Seethe Ramudi Katnam Serial Today December 23rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కొండెక్కిన సీత దీపం.. మహార్చనల్ని లాక్ చేసేసిన విద్యాదేవి.. సీతకు నిజం చెప్తుందా!
Seethe Ramudi Katnam Today Episode సీత దీపాన్ని మహా, అర్చన ఆర్పేయాలి అనుకోవడం వినేసిన విద్యాదేవి ఇద్దరి గదులను బయట నుంచి లాక్ చేసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode పంతులు చెప్పినట్లు సీత,రామ్ కలిసి తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తారు. ఇక రామ్ సీతతో వీటిని పూర్తిగా నమ్మి నువ్వు డిసప్పాయింట్ అవ్వొద్దని చెప్తాడు. ఏం జరిగినా ధైర్యంగా ఉండమని చెప్తాడు. ఇక ఇద్దరూ కలిసి దీపాలు వెలిగిస్తారు. విద్యాదేవి చూసి మురిసిపోతుంది. ఇద్దరూ కలిసి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మహాలక్ష్మీ, అర్చనలు చూస్తారు. తెల్లారి వరకు దీపాలు వెలగాలి కాపాడు తల్లీ అని సీత మొక్కుకుంటుంది. ఇక సీత రాత్రంతా అక్కడే ఉండి అవి ఆరిపోకుండా చూస్తానని అంటే రామ్ వద్దని చెప్తాడు. భారాన్ని దేవుడికే వదిలేయ్ అని చెప్పి సీతని తీసుకెళ్తాడు.
మహాలక్ష్మీ అర్చనతో వాళ్ల భవిష్యత్ దేవుడి చేతిలో కాదు మన చేతిలో ఉందని అంటుంది. దానికి అర్చన అందరూ పడుకున్న తర్వాత సీత దీపం ఆర్పేద్దాం మహా అని చెప్తుంది. అర్థ రాత్రి మహాలక్ష్మీ బయటకు వెళ్లాలని డోర్ తీస్తే డోర్ లాక్ అయి ఉంటుంది. బయట నుంచి ఎవరైనా లాక్ చేశారా అని అనుకొని మహాలక్ష్మీ తీయడానికి చాలా కష్టపడుతుంది. ఇంతలో జనార్థన్ లేచి అక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతాడు. వాటర్ అని మహాలక్ష్మీ కవర్ చేస్తుంది. ఇక జనార్థన్ పడుకోమని అంటాడు. మహాలక్ష్మీ సీత డోర్ లాక్ చేసుంటుందని అనుకుంటుంది. ఇక అర్చన గది కూడా లాక్ అయిపోయి ఉంటుంది. గిరిధర్ అడిగితే అర్చన వాష్ రూమ్ అంటుంది. దాంతో గిరిధర్ నిద్ర మొహమా వాష్ రూం అది కాదని చెప్తాడు. ఇక అర్చన ఆ విషయం మహాకి చెప్పాలని అనుకుంటుంది. అర్చన ఫోన్ కూడా కనిపించకపోవడంతో ఇది కూడా సీత పనేనా అనుకుంటుంది.
ఇక విద్యాదేవి తనతో తాను మీ ప్లాన్ తెలిసి రూమ్ లాక్ చేసి మీ ఫోన్లు తీసుకున్నా ఇక మీరు ఈ రాత్రికి సీత, రామ్ పెట్టిన దీపాలు ఆర్పలేరని అంటుంది. మరోవైపు సీతకి తను పెట్టిన దీపం ఆరిపోయినట్లు కల వస్తుంది. రామ్‌తో చెప్పి మామ మనం విడిపోకూడదు నువ్వు నాకు కావాలి అని కంగారు పడుతుంది. దాంతో రామ్ సీతని లేపి బయట దీపాలు చూపిస్తాడు. కల కన్నావ్ అని భయపడకు అని అంటాడు. సీత దగ్గరకు వెళ్లి చూస్తానని అంటుంది. సీత, రామ్ ఇద్దరూ దీపాల దగ్గరకు వెళ్తారు. సీత అక్కడే పడుకుంటా అని చెప్తుంది. రామ్ ఎంత చెప్పినా వినదు. రామ్ కూడా అక్కడే పడుకుంటా అని చెప్తే వద్దని అంటుంది. దాంతో రామ్ గదిలోకి వెళ్లిపోతాడు. సీత బయట కూర్చొని దీపాలు చూస్తూ ఉంటుంది. రామ్ అది చూస్తాడు. ఇక ఉదయం రామ్ నిద్ర లేచి ఆరు బయట పడుకున్న సీతని లేపి వెలుగుతున్న దీపాలను చూపిస్తాడు. సీత చాలా సంతోషిస్తుంది. మనం ఎప్పటికీ విడిపోం జీవితాంతం కలిసే ఉంటాం మామ అని రామ్‌ని హగ్ చేసుకుంటుంది.
విద్యాదేవి అక్కడికి వస్తే సీత అత్తమ్మా మా దీపాలు ఆరిపోలేదు మేం ఎప్పటికీ కలిసే ఉంటాం అంటుంది. మహాలక్ష్మీ, అర్చనలు వాళ్ల మాటలు వింటుంటారు. విద్యాదేవి సీత వాళ్లతో మీ జంటను ఎవరూ విడదీయలేదరని చెప్తుంది. మిమల్ని విడదీయాలి అనుకున్నవాళ్లే నష్టపోతారని మహాలక్ష్మీ వాళ్లని చూసి అంటుంది. ఇక సీత, రామ్ సంతోషంగా వెళ్లిపోయిన తర్వాత విద్యాదేవి మనసులో సీతకి సారీ చెప్తుంది. దీపాలు రాత్రి నుంచి వెలుగుతున్నాయనీ మీరు అనుకున్నారు కానీ అసలే జరిగింది అని అనుకుంటుంది. రాత్రి విద్యాదేవి దీపాలు వచ్చి చూస్తుంది. అప్పుడు సీత దీపం కొండెక్కిపోతుంది. దాంతో విద్యాదేవి సీతకి విషయం తెలిస్తే తట్టుకోలేదని అనుకొని ఎవరూ చూడకముందే ఆ దీపం తాను వెలిగించేస్తుంది. ఈ నిజం సీతకి ఎప్పటికీ తెలీకుండా రామ్, సీతల మధ్య గొడవలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: పట్నం చేరుకున్న త్రినేత్రి బామ్మ.. ఇంట్లో రచ్చ చేస్తున్న వల్లభ!