అన్వేషించండి
Advertisement
Suma Kanakala: నీ బొందే నీ బొంద - డ్యూయల్ రోల్‌లో సుమ కనకాల చింపేశారుగా!
Amma vs Ammu ft. by Suma Kanakala: యాంకర్ సుమ కనకాలలో ఒక నటి కూడా ఉన్నారు. లేటెస్టుగా డ్యూయల్ రోల్ చేస్తూ ఒక వీడియో చేశారు. అందులో చింపేశారు.
టాలీవుడ్ టాప్ యాంకర్ ఎవరు? అంటే మనకు ముందుగా గుర్తు వచ్చే పేరు సుమ కనకాల. ఆడియో ఫంక్షన్స్, టీవీ ప్రోగ్రామ్స్, సెలబ్రిటీ ఇంటర్వూస్... ఎప్పుడూ ఏదో ఒక వీడియోతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. ట్రెండ్‌కు తగ్గట్టు మారడమే కాదు, ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటారు. లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతూ సుమ కనకాల ఓ వీడియో చేశారు. అప్పటి తరానికి, ఇప్పటి తరానికి తేడా ఏమిటన్నది వివరిస్తూ సాగిన ఆ వీడియో నెటిజన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తోంది.
amma vs ammu (mother vs daughter): 'అమ్మ వర్సెస్ అమ్ము' పేరుతో సుమ చేసిన వీడియో చూస్తే... చాలా మంది పెద్దలకు తమ చిన్ననాటి సంగతులు గుర్తు రాక మానదు. టూత్ పేస్ట్ అయిపోవడానికి దగ్గరకు వచ్చిన సందర్భాల్లో చాలా మంది పేస్ట్ బయటకు తీయడానికి ఇబ్బంది పడిన పెద్దలు ఉండి ఉంటారు. ఇప్పుడు అయితే ట్యూబ్ స్క్వీజర్లు వచ్చాయి. అటువంటి ట్యూబ్ స్క్వీజర్ కొనుక్కొచ్చిన ఒక అమ్మాయి, ఆమె తల్లికి మధ్య ఎటువంటి సంభాషణ జరుగుతుందనేది వీడియోగా తీశారు. తల్లి (అమ్మ), కుమార్తె (అమ్ము)... రెండు పాత్రలూ సుమ చేశారు. డైలాగులు రైమింగ్ లో ఉన్నాయి. 'నీ బొందే నీ బొంద' అంటూ సుమ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
Also Read: 'బాహుబలి 2'ను బీట్ చేసిన 'ఆర్ఆర్ఆర్', తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే?
టీవీ షోలు, సోషల్ మీడియా పోస్టులతో అలరించే సుమ కనకాల, త్వరలో 'జయమ్మ పంచాయతీ' సినిమాతో వెండితెరపై అలరించనున్నారు. ఆమె టైటిల్ పాత్రలో నటించిన చిత్రమిది. ఏప్రిల్ 22న విడుదల కానుంది.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
సినిమా
ప్రపంచం
రైతు దేశం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion