RRR Movie Telugu States Box Office: 'బాహుబలి 2'ను బీట్ చేసిన 'ఆర్ఆర్ఆర్', తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే?
RRR Movie Box Office collection Day 1 in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో 'ఆర్ఆర్ఆర్' మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 'బాహుబలి 2'ను బీట్ చేసింది. తెలుగులో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తున్నారు. వీళ్ళు ముగ్గురూ కలిసి చేసిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. శుక్రవారం సినిమా విడుదలైంది. తొలి రోజు ఉదయం ఆట నుంచి థియేటర్ల దగ్గర ప్రేక్షకులు బారులు తీరారు. కొంత మంది బెనిఫిట్ షోలు చూశారు. బెంగళూరులో అయితే గురువారం అర్ధరాత్రి నుంచి షోలు పడ్డాయి. ప్రేక్షకులు, విమర్శల నుంచి మంచి రివ్యూలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ఆర్ఆర్ఆర్' సినిమా తొలి రోజు 73.05 కోట్ల రూపాయలు షేర్ కలెక్ట్ చేసిందని సమాచారం. చాలా ఏరియాల్లో 'బాహుబలి 2' రికార్డులను 'ఆర్ఆర్ఆర్' బీట్ చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
Also Read: విదేశాల్లో 'ఆర్ఆర్ఆర్' వసూళ్ళ దండయాత్ర! ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతంటే?
సీడెడ్ (రాయలసీమ) ఏరియాలో 'ఆర్ఆర్ఆర్' 16 కోట్లు వసూలు చేసింది. అంతకు ముందు హయ్యస్ట్ రూ. 6 కోట్లు మాత్రమే అట. 'బాహుబలి 2'కి తెలుగు రాష్ట్రాల్లో 42.8 కోట్లు వస్తే... 'ఆర్ఆర్ఆర్'కు రూ. 73.05 కోట్లు వచ్చాయి. 'బాహుబలి 2' కంటే 'ఆర్ఆర్ఆర్' సినిమా 30 కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసింది. దాదాపుగా ప్రతి ఏరియాలో రికార్డులు క్రియేట్ చేసింది. ఒక్క తూర్పు గోదావరిలో మాత్రం 'బాహుబలి 2' కంటే వెనుకబడింది. అక్కడ ప్రభాస్ సినిమాకు రూ. 5.93 కోట్లు రాగా... 'ఆర్ఆర్ఆర్'కు రూ. 5.35 కోట్లు మాత్రమే వచ్చాయి.
తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే...
ఏరియా | ఫస్ట్ డే కలెక్షన్స్ |
నైజాం | రూ. 23.50 కోట్లు |
సీడెడ్ | రూ. 16.50 కోట్లు |
ఉత్తరాంధ్ర | రూ. 7.08 కోట్లు |
తూర్పు గోదావరి | రూ. 5.35 కోట్లు |
పశ్చిమ గోదావరి | రూ. 5.93 కోట్లు |
గుంటూరు | రూ. 7.70 కోట్లు |
కృష్ణా జిల్లా | రూ. 4.18 కోట్లు |
నెల్లూరు | రూ. 3.01 కోట్లు |
టోటల్ (ఏపీ, నైజాం) | రూ. 73.05 కోట్లు |
తెలుగు రాష్ట్రాల్లో 'ఆర్ఆర్ఆర్' మూవీ మీద విపరీతమైన హైప్ నెలకొంది. ఐదు రోజుల వరకూ కొన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారు. ఫస్ట్ వీకెండ్ వచ్చేసరికి 'ఆర్ఆర్ఆర్' నభూతో న భవిష్యత్ అనే స్థాయిలో వసూళ్లు సాధించవచ్చని కొందరు చెబుతున్నారు. కొన్ని ఏరియాలో కలెక్షన్స్ డ్రాప్ కావచ్చనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది.
Also Read: రామ్ చరణ్‌ను చూసి గర్వపడుతున్నా, మా బావ ఎన్టీఆర్ పవర్ హౌస్! - 'ఆర్ఆర్ఆర్'కు బన్నీ రివ్యూ