Trinayani Serial Today february 24th: ‘త్రినయని’ సీరియల్ : ఉలూచిని కాటేసిన పెద్దబొట్టమ్మ - పెద్దబొట్టమ్మను చంపేస్తానన్న సుమన
Trinayani Today Episode: ఉలూచిని, పెద్దబొట్టమ్మ కాటేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా జరిగింది.
Trinayani Serial Today Episode: లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని పెద్దబొట్టమ్మ చెప్పగానే ఆలోచన ఎందుకు లోపలికి వెళ్లి ఉటూచిని ఎత్తుకోపో అని ఎద్దులయ్య, డమ్మక్క చెప్పడంతో పెద్దబొట్టమ్మ లోపలికి వెళ్తుంది. లోపల ఒక్కతే ఆడుకుంటున్న ఉలూచిని చూసిన పెద్దబొట్టమ్మ ఇలా ఒక్కదాన్నే వదిలేశారేంటి అనుకుని ఉలూచిని ఎత్తుకుంటుంది. ఇంతలో లోపలి నుంచి వల్లభ, తిలోత్తమ వస్తారు.
వల్లభ: మమ్మీ పెద్దబొట్టమ్మ.
తిలోత్తమ్మ: మనకే కనిపిస్తుందంటే..
ఎద్దులయ్య: నాగులాపురం నుంచి తీసుకొచ్చిన ఆ పెట్టే అందుబాటులో ఉంటే అందరికీ కనిపిస్తుంది పెద్దమాత.
విశాల్: నయని అలా అన్నదంటే జాగ్రత్త పడాలి. పెద్దబొట్టమ్మ మళ్లీ వద్దువు గానీ ఇప్పుడు నువ్వు వెళ్లు.
పెద్దబొట్టమ్మ: నేను ఇప్పుడు వెళ్లిపోతే సుమన మాట తప్పింది అవుతుంది.
నయని: తప్పితే తప్పింది ప్రమాదం తప్పడం ముఖ్యం.
తిలోత్తమ్మ: ప్రమాదమా? ఎవరికి?
నయని: ఎవరికంటే.. సుమనకే..
విక్రాంత్: నీకు ప్రమాదం వస్తుందని వదిన కంగారు పడుతుంది.
విశాల్: నయని ఎవరివల్ల వస్తుంది. ఏ రూపంలో వస్తుంది.
నయని: తర్వాత చెప్తాను బాబుగారు.
అంటూ నయని చెప్పగానే అందరూ ఇప్పుడే చెప్పాలని అడుగుతారు. నయని చెప్పదు. మొదటిసారి నయని అబద్దం చెప్తున్నట్లుంది అని ఎద్దులయ్య అంటాడు. మేము శివ భక్తులం కాబట్టి ఆ మాత్రం గమనిస్తామని చెప్పడంతో అయితే సుమనకు ప్రమాదం ఎలా వస్తుందో మీరే చెప్పండని తిలోత్తమ అడుగుతుంది.
విశాల్: నయని చెప్పగలదు కానీ ఎందుకో ఆలోచిస్తుంది.
విక్రాంత్: వదిన పర్వాలేదు ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి.
వల్లభ: నాగలోకం నుంచి వచ్చి వెళ్లే పెద్దబొట్టమ్మ చెప్పొచ్చు కదా?
ఎద్దులయ్య: ఎలా చెప్తుంది పుత్రా సమస్య అక్కడే ఉంటే..
సుమన: అంటే
నయని: పెద్దబొట్టమ్మ వల్లే గండం వస్తుంది సుమన.
వల్లభ: వామ్మో అందుకేనా నువ్వు తనని వెళ్లిపో వెళ్లిపో అంటున్నావు. ఏయ్ ఇంకా పిల్లని ఎత్తుకుని ఉంటావేంటమ్మా ఇచ్చేసి వెళ్లు.
పెద్దబొట్టమ్మ: నా వల్ల గండమా..? అదెలా నయని
సుమన: మా అక్క చెప్పాకా ఇంకా ఎలా అని అడుగుతావా? నోరు మూసుకుని వెళ్లిపో..
అంటూ సుమన చెప్పగానే ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. పామునైనా నా కోరల్లో మాత్రమే విషం ఉంటుంది. కానీ నీకు నిలువెళ్లా విషమే ఉంటుందని పెద్దబొట్టమ్మ చెప్తుంది. అమ్మవారి ప్రసాదంలో విషం ఉందని సుమనకు తెలిసినా ఎవ్వరికీ చెప్పలేదు అని పెద్దబొట్టమ్మ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. నిజం తెలియడంతో సుమన కోపంగా పెద్దబొట్టమ్మను మెడపట్టి తోస్తుంది. దీంతో ఆవేశంగా పాములా మారిపోయిన పెద్దబొట్టమ్మ సుమనను కాటు వేసేందుకు వెళ్లగానే సుమన ఉలూచిని అడ్డుపెడుతుంది. పెద్దబొట్టమ్మ ఉలూచిని కాటు వేసి వెళ్లిపోతుంది.
తిలోత్తమ్మ: నయని అన్నట్లుగానే సుమనని కాటేయబోయింది పెద్దబొట్టమ్మ.
నయని: లేదు అత్తయ్యా.. నిజానికి పెద్దబొట్టమ్మ ఉలూచి పాపను కాటేయాలి. కానీ ఆ విషయం చెబితే సుమన తనను ఏం చేస్తుందోనని అబద్దం చెప్పాను.
సుమన: అంటే నా బిడ్డ పాముకాటుకు చనిపోతుందని నీకు ముందే తెలుసన్నమాట.
నయని: అది కాదు చెల్లి.
అనగానే నయని, సుమనల మధ్య గొడవ జరుగుతుంది. ఇప్పుడు ఈ గొడవ అవసరమా? పాపని ఎలా కాపాడాలో నయని ప్రశాంతంగా ఆలోచించి చెప్పు అని విశాల్ అనగానే నయని ఆలోచించి మళ్లీ పెద్దబొట్టమ్మే రావాలని చెప్తుంది. పెద్దబొట్టమ్మను నేనే తీసుకొస్తానని నయని బయటకు వెళ్తుంది. సుమన తన గదిలోకి వెళ్లి కత్తి తీసుకుని పెద్దబొట్టమ్మను చంపేయాలనుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బూట్‌కట్ బాలరాజు’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?