అన్వేషించండి

Salaar TRP: థియేటర్లో హిట్టు, టీవీలో ఫట్టు - 'సలార్' సినిమాకి డిజాస్టర్ టీఆర్పీ!

Salaar TRP: ప్రభాస్ నటించిన 'సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్' సినిమాకి టీవీలో దారుణమైన రేటింగ్ వచ్చింది. స్కంద, ఆది కేశవ లాంటి డిజాస్టర్ చిత్రాల కంటే తక్కువ టీఆర్పీ రావడం గమనార్హం. 

Salaar TRP: రెబల్ స్టార్ ప్రభాస్, KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'సలార్'. మొదటి భాగాన్ని 'సీజ్ ఫైర్' పేరుతో గతేడాది డిసెంబర్ లో రిలీజ్ చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి, బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఓటీటీలోనూ ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభించింది. అయితే టీవీల్లో మాత్రం ఈ సినిమా దారుణమైన టీఆర్పీ అందుకుంది.

'సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్' చిత్రాన్ని ఇటీవల 'స్టార్ మా' ఛానల్ లో తొలిసారిగా ప్రీమియర్‌గా ప్రదర్శించారు. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ సినిమా.. టెలివిజన్ లోనూ సంచలనం సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ మూవీ ఊహించిన విధంగా కేవలం 6.5 టిఆర్పి రేటింగ్ మాత్రమే రాబట్టింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా టీఆర్పీలు సాధిస్తుంటాయి. కానీ ధియేటర్లలో పెద్ద హిట్టయిన ప్రభాస్ సినిమాకి ఇంత తక్కువ రేటింగ్ రావడంతో అందరికీ షాకింగ్ గా ఉంది.

మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం' మూవీ 9.23 రేంజ్ లో రేటింగ్ సొంతం చేసుకుంది. అక్కినేని నాగార్జున నటించి 'నా సామిరంగా' సినిమాకు 8.15 TRP వచ్చింది. నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి' చిత్రానికి 9.36 రేటింగ్ వస్తే.. రామ్ పోతినేని నటించిన ఫ్లాప్ సినిమా 'స్కంద' కి 8.47 టీఆర్పీ నమోదైంది. ఇక డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న 'ఆది కేశవ' చిత్రానికి 9.87 రేటింగ్.. 'మంగళవారం' మూవీకి 8.3 టీఆర్పీ దక్కింది. వీటిలో పోల్చి చూస్తే 'సలార్ పార్ట్ 1'కు మొదటి టెలికాస్టింగ్ లో దారుణమైన రేటింగ్ వచ్చిందనే అనుకోవాలి.

నిజానికి ఓటీటీలు రాజ్యమేలుతున్న రోజుల్లో థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలకు టీవీల్లో అదే స్థాయిలో ఆదరణ దక్కుతుందని అనుకోలేం. ఆల్రెడీ సినిమా హాలల్లో, డిజిటల్ వేదికల మీద అనేకసార్లు చూసేసిన జనాలు.. మళ్ళీ అదే పనిగా బ్రేక్ లో వచ్చే యాడ్స్ చూస్తూ టెలివిజన్ లో కాలక్షేపం చేయడం అంటే కష్టంగా ఉంటుంది. ఈ కారణం చేతనే 'సలార్ - సీజ్ ఫైర్' మూవీకి తక్కువ రేటింగ్ వచ్చిందని భావించవచ్చు. 

అందులోనూ ఇది ఐపీఎల్‌ కాలం. లైవ్ మ్యాచుల కోసం పబ్లిక్ ఏ స్థాయిలో సమయాన్ని ఖర్చు పెడుతున్నారో వ్యూయర్ షిప్ చూస్తే అర్థమైపోతుంది. అందుకే ఇప్పటికే థియేటర్లలో, ఓటీటీలలో వీక్షించిన చిత్రాలను మళ్ళీ స్మాల్ స్క్రీన్ మీద మళ్ళీ చూడటానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకి ఇలాంటి TRP రావడానికి ఐపీఎల్‌ క్రికెట్ మరొక కారణం అనుకోవచ్చు.

కాగా, 'సలార్' సినిమాలో ప్రభాస్ తో పాటుగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ ప్రముఖ పాత్ర పోషించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. శ్రీయా రెడ్డి, బాబీ సింహా, గరుడ రామ్, జగపతి బాబు, టిన్ను ఆనంద్, దేవరాజ్, జాన్ విజయ్, ఈశ్వరీ రావు, ఝాన్సీ, మైమ్ గోపీ, రమణ, సఫీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మించారు. రాబోయే రెండవ భాగం 'సలార్: పార్ట్ 2 - శౌర్యంగ పర్వం' అనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: 'జగన్‌ను ఓడించాలని కాదు, నువ్వు గెలవాలని లక్ష్యంగా పెట్టుకో పవన్'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Andhra Pradesh: జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి,  మంత్రుల హాట్ కామెంట్స్
జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి, మంత్రుల హాట్ కామెంట్స్
Hassan Nasrallah Killed: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
HYDRA: మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Andhra Pradesh: జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి,  మంత్రుల హాట్ కామెంట్స్
జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి, మంత్రుల హాట్ కామెంట్స్
Hassan Nasrallah Killed: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
HYDRA: మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
JaganLatest Tweets: నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్
నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్
Ponguleti ED Raids : కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే
కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే
Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
Urvashi Rautela: బాలయ్య అలాంటి వారు కాదు... నటసింహంపై హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలయ్య అలాంటి వారు కాదు... నటసింహంపై హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Embed widget