అన్వేషించండి

Satyabhama Serial Today May 28th: సత్యభామ సీరియల్ : లవర్ బాయ్‌ని ఏడిపించేసిన సత్య.. వానలో డ్యాన్స్‌ చూస్తూ ఉండిపోయిన క్రిష్.. రౌడీలను చితక్కొట్టిన మహదేవయ్య! 

Satyabhama Serial Today Episode : క్రిష్ ఇచ్చిన చీర కట్టుకొని వర్షంలో డ్యాన్స్ చేస్తున్న సత్యను చూస్తూ క్రిష్ సంతోషపడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode : క్రిష్ తను తెచ్చిన చీర సత్య కట్టుకోవాలి అని సత్య చీరలన్నీ సంబందానికి ఇచ్చి ఉతికమని అంటాడు. బట్టలేవీ లేవు అన్ని సత్య అనగానే తను తెచ్చిన చీర సత్యకు ఇస్తాడు. దాంతో సత్యకు క్రిష్ మీద అనుమానం వస్తుంది. తన బట్టలు అన్నీ సంబంధానికి ఇచ్చింది నువ్వే కదా అని అడుగుతుంది. 

క్రిష్: అది.. నీకు ఈ గిఫ్ట్ ఇవ్వాలని నేనే అలా చేశాను. 

సత్య: ఎందుకు క్రిష్.. ఇలా చేస్తున్నావ్. నీ మీద నాకు మంచి ఓపీనియ్ కలిగేలోపే ఏదో ఒక పిచ్చి పని చేస్తున్నావ్. అయినా నాకు ఇలాంటి పనులు ఇష్టం ఉండవు అని నీకు తెలీదా. నాకు ఇష్టం లేని పనులు చేస్తే నీకు ఆనందమా.. చూడు నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నన్ను దగ్గర చేసుకోవాలి అని చూస్తే నేను ఎప్పటికీ నీకు దగ్గర కాలేను. ఇది మాత్రం మర్చిపోకు. నేను నీ చేతికి కట్టు కట్టింది నీ మీద కన్సర్న్‌తోనే కానీ ప్రేమతో కాదు. ఇలాంటి పనులు చేసి ఇప్పుడిప్పుడే నీ మీద పెరుగుతున్న గౌరవాన్ని పోగొట్టుకోకు. అయినా నీకు ఎంత చెప్పినా బుర్రకు ఎక్కదులే రౌడీవి కదా. ఇంకోసారి నన్ను విసిగించకు.

క్రిష్: కన్నీళ్లు పెట్టుకుంటూ.. తప్పు నాదే సత్య. నీ నుంచి చాలా ఎక్కువ ఆశిస్తున్నానేమో. ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నానేమో. పిచ్చోడి లెక్క చేతికి గాయం చేసుకున్నా అని నువ్వు కట్టు కడితే దాన్ని ఇంకోలా అర్థం చేసుకున్నాను. ఎక్కువ దూరం పోయా. సత్య కొంచెం జాలి చూపిస్తే ప్రేమ అనుకుంటాను. చేయి పట్టుకుంటే జీవితం మొత్తం కలిసి ఉంటుందని ఆశపడతాను. నేను ఎప్పటికీ ఒంటరివాడినే. ఈ బతుకే అలావాటు చేసుకోవాలి ఎక్కువ ఎమోషన్లు పెట్టుకోకూడదు. 

సత్య క్రిష్ ఇచ్చిన చీర కట్టుకొని వస్తుంది. క్రిష్ చూస్తూ అలా ఉండిపోతాడు. ఇంతలో వర్షం రావడంతో సత్య చిన్న పిల్లా మారిపోతుంది. అక్కడే ఉన్న చిన్న పిల్లలతో కలిసి వర్షంలో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. క్రిష్ భార్యని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో క్రిష్ దగ్గరకు హర్ష వచ్చి తన చెల్లిని పెళ్లికి ముందు ఇంత సంతోషంగా చూశాను అని మళ్లీ ఈ రోజు చూస్తున్నా అంటాడు. ఇక క్రిష్ మనసులో సత్యని మొదటి సారి చూసినప్పుడు ఎంత థ్రిల్‌ అయ్యానో మళ్లీ ఈ రోజు అంతలా అనిపించిందని అనుకుంటాడు. సత్య తనకు దగ్గర అవ్వకపోయినా పర్లేదు తన చిరునవ్వు దగ్గర నుంచి చూస్తూ ఇలాగే ఉండిపోతానని క్రిష్ అనుకుంటాడు. సత్య అంటే ప్రాణం అని అనుకుంటాడు. 

ఇంతలో వర్షం ఆగిపోతుంది. సత్య బుంగ మూతి పెట్టుకోవడంతో క్రిష్ ఓ వాటర్ ట్యాంక్ ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడి సత్య వాళ్ల మీద వర్షంలా నీటిని పోస్తాడు. సత్య, పిల్లలు మళ్లీ హ్యాపీగా ఫీలై డ్యాన్స్ లు చేస్తారు. ఇంతలో సత్య క్రిష్‌ని చూస్తుంది. ఇక క్రిష్ సత్యని చూసి పైపు తన కాలి మీద జారవేసుకుంటాడు. దీంతో అయ్యో అంటాడు అది చూసి సత్య నవ్వడంతో సిగ్గు అయిపోతాడు.

మరోవైపు మహదేవయ్యను చంపడానికి రౌడీలు ఇంటికి వస్తారు. కత్తులు తీసుకొని లోపలికి వెళ్తారు. ఇక మహదేవయ్య గదిలో ఉండడు. ఇక గదిలో టీవీలో క్రిష్ కనిపిస్తాడు. రౌడీలు షాక్ అవుతారు. ఇప్పటి దాకా మీరు వస్తారు అని వెయిట్ చేశానని అంటాడు. వాళ్లు టీవీలో క్రిష్‌ని చూసి ఇదేదో మాయలా ఉందని అనుకొని పారిపోవాలి అనుకోగానే మహదేవయ్య వచ్చి ఇద్దరి గొంతు పట్టుకుంటాడు. క్రిష్ వార్నింగ్ ఇస్తుంటాడు. మహదేవయ్య వాళ్లను చంపేయాలి అని కత్తి తీస్తే క్రిష్ అడ్డుకుంటాడు. 

ఇక భైరవి తన తండ్రిని ఎందుకు ఆపావని అంటుంది. దాంతో క్రిష్ ఎలక్షన్‌ టైం బాపు ఏం చేయకూడదు అని ఆ నర్శింహ సంగతి తాను తేల్చుతాను అని అంటాడు. రోజు పడుకునే గదిలో కాకుండా ప్రత్యేక గదిలో పడుకోమన్నప్పుడే అర్థమైంది నీ తెలివి అని భైరవి అంటుంది. 

మరోవైపు సత్య ఆరు బయట మంచి లొకేషన్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. హర్ష, నందినిలు అక్కడికి వస్తారు. చాలా రోజుల తర్వాత వానలో తడిచి ఎంజాయ్ చేశానని సత్య చెప్తుంది. ఇక నందిని తనకు కొంచెం సేపు స్నానం చేయమంటే చిరాకు అని అలాంటిది అంత సేపు ఎలా తడిచావ్ అని అడుగుతుంది. సత్య తనకు తడవడం ఇష్టం అని చెప్తుంది. ఇక క్రిష్ కూడా అక్కడికి వస్తాడు. ఇక సంబంధం అందరికీ టీ పట్టుకొని వచ్చి ఇస్తాడు. ఇక సత్య వణుకుతుంది. క్రిష్ సత్య కోసం చలి మంట పెట్టడానికి వెళ్తాడు. అది సత్య ప్రేమగా చూస్తుంది. కర్రలు పెడుతుండగా క్రిష్ చేతికి గుచ్చుకొని రక్తం వస్తుంది. సత్య కంగారుగా వెళ్లి రుమాలుతో క్రిష్ చేతికి కడుతుంది. ఇంతలో చక్రవర్తి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. క్రిష్ క్యాంప్‌ ఫైర్ వెలిగిస్తున్నా అంటాడు. ఇక చక్రవర్తి అల్రడీ అంటుకుంది అని అర్థమై అర్థమవనట్లు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: 'జబర్దస్త్'లో స్మాల్ ఛేంజ్ - జడ్జ్ సీటు నుంచి ఇంద్రజ అవుట్, అసలు కారణం అదేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
Naga Chaitanya Fitness Routine : నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
Kakinada Port Issue News: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
Earthquake In Hyderabad List: 50ఏళ్లలో  హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్
50 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే. ఇంతకు ముందు వచ్చింది ఎక్కడంటే..
RGV on Pushpa 2 Ticket Rates: తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
Embed widget