాయింగ్‌కి కావాల్సిన వస్తువులను తీసుకొని వచ్చి హాసినికి ఇస్తాడు. విశాల్‌తో పాటు చున్నీ వెతకడానికి డమ్మక్క వెళ్తుంది. ఇక డమ్మక్క విశాల్‌కు చున్నీ ఇస్తుంది.
విశాల్: దీన్ని నువ్వు ఎలా కనిపెట్టావు.
డమ్మక్క: విశాల్ బాబు నీ కన్న కూతురే గాయత్రీ అని నాకు ఎప్పుడో తెలుసు. శివ భక్తులం. విశాలాక్షి అమ్మగారు మాకు సూచనా ప్రాయంగా చెప్తే మేం సర్వం గ్రహించేస్తాం.
విశాల్: ఈ విషయం విశాలాక్షి, ఎద్దులయ్యలకి కూడా తెలుసా.
డమ్మక్క: తెలుసు అంటే తెలుసు. తెలీదు అంటే తెలీదు. మాలో ఎవరం ఈ సత్యాన్ని మీ శత్రువులతో బయట పెట్టము. విధి విధానాలతోనే నడుచుకుంటాం.
ఇక డమ్మక్క చాట తీసుకొచ్చి అందులో చున్నీ పెట్టమని డమ్మక్క చెప్తుంది. అందులో పెడితేనే మీరు బయట పడరని చెప్తుంది. అందరూ చాటలో ఎందుకు తెచ్చారని అడిగితే కొత్త వస్త్రాన్ని నేనుగా పాప తలమీద పెట్టకూడదని ఇలా తెచ్చానని విశాల్ అంటాడు.
ఇక ఆ చున్నీని నయని గాయత్రీ పాప తల మీద కొంగులా కప్పుతుంది. ఇంతలో పెద్దగా గాలి వీస్తుంది. చున్నీ ఎగిరి పోతుంది. అందరూ పట్టుకోవాలి అని ఎంత ఎగిరినా దొరకదు. ఎగిరి బయటకు వెళ్లిపోతుంది. చున్నీ కోసం పరుగులు తీసిన అందరూ ఒకరి మీద ఒకరు పడిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: థియేటర్లో హిట్టు, టీవీలో ఫట్టు - 'సలార్' సినిమాకి డిజాస్టర్ టీఆర్పీ!