అన్వేషించండి

Trinayani Serial Today May 16th: 'త్రినయని' సీరియల్: విశాలాక్షి శాపంతో కుక్క, పిల్లి, మేకలా మారిపోయిన సుమన, తిలోత్తమ, వల్లభలు.. శాపవిమోచనం కలుగుతుందా!

Trinayani Serial Today Episode :విశాలాక్షి పెట్టిన శాపానికి విమోచనం కోసం గురువుగారు ఇంటికి వచ్చి గాయత్రీ దేవి వల్లే పోతుందని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode : పాటలు పెట్టుకొని హాసిని డ్యాన్స్ చేస్తుంటే సుమన గొడవ ఎందుకని అంటూ మధ్యలో కుక్కలా మొరుగుతుంది. ఇక వల్లభ కూడా మాట్లాడుతూ పిల్లిలా అరుస్తాడు. తిలోత్తమ కూడా మేకలా అరుస్తుంది. ముగ్గురు షాక్ అయిపోతారు. 

విశాల్: మీ అందరికీ ఏమైంది ఇలా అరుస్తున్నారు నాకు ఏం అర్థం కావడం లేదు.

నయని: బావగారు మీరు ఇలా ఎందుకు అరుస్తున్నారో తెలుసా నిన్ను మీరు అపర భక్తురాలు అయిన విశాలాక్షిని అవమానించినందుకు తను పెట్టిన శాపం వల్ల ఇలా అయింది.

సుమన: శాపం తగిలిందా.. భౌ..

విశాల్: అమ్మా విశాలాక్షి కోపానికి గురైన మీరు ఇలా ఇబ్బందికి గురవుతున్నారు. తనని అప్పుడే క్షమించమని అడిగితే బాగున్ను. 

దురంధర: ఇప్పుడుమైంది ఇప్పుడు పిలిచి సారీ చెప్పండి.

పావనా: పిలిస్తే రావడానికి తను ఇక్కడ ఉండాలి కదా. తెల్లారికి ముందే శ్రీశైలంలో పూజలు ఉన్నాయని వెళ్లిపోయింది.

హాసిని: ఓం నమఃశివాయ.

సుమన: ఆ గారడి పిల్ల వల్లే మాకు ఇలా అయింది అన్నమాట. భౌ.. భౌ..

నయని: ఒకరు అన్నారు అంటే సరదాగా అనుకోవచ్చు చెల్లి. కానీ బావగారు, అత్తయ్య, నువ్వు మీ ముగ్గురు ఇలాగే అంటున్నారు. 

హాసిని: మీవి మామూలు కూతలు కావు తల్లి.. మీకు సెట్ అయ్యే శబ్ధాలు వస్తున్నాయి.

తిలోత్తమ: ఆ విశాలాక్షి ఈ సారి కనిపించని దాని పని చెప్తా.

నయని: అత్తయ్య పశ్చాత్తాపపడి ఆ భగవంతుడిని వేడుకుంటే బాగుంటుందే తప్ప ఇలా ఆవేశాన్ని పెంచుకుంటే ఇలాగే అవుతుంది.

సుమన: జిత్తుల మారి పిల్ల దాని బట్టలు దాచేశామని మమల్ని ఇలా చేస్తుందా..భౌ..

 

దురంధర: అబ్బా అంత గట్టిగా మొరగకే..

సుమన: నేను మొరుగుతున్నానా ఏం మాట్లాడుతున్నావే పిన్ని.. భౌ.. భౌ..

పావనా: నువ్వు మాట్లాడిన ప్రతీ సారి చివర్లో భౌ వస్తుంది అమ్మా.

విశాల్: ఇలా అయితే వీళ్లు బయటకు కూడా వెళ్లలేరు. ఏదో ఒక పరిష్కారం చూడాలి. విశాలాక్షిని శ్రీ శైలం నుంచి ఇక్కడికి పిలిచే బదులు మీ ముగ్గురే వెళ్లండి.

నయని: పొరపాటుగా భావించి పెద్ద మనసు చేసుకొని క్షమించమని అడగండి.

పావనా: కాళ్ల మీద పడినా తప్పు లేదు.

తిలోత్తమ: తనని అడుక్కోవడం ఏంటి మే.. మే..

నయని: ఒక పని చేయండి స్వామీజి వారిని ఇంటికి తీసుకురండి ఆయన ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు.

విశాల్: ఈ ఐడియా బాగుంది. 

దురంధర: గురువుగారు మన శ్రేయాభిలాషి కాబట్టి పరువు పోకుండా పరిష్కారం ఇస్తారు.

ఇక తిలోత్తమ, వల్లభలు అఖండ స్వామి దగ్గరకు వస్తారు. ఇద్దరూ మేక, పిల్లిలా అరుస్తారు. తన ధ్యానాన్ని భంగం కలిగించడానికి ఇలా కూతలు పెడుతున్నారా అని తిడతారు. దీంతో వల్లభ తమకు శాపం తగిలిందని చెప్తారు. 

అఖండ: శాపం తగిలే అంతలా ఏం చేశారు.

వల్లభ: మగాడిని నేను చెప్పలేను.

తిలోత్తమ: సరదాగా ఆట పట్టిద్దామని విశాలాక్షి స్నానం చేస్తుంటే వస్త్రాపహరణం చేశాం.

అఖండ: ఓరీ మూర్ఖులారా. ఎవరితో ఎలాంటి పరాచికాలు ఆడారో అర్థమవుతుందా. మీకు ఇంకా భూమ్మద నూకలు ఉన్నాయి కాబట్టి విశాలాక్షి ఆగ్రహానికి గురి కాలేదు. ఇది మీకు చాలా చిన్న శిక్ష. అదృష్టం బాగుండి ఆయుష్షు పోలేదు సంతోషించండి.

తిలోత్తమ: అందరి ముందు ఇలా అంటుంటే పరువు పోతుంది స్వామి.  

వల్లభ: శాపం పెట్టే అంత శక్తి ఆ పిల్లకి ఎక్కడిది స్వామి. 

తిలోత్తమ: అయినది ఏదో అయింది స్వామి ఈ శాపం నుంచి మాకు విముక్తి కలిగించండి.

అఖండ: విశాలాక్షి పెట్టిన శాపం విముక్తి నా వల్ల కూడా కాదు.

వల్లభ: సరే మమ్మీ నయని చెప్పినట్లు కుల గురువు దగ్గరకు వెళ్దాం పద.

అఖండ: అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు.

తిలోత్తమ: అలవాటులో పొరపాటుగా వచ్చేశాం స్వామి. ఆయనకు కూడా ఎందుకు తెలియడం అని మీ దగ్గరకు వచ్చాం.

అఖండ: మీకు ఈ విషయంలో సాయం చేస్తే నేను అమ్మవారి ఆగ్రహానికి గురవుతాను.

తిలోత్తమ: మా వల్ల మీకు ఇబ్బంది ఎందుకులే స్వామి. 

సుమన, విక్రాంత్ గొడవ పడతారు. సుమన మాటకు ముందు ఒకసారి చివర ఒకసారి భౌ భౌ అవుతుంది. విక్రాంత్ మాటలకు సుమన మాట్లాడకుండా ఉండిపోతుంది. దాంతో విక్రాంత్ విశాలాక్షి నీకు సరైన శిక్ష వేసిందని నువ్వు మాట్లాడకపోతే చాలా సమస్యలు సమసిపోతాయని అంటాడు. కొత్త సమస్యలు కూడా రావు అని అంటాడు.  

గాయత్రీ పాపని పావనా మూర్తి, దురంధరలు ఆడిస్తారు. ఇక హాసిని మేకను తీసుకొస్తే పాప బాగా ఆడుకుంటుందని అంటుంది. ముగ్గురి మీద హాసిని సెటైర్లు వేసి నవ్వుతుంది. గాయత్రీ పాప కూడా నవ్వుతుంది. ఇంతలో గురువుగారు వస్తారు. జరిగింది ఆయనకు చెప్తారు. 

తిలోత్తమ: ఆ గారడి పిల్ల విశాలాక్షి చేసిన మాయ ఇది.

నయని: స్వామి ఉదయం నుంచి వీళ్ల పరిస్థితి ఇలాగే ఉంది.

గురువుగారు: నవ్వుతూ చేసిన పాపానికి ఏడుస్తూ ఫలితం అనుభవించాల్సి వస్తుంది.

నయని: మాకేం అవుతుందని నిర్లక్ష్యం చేశారు. అప్పుడే క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది కదా. 

తిలోత్తమ: అడుక్కునే ఖర్మ మాకేం పట్టలేదు. 

నయని: స్వామి వీరు మూగ జీవాలులా అరవకుండా చేయడానికి పరిష్కారం ఏముంది.

గురువుగారు: ఉంది. అది గాయత్రీ దేవి చేతనే సాధ్యమవుతుంది. 

దురంధర: గాయత్రీ వదిన వస్తుందని ఏడాదిన్నర నుంచి అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటున్నారు. ఇంకా రాలేదు. అసలు ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు.

సుమన: అప్పటి వరకు మేం ఇలా ఇబ్బంది పడుతూ ఉండాలా. 

వల్లభ: చిన్న మరదలా గురువుగారికి కూడా మన పరిస్థితి చూస్తే గిలిగింతలు పెట్టినట్లు ఉంది అనుకుంటా.

తిలోత్తమ: గురువుగారు గాయత్రీ అక్కయ్య వల్లనే మాకు ఈ ఇబ్బంది తొలగుతుంది.అంటే అంతకన్నా ఆనందం ఇకేముంది. సర్వజ్ఞలు మీకు అక్క ఎక్కడ ఉందో తెలిసే ఉంటుంది. 

గురువుగారు: నాకే కాదు నీకు కూడా తెలుసు తిలోత్తమ. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: మైండ్ బ్లోయింగ్ లుక్​లో అషూ రెడ్డి.. వయసులో ఉన్నప్పుడే ఆ పని చేసేయాలంటోంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Tirumala News: తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Tirumala News: తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
Crime News: కన్న కూతురికే లైంగిక వేధింపులు - ఇద్దరు భార్యల ముద్దుల భర్త, చివరకు వారి చేతుల్లోనే..
కన్న కూతురికే లైంగిక వేధింపులు - ఇద్దరు భార్యల ముద్దుల భర్త, చివరకు వారి చేతుల్లోనే..
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Cyber Fraud: సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..
సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..
Ram Gopal Varma: 'గేమ్ చేంజర్' బడ్జెట్, కలెక్షన్స్ మీద ఆర్జీవీ సెటైర్లు - ట్విట్టర్‌లో విరుచుకుపడిన వర్మ
'గేమ్ చేంజర్' బడ్జెట్, కలెక్షన్స్ మీద ఆర్జీవీ సెటైర్లు - ట్విట్టర్‌లో విరుచుకుపడిన వర్మ
Embed widget