Trinayani Serial Today March 5th: 'త్రినయని' సీరియల్: కూతురికి విషం కలిసిన పాలను ఇచ్చేసిన నయని.. తిలోత్తమ కుట్రకు గాయత్రీ పాప బలి కానుందా!
Trinayani Serial Today Episode గాయత్రీ దేవి ఫొటోకి కుంకుమ పెట్టాలి అనుకున్న అఖండ స్వామిని నాగయ్య పాము కాటేయగా గురువుగారు విషానికి విరుగుడు ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode అఖండ స్వామి గాయత్రీ దేవి ఫొటోకి బొట్టు పెట్టి నిజం తెలుసుకోవాలి అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే నాగయ్య పాము అఖండ స్వామిని కాటేస్తుంది. దీంతో భయపడిని అఖండ స్వామి గాయత్రీ దేవి ఫొటోకి క్షమాపణలు చెప్తాడు. ఇక తిలోత్తమ, వల్లభలు అఖండ స్వామిని గురువుగారు దగ్గరకు తీసుకెళ్లారు.
హాసిని: అసలు అఖండ స్వామి ఇంటికి ఎందుకు రావాలి పాముతో కాటు ఎందుకు వేయించుకోవాలి.
విశాల్: నయని నాకు ఒక డైట్ అఖండ స్వామిని నాగయ్య కాటేస్తాడు అని నీకు ముందే తెలీదా..
నయని: తెలుసు..
విశాల్: తెలిసి ఎందుకు చెప్పలేదు. నయని శత్రువు అయినా సరే కాపాడాలి అనేదానివి కదా ఈయన్ను ఎందుకు ఆదుకోవాలి అనుకున్నావు.
నయని: ఈసారి చెప్పాలి అనుకోలేదు. ప్రాణం కన్నా మానం గొప్పది. గాయత్రీ అమ్మగారి నుదిటిన కుంకుమ పెట్టడానికి అతను ఎవరు బాబుగారు.
హాసిని: పరీక్షించడానికి చేశారు.
నయని: ఇంకేమైనా చేయమనండి.. తాను నిరూపించాలి అనుకున్నదానికి ఆధారాలు చూపించమనండి.. అంతేకాని ఆమెకు కుంకుమ పెట్టాలి అనుకుంటే ఆ చేతికే రక్తం వచ్చింది. గండం వస్తుంది అని అఖండ స్వామి కూడా ఊహించరు. ఎందుకు అంటే అతని దృష్టి అమ్మగారి రాకమీద పడుండొచ్చు.
విశాల్: మా అమ్మ కంటే ముందు మృత్యువుని చూశారు ఆయన.
నయని: ఎవరి విషయంలో అయినా జాలి తలుస్తాను గాని అమ్మగారి విషయంలో కాదు.
హాసిని: విశాల్ చెల్లి ఇదే ఇంత సీరియస్‌గా తీసుకుంది అంటే ఇన్నాళ్లు గాయత్రీ అత్తయ్య విషయం తెలిసి దాచిపెట్టాం అని తెలిస్తే ఏమవుతుంది అంటావ్.
విశాల్: ఇక నన్ను కూడా నయని తన నదుటిన కుంకుమ పెట్టనివ్వదేమో వదిన.
గురువుగారు అఖండ స్వామికి పసురు వేస్తారు. దీంతో అఖండ స్వామి బతుకుతారు. తనని బతికించినందుకు అఖండ స్వామి గురువుగారికి కృతజ్ఞతలు చెప్తారు. ఇక తిలోత్తమ కూడా గురువుగారికి థ్యాంక్స్ చెప్తుంది.
గురువుగారు: అసలు పాము ఎందుకు కాటేసిందో ఆలోచించారా.. మీరు వెళ్లింది గాయత్రీ దేవి జోలికి. విశాలాక్షి అమ్మగారి భక్తురాలు అయిన గాయత్రీ దేవి అమ్మవారి కుంకుమను నుదిట పెట్టుకునేది. అంతే తప్ప తనకు సింధూరం పెట్టే ఆలోచన అవకాశం ఎవరికీ పెట్టేది కాదు. అలాంటిది అఖండ స్వామి అడుగు ముందుకు వేసి సాద్వీమణి అయిన గాయత్రీ దేవి పాతివ్రత్యానికి భంగం కలిగిస్తే రక్షగా ఉండే నాగయ్య కాటేయక మానడు.
అఖండ: గాయత్రీ దేవి పునర్జన్మను నిర్ధారణ చేసుకోవడానికి అలా చేశాను కానీ. దురుద్దేశం ఏ కోశానా లేదు స్వామిగారు.
గురువుగారు: ఉండకపోవచ్చు. కానీ మూర్ఖులతో చేతులు కలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సాధకుడివి ఉపాసకుడివి అయిన నువ్వు మళ్లీ పాము కాటుకు గురవ్వకూడదు. ఇకపై పాములు నీ జోలికి రాకుండా ఉండాలి అంటే ఈ తులసి ఆకులు నీ చుట్టూ పెట్టుకో అని తులసి ఆకులు ఇస్తారు.
ఇక తిలోత్తమ ఆ తులసి ఆకుల్ని తమకు ఇవ్వమని అఖండ స్వామిని అడుగుతుంది. అఖండ స్వామి వాటిని తిలోత్తమకు ఇచ్చేస్తారు. ఇక తిలోత్తమ ఆ తులసి ఆకుల్ని ఇంటి చుట్టూ చల్లుతుంది.
తిలోత్తమ: గాయత్రీ పాప తాగే పాలలో విషం కలుపుదాం.
వల్లభ: వద్దు మమ్మీ నయని మరదలికి తెలిస్తే చంపేస్తుంది. ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిందని అన్నావ్ కదా..
తిలోత్తమ: నయని కిచెన్‌లో పాలు వేడి చేస్తుంది. అందులో పాయిజన్ కలిసేలా చేయాలి. నయని కనుక అందులో విషం ఏదో కలిసింది అని గుర్తు పట్టి గాయత్రీ పాపకి పాలు తాగించకపోతే.. ఆ పిల్ల దానికి పుట్టలేదు అని మనకే తెలిసిపోతుంది. ఒకవేళ గుర్తు పట్టలేదు అంటే..
వల్లభ: ఆ పిల్లే పెద్దమ్మ అవుతుంది.
తిలోత్తమ: అవునురా పాలు తాగాక గాయత్రీ పాప పైకి పోతుంది. విషం చూపిస్తుంది.
మరోవైపు గాయత్రీ పాపని హాల్‌లో కూర్చొపెట్టి అందరూ ఆడిపిస్తూ ఉంటారు. నయని పాప కోసం పాలు సిద్ధం చేయగా అందులో తిలోత్తమ విషం కలిపేస్తుంది. ఇక దూరం నుంచి తిలోత్తమ, వల్లభలు చూస్తారు. నయని విషం కలిసి ఉన్న పాలను బాటిల్‌లో వేస్తుంది. ఇక తిలోత్తమ, వల్లభలు హాల్‌లోకి వస్తారు. ఇక నయని పాల బాటిల్‌ని గాయత్రీ పాప చేతికి ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ఉపాసన: ప్రీవెడ్డింగ్ ఈవెంట్‌లో చరణ్‌కు అవమానం - ఆసక్తికర పోస్ట్ షేర్ చేసిన ఉపాసన! ఫోటోలు వైరల్