అన్వేషించండి

Bootcut Balaraju OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బూట్‌కట్ బాలరాజు’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Bootcut Balaraju OTT: బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటించిన ‘బూట్‌కట్ బాలరాజు’ మూవీ థియేటర్లలో యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయం వచ్చేసింది.

Bootcut Balaraju OTT Release Date: బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్.. ఆ రియాలిటీ షో నుండి బయటికి వచ్చిన తర్వాత హీరో అవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే ఒకట్రెండ్ చిత్రాల్లో హీరోగా నటించి అలరించాడు కూడా. ఇక తాజాగా తను లీడ్ రోల్ చేసిన ‘బూట్‌కట్ బాలరాజు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలయిన మొదటిరోజే సినిమాకు తగినంత ఆదరణ లభించకపోవడంతో సోహెల్ ఎమోషనల్ అయ్యాడు. దయచేసి ‘బూట్‌కట్ బాలరాజు’ చూడమని ప్రేక్షకులను వేడుకున్నాడు. ఆ తర్వాత మూవీ యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే మూవీ ఓటీటీలోకి రావడానికి సిద్ధమయ్యింది.

రెడీగా ఉండండి..

సోహెల్ హీరోగా నటించిన ‘బూట్‌కట్ బాలరాజు’ ఓటీటీ రైట్స్‌ను ఆహా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ‘వచ్చేత్తనాడు, వచ్చేత్తనాడు. మన 'బూట్ కట్ బాలరాజు'. ఇక ఊరు, వాడ, పిల్లా, జల్లా అందరూ రెడీగా ఉండుర్రి’ అంటూ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది ఆహా. ఫిబ్రవరీ 26న ఆహాలో ‘బూట్‌కట్ బాలరాజు’ స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది. మామూలుగా ఏ సినిమా అయినా అర్థరాత్రి 12 గంటల నుండి స్ట్రీమ్ అవ్వగా ఈ మూవీల మాత్రం సాయంత్రం 6 గంటల నుండే స్ట్రీమ్ అవ్వనున్నట్టు ఆహా ప్రకటించింది. థియేటర్లలో కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘బూట్‌కట్ బాలరాజు’ ఓటీటీలో ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా..

ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించాడు సయ్యద్ సోహెల్. ఫ్యామిలీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన దాదాపు ప్రతీ సినిమాలో సోహెల్‌కు ఒక చిన్న పాత్ర ఉంటుంది. అలా మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారాడు. హీరోగా మారిన తర్వాత తనకు అవకాశాలు వచ్చినా కూడా అదృష్టం మాత్రం కలిసి రాలేదు. కానీ బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల మాత్రం తనకు విపరీతమైన పాపులారిటీ లభించింది. దీంతో ఆ క్రేజ్ ఎప్పటికీ అలాగే ఉంటుంది అనే ఉద్దేశ్యంతో హీరోగా తన దగ్గరకు వచ్చిన అవకాశాలను ఒప్పుకుంటూ వెళ్లిపోయాడు సోహెల్. కానీ బుల్లితెరపై తనను ఆదరించిన ప్రేక్షకులు.. తన సినిమాలు చూడడానికి థియేటర్లకు మాత్రం రాలేదు. ఈ విషయంపై పబ్లిక్‌గా కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు.

అందరి ముందు ఎమోషనల్..

థియేటర్లలో ‘బూట్‌కట్ బాలరాజు’ విడుదల అవ్వగానే మొదటిరోజు రెస్పాన్స్ చూసి మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టాడు సోహెల్. “ఈ సినిమా ఫ్రెండ్స్‌తో మాత్రమే కాదు, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఈ  మూవీలో ఎలాంటి వల్గారిటీ ఉండదు. క్యూట్‌గా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమలో అందరూ చూడండి. హైదరాబాద్ లో మంచి రెస్పాన్స్ ఉంది. కానీ, కొన్ని ఏరియాల్లో సినిమా చూసేందుకు థియేటర్లకు ఎవరూ రావడం లేదు. ప్రేక్షకులు రాక షోలు క్యాన్సిల్ కావడం బాధ కలిగిస్తోంది’’ అంటూ సోహెల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన కొందరు ప్రేక్షకులు తనను హీరోగా ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశ్యంతో థియేటర్లకు వెళ్లారు. దీంతో మూవీ యావరేజ్ హిట్‌గా నిలిచింది.

Also Read: పెళ్లికి సిద్ధమైన ‘బంగారం’ బ్యూటీ - వెడ్డింగ్ డేట్ ఫిక్స్, ఎప్పుడు.. ఎక్కడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget