Maha Kumbh 2025 New Records | ప్రపంచ చరిత్రలో అతి పెద్ద వేడుకగా మహాకుంభమేళా
ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకూ ఏ ఆధ్యాత్మిక వేడుకకు గానీ లేదా ఏ ఇతర వేడుక, కార్యక్రమం పేరు ఏదైనా కానీ 50కోట్లకు పైగా జనాభా పాల్గొంది లేనే లేదు. 50కోట్లు అంటే ప్రపంచంలో అంత మంది జనాభా లేదా అంత కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలు రెండే అవి కూడా భారత్ ఇంకా చైనా. భారత్ 144కోట్ల జనాభాతో ఉంటే చైనా రెండో స్థానంలో 140కోట్ల జనాభాతో ఉంది. సో 50కోట్ల మంది జనాలు గుమిగూడిన లేదా పాల్గొన్న ఏకైక పండుగగా మానవ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది ఈ సారి మహా కుంభమేళా. ఇంకా తొమ్మిది రోజులు గడువున్న మహాకుంభమేళాలో ఇప్పటివరకూ 51కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మానవ చరిత్రలో మునుపెన్నడూ లేని ఇంత పెద్ద వేడుకను ఒకటీ రెండూ అపశృతులు మినహా సీఎం యోగి ఆదిత్య నాథ్ నేతృత్వం లోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించిందనే చెప్పాలి.





















