By: ABP Desam | Updated at : 26 Mar 2022 02:29 PM (IST)
రామ్ చరణ్, ఎన్టీఆర్
దండయాత్ర... ఇది 'ఆర్ఆర్ఆర్' వసూళ్ల దండయాత్ర! ముఖ్యంగా విదేశాల్లో! ఆ దేశం, ఈ దేశం అని లేదు. ప్రతి దేశంలోనూ సినిమా సత్తా చాటుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు, రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షక లోకం ఫిదా అంటోంది. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తూ... దూసుకు వెళుతోంది. ముఖ్యంగా అమెరికా, కెనడాలో 'ఆర్ఆర్ఆర్' భారీ వసూళ్లు సాధించింది. విదేశాల్లో ఈ సినిమా తొలి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే...
అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' సినిమా ఫైవ్ మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ (గురువారం ప్రీమియర్ షోలు ప్లస్ శుక్రవారం కలెక్షన్స్ కలిపి) చేసింది. ఇంకా కొన్ని లొకేషన్స్ అప్ డేట్ చేయాల్సి ఉంది. ఫైవ్ మిలియన్ డాలర్స్ అంటే... భారతీయ కరెన్సీలో సుమారు 38.14 కోట్ల రూపాయలు అన్నమాట.
Also Read: రామ్ చరణ్‌ను చూసి గర్వపడుతున్నా, మా బావ ఎన్టీఆర్ పవర్ హౌస్! - 'ఆర్ఆర్ఆర్'కు బన్నీ రివ్యూ
ఆస్ట్రేలియాలో కూడా సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. అక్కడ సుమారు రూ. 4.03 కోట్లు కలెక్ట్ చేసింది. హాలీవుడ్ సినిమా 'ది బాట్ మ్యాన్' కంటే 'ఆర్ఆర్ఆర్'కు ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం. న్యూజీలాండ్‌లో రూ. 37.07 లక్షలు వచ్చాయి. యూకేలో రూ. 2.40 కోట్లు వచ్చాయి. మొత్తం మీద విదేశాల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమా తొలి రోజు రూ. 67 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసిందట. రెండో రోజు కూడా 'ఆర్ఆర్ఆర్'కు బుకింగ్స్ బావున్నాయి. సో... వీకెండ్ వచ్చేసరికి భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
Also Read: సమంత దూకుడుకు సాటెవ్వరు? విడాకుల తర్వాత బ్రాండ్ వేల్యూ పెరిగిందా?
Koo App‘RRR’ OPENS TO RECORD NUMBERS IN AUS, NZ… #RRR OVERTAKES #TheBatman in #Australia, claiming the No 1 spot on Fri… #NZ is SOLID too… #Australia: A$ 702,560 [₹ 4.03 cr] #NZ: NZ$ 69,741 [₹ 37.07 lacs] #USA: Crosses $ 5 million [Thu previews + Fri, still counting]. #comScore - Taran Adarsh (@taran_adarsh) 26 Mar 2022
Koo App‘RRR’: IT’S A TSUNAMI… #RRR takes an EARTH-SHATTERING START in USA… Preview screenings [Thu]… ⭐️ #USA: $ 3,198,766 ⭐️ #Canada: $ 270,361 ⭐️ #NorthAmerica [#USA + #Canada]: $ 3,469,127 [₹ 26.46 cr] ⭐️ #UK: £ 238,313 [₹ 2.40 cr] ⭐️ #Australia, #NZ [Fri] PHENOMENAL. #comScore - Taran Adarsh (@taran_adarsh) 25 Mar 2022
NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!