అన్వేషించండి

trinayani serial tilottama repalcement: 'త్రినయని' తిలోత్తమగా కొత్త నటి.. పవిత్ర జయరాం స్థానంలోకి వచ్చని నటి ఎవరో తెలుసా?

trinayani tilottama: ‘త్రినయని’ సీరియల్‌లో విలన్ తిలోత్తమగా నటించిన పవిత్రా జయరాం చనిపోవడంతో ఆమె స్థానంలోకి వచ్చిన కొత్త నటి గురించి ఆసక్తి విషయాలు.

Trinayani Serial Tilottama Pavitra Jayaram Replacement జీ తెలుగులో ప్రసారమయ్యే పాపులర్‌ సీరియల్స్‌లో '‘త్రినయని’' ఒకటి. ఈ సీరియల్ సూపర్‌ హిట్‌గా ఇప్పటికీ రన్‌ అవడంతో పాటు ఎంతో మంది అభిమానులను దక్కించుకోవడం‌లో విలన్ తిలోత్తమ చాలా ముఖ్య పాత్ర పోషించింది. తిలోత్తమ పాత్రలో నటించిన పవిత్రా జయరాం తన నటన, అభినయంతో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడంతో పాటు సీరియల్‌ టాప్‌లో ఉండటంలో ప్రధాన పాత్ర పోషించింది. అయితే ఇటీవల యాక్సిడెంట్‌లో పవిత్రా జయరాం కన్నుమూశారు. దీంతో తిలోత్తమ పాత్రకు కొత్త నటిని పరిచయం చేసింది ‘త్రినయని’ టీమ్. ఇంతకీ ఆ నటి ఎవరు అంటే..

‘త్రినయని’ సీరియల్‌లో తిలోత్తమ పాత్రలో నటించిన పవిత్రా జయరాం చనిపోవడంతో ఆ పాత్ర పరిస్థితి ఏంటా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీరియల్‌లో హీరోహీరోయిన్‌ పాత్రలైన నయని, విశాల్‌ల కంటే విలన్ పాత్ర తిలోత్తమకే క్రేజ్ ఎక్కువ. దీంతో ఆ పాత్ర అంతే రేంజ్‌లో పోషించే నటి ఎవరు వస్తారా అని అందరూ చర్చించుకున్నారు. అయితే టీమ్ తిలోత్తమ పాత్రలో కొత్త నటిని సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సర్పదీవికి వెళ్లి తిలోత్తమ పూర్తిగా మారిపోయి వస్తుందని చెప్పి కొత్త క్యారెక్టర్‌ని దించారు. అందుకు తగ్గట్టు నటి చైత్ర హలికేరిని పరిచయం చేశారు. 

చైత్ర హలికేరి ఓ కన్నడ నటి. కన్నడలో పలు సినిమాల్లోనూ నటించారు. తెలుగులో బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చిన చైత్ర హలికేరి మా టీవీలో ప్రసారమయ్యే ‘నాగపంచమి’ సీరియల్‌లోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సీరియల్‌లో హీరో మోక్షకు తల్లి వైదేహిగా నటిస్తున్నారు. ‘త్రినయని’లో ప్రస్తుతం చైత్ర గ్లామరస్ తిలోత్తమగా ఆకట్టుకుంటున్నారు. దీనితో పాటు స్టార్‌మాలో వస్తున్న నాగపంచమి సీరియల్‌లో హీరో మోక్షకు తల్లి వైదేహి పాత్రలోనూ చైత్ర నటిస్తున్నారు.  

మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించిన కన్నడ స్టార్ స్థాయికి చేరుకున్నారు చైత్ర హలికేరి. ఈమె కన్నడలో గురుశిష్యారు, శ్రీ దానమ్మ దేవి, ఖుషి వంటి పలు సినిమాల్లో నటించింది. ఇక  కన్నడలో ఓ ఫేమస్ వంట షోలోనూ హోస్ట్ చేశారు.  ఇక ఆమె బాలాజీ పోత్రాజ్ అనే వ్యాపార వేత్తని 2006లో పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక చైత్రకి ఓ చెల్లి కూడా ఉంది. ఆమె పేరు నిఖిలా.

పెళ్లి జరిగిన కొన్ని రోజులకే చైత్ర ఆమె తన భర్త, అత్తమామలపై పోలీస్ కేసు పెట్టంది. వాళ్లు తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. తన సినిమాలు సీరియల్స్ ద్వారా వచ్చిన డబ్బును ఆమె దాచుకోగా.. అత్తింటి వారు బ్యాంక్‌ ఖాతాను ఉపయోగించుకున్నారని కేసు పెట్టింది. అంతే కాకుండా చైత్ర పేరు మీద గోల్డ్ లోన్‌లు కూడా పెట్టేశారట.  

కొత్త తిలోత్తమ పాత్ర చేతికి ఓ గ్లౌజ్ వేసుకొని ఉంటుంది. ఆ చేతిని ఎవరినీ తాకనివ్వదు. దాని వెనకే కథ నడుస్తుంది. ఇక తాజా ఎపిసోడ్‌లో తిలోత్తమ కోడలు హాసిని ఆ చేతిని తాకడం తిలోత్తమ కోపంతో మంత్రాలు చదువుతూ చేతి మీద నిమ్మకాయ రసం పిండటంతో ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. తిలోత్తమ కొడుకు విక్రాంత్ తన తల్లి తిలోత్తమతో పాటు ఉలూచి పాప కాళ్లకు కూడా సాక్స్‌లు ఉండటం అవి తీయడానికి సుమన ప్రయత్నించగా పాప కూడా ఏడుస్తూ గోల చేయడం ఈ రెండు ఘటనల వెనక ఏదో రహస్యం ఉందని అనుమానిస్తాడు. ఇక తిలోత్తమ క్యారెక్టర్‌కి ప్రధాన శత్రువు గాయత్రీ దేవి పునర్జన్మలో పుట్టిన పాప గాయత్రీ ఆ చేతిని తాకితే ఏం కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఆ చేతి వెనక ఉన్న రహస్యంపై అందరూ ఫోకస్ చేయడం వల్ల సీరియల్ ఇంట్రస్టింగ్‌గా ఉంది.

తిలోత్తమ సర్పదీవికి వెళ్లిన సమయంలో ఒక చేత్తో గాయత్రీ పాపని ఎత్తుకొని కుడి చేతితో పాముగా మారిన ఉలూచి పాప పట్టుకుంటుంది. అయితే అక్కడ దీపం వెలిగించడానికి ఉలూచి పాము నుంచి అగ్గి వస్తుంది. తిలోత్తమ దీపం అయితే వెలిగిస్తుంది. ఆ టైంలోనే తిలోత్తమ పాత్ర చేతికి ఏమైనా అయి ఉండవచ్చని అనుకుంటున్నారు.

Also Read: '‘త్రినయని’' సీరియల్: తిలోత్తమ గ్లౌజ్ వేసిన చేతిని తాకిన గాయత్రీపాప.. ఉలూచి కాళ్లకు ఉన్న సాక్స్‌ల వెనక రహస్యం ఉందన్న విక్రాంత్!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
Nindu Manasulu Serial Today October 14th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget