అన్వేషించండి
Upasana Konidela: ప్రీవెడ్డింగ్ ఈవెంట్‌లో చరణ్‌కు అవమానం - ఆసక్తికర పోస్ట్ షేర్ చేసిన ఉపాసన! ఫోటోలు వైరల్
Upasana Post Viral: చరణ్‌ను అవమానించారంటూ వార్త చక్కర్లు కొడుతున్న సమయంలో మెగా కోడలు ఉపాసన ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది

Image Credit: upasanakaminenikonidela/Instagram
1/6

Upsana Shares Pre Wedding Photos: రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్-నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మార్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిన్నటితో కనుల పండుగా ముగిశాయి. మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు గుజరాత్ జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరిగాయి.
2/6

ఈ ఈవెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిరథ మహరథులు హాజరై వేడుకలో సందడి చేశారు.వరల్డ్ వైడ్‌గా ఉన్న పారిశ్రామిక వేత్తలు, దిగ్గజ కంపెనీల సీఈవోలు, వరల్డ్ వైడ్‌గా ఉన్న సినీ ప్రముఖులు, బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వేడుకలో పాల్గొన్ని సందడి చేశారు.
3/6

ఇక ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కి సౌత్ నుంచి కేవలం సూపర్ రజనీకాంత్, టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్-ఉపాసన దంపుతులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో షారుక్ ఖాన్ చరణ్‌ను ఇడ్లీ-వడ అని పిలిచి అవమానించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
4/6

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ వీడియోపై వాడివేడిగా చర్చ జరుగుతుంది. దీనిపై టాలీవుడ్ ఫ్యాన్స్ బాలీవుడ్‌పై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో మెగా కోడలు ఉపాసన ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ నుంచి తిరిగి వచ్చిన ఆమె కొద్ది సేపటి క్రితం ఈవెంట్‌తో భర్తతో కలిసి సందడి చేసిన ఫొటోలను షేర్ చేసింది.
5/6

చరణ్‌తో రెడ్ కార్పెట్ వద్ద దిగిన ఫోటో నుంచి చరణ్ నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసిన ఫొటోలకు కొన్ని ఆసక్తికర ఫొటోలు షేర్ చేసింది. అలాగే ముఖేష్ అంబానీ కలిసి సరదగా ముచ్చటించిన ఫొటోలతో పాటు, ఎంఎస్ దోనీ, సాక్షితో దిగిన ఫోటోలను షేర్ చేసింది.
6/6

దీనికి ఉపాసన ఇలా రాసుకొచ్చింది. అనంత్-రాధికతో పాటు హోల్ అంబానీ ఫ్యామిలీకి శుభకాంక్షలు. నీతాజీ-ముఖేష్ జీ మీ ఆతిథ్యం పోల్చలేనిది, ధన్యవాదాలు. అద్భుతమైన వ్యక్తులతో అద్భుతమైన క్షణాలు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుం ఉపాసన షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Published at : 05 Mar 2024 01:06 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
రాజమండ్రి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion