అన్వేషించండి

Satyabhama Serial Today September 25th: సత్యభామ సీరియల్: క్రిష్‌ని బలిపశువుని చేస్తున్న మహదేవయ్య.. భర్త కోసం రుజువుల వేటలో సత్య! 

Satyabhama Today Episode మహదేవయ్య చనిపోయిన ఎమ్మెల్యే కొడుకుని చంపడానికి క్రిష్‌ని రెచ్చగొట్టడం సత్య చెప్పినా క్రిష్ వినకపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today September 5th Episode చక్రవర్తి మహదేవయ్యతో తన కొడుకు క్రిష్‌ కోసం గొడవ పడతాడు. క్రిష్‌ని రౌడీలా తయారు చేస్తున్నావ్ అని అరుస్తాడు. క్రిష్‌ని చూడాలి అనిపిస్తే చుట్టం చూపులా వచ్చి చూసి వెళ్లిపో అని తమ్ముడితో చెప్తాడు. దాంతో చక్రవర్తి అన్నయ్య నా కొడుకుని పనికిరాని వాడిలా పెంచావు. నువ్వు చేయాల్సింది నువ్వు చేశావ్ నేను చేయాల్సింది నేను చేస్తా నీకు నిద్ర లేకుండా చేస్తా అని కిందకి వెళ్తే క్రిష్ చూసి బాబాయ్ అని పిలుస్తాడు. కన్న కొడుకుని చూసి చక్రవర్తి ఎమోషనల్ అవుతాడు. హగ్ చేసుకొని ఏడుస్తాడు.

క్రిష్: ఎట్లా ఉన్నావ్ బాబాయ్..
చక్రవర్తి: మనసులో.. చావలేక బతుకుతున్నాను. బతకలేక చస్తున్నాను. నేను నీ తండ్రి అని నీకు తెలిస్తే బాగున్ను.
క్రిష్: ఏంటి బాబాయ్ ఏదైనా సమస్యనా నాతో చెప్పు నేను చూసుకుంటా. 
చక్రవర్తి: నీకు దూరం అవ్వడమే నా ప్రాబ్లమ్‌రా. 
క్రిష్: తప్పుడు నిర్ణయం తీసుకొని ఇరుక్కుపోయావా ఏంటి.
చక్రవర్తి: జీవితంలో ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నా పర్లేదు కానీ భయంతో నిర్ణయం తీసుకోకూడదు. అది మిగతా జీవితాన్ని మింగేస్తుంది.
క్రిష్: ఎప్పుడూ ధైర్యంగా ఉండే మా బాబాయ్‌ని మొదటి సారి పీలగా చూస్తున్నా. నీకు మామూలు తెలివి కాదు అలాంటి నువ్వే కిందా మీద అవున్నావ్ అంటే నీది మామూలు సమస్య కాదు అందుకే బాపు దగ్గరకు వచ్చావా. మా బాపుదంతా వేరే ఉంటుంది. సమస్య వస్తే దాని గురించి ఆలోచించడు. చంపి పడేస్తాడు. మస్త్ మస్త్ ఐడియాలు ఉంటాయి నీకు ఏమైనా ఇచ్చాడా ఏంటి.
చక్రవర్తి:  ఇచ్చాడు ప్రాబ్లమే లేదు అనుకొని మొత్తం మర్చిపోయి బతికేయమని అంటున్నాడు. లైఫ్లో దాని గురించి ఆలోచించొద్దని చెప్పాడు.
క్రిష్: సూపర్ ఐడియా ఇచ్చాడు బాపు దగ్గర నాకు నచ్చేది ఈ గుణం అందుకే ఆయన్ని గుడ్డిగా ఫాలో అయిపోతా. 


చక్రవర్తి: అది ప్రమాదమేమో.
క్రిష్: చూసుకోవడానికి బాపు ఉన్నాడు కదా. నువ్వు కూడా బాపుని నమ్ముకో.

ఇంతలో సత్య వస్తుంది. ఇద్దరూ చక్రవర్తి ఆశీర్వాదం తీసుకుంటారు. క్రిష్ అమాయకుడని వాడిని అర్థం చేసుకొని జాగ్రత్తగా చూసుకో అని చక్రవర్తి సత్యతో చెప్తాడు.  ఇక జయమ్మ వచ్చి చిన్న కొడుకుని పట్టుకొని చాలా ఏడుస్తుంది. ఇంటికి పిలిచినా రావు ఈ ఇంటి మీద నీకు కోపం కానీ తల్లి మీద కోపం లేదు కదా ఎందుకురా నాకు ఇంత దూరంగా ఉన్నావని చక్రవర్తిని పట్టుకొని ఏడుస్తుంది. దానికి మనసులో చక్రవర్తి నా కొడుకుకి దూరం చేశాను అందుకే నేను తల్లికి దూరం అయ్యానని ఏడుస్తాడు. ఇకపై వస్తానమ్మా అని చెప్తాడు. నా కొడుకు కోసం కూడా వస్తాను వాడి కోసం చేయాల్సింది చాలా ఉందని మనసులో అనుకొని వెళ్లిపోతాడు. క్రిష్ రాత్రి పడుకొని ఉంటే సత్య పక్కనే కూర్చొని మామయ్య, రుద్రల మాటలు తలచుకొని బాధ పడుతుంది.

సత్య: నువ్వు బాపు అని పిలుస్తున్న వ్యక్తి నీ తండ్రి కాదు అని తెలిస్తే తట్టుకోగలవా క్రిష్. ఆయన ముందు నిలబడ గలవా. ఇంతకు ముందులా అభిమానించగలవా. నీ వల్ల కాదు క్రిష్ నాకు తెలుసు. ఆయనేమో నిన్ను కాపాలా కుక్క అంటున్నాడు. అలాంటి వ్యక్తి కోసం నువ్వు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధ పడుతున్నావ్. నన్ను కూడా పక్కన పెట్టేస్తున్నావ్. ఇక ఈ నిజం దాచడం నా వల్ల కాదు క్రిష్. నువ్వు వాళ్ల చేతిలో ఇంకా ఇంకా మోసపోవడం చూస్తూ ఉండటం నా వల్ల కాదు. తండ్రి కాని తండ్రి గురించి నేను ఏం చెప్పినా నువ్వు నమ్మవు. నీకు ఆయనే ప్రపంచం కానీ ఆయన ప్రపంచంలో నీకు చోటే లేదు. ఇప్పుడు నిజం చెప్తే మన బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. పైగా నీ కన్న తండ్రి ఎవరో నాకు తెలీదు. అందుకే నీకు ఇప్పుడు నిజం చెప్పను రుజువులతో కలిపి చెప్తా. అప్పుడు నిన్ను ఈ చెరసాల నుంచి విడిపించి తీసుకెళ్తా. 

నందిని: అత్తమ్మ హర్ష ఎక్కడ.
విశాలాక్షి: నీకు చెప్పలేదా జాగింగ్‌కి వెళ్లాడు. మైత్రి ఒంటరిగా దిగులుగా ఉందని అలా ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారు. నిజంగా హర్ష పూనుకొని మైత్రిని ఇంటికి తీసుకురాకపోతే తను పిచ్చిదానిలా అయిపోయేది. ఒంటరి తనం ఎవరికైనా నరకం కదమ్మా. హర్ష నిజమైన స్నేహితుడిగా మైత్రికి అండగా ఉండి కోలుకునేలా చేస్తున్నాడు. (అసలే నందిని కోపంగా ఉండటం అప్పుడే హర్ష, మైత్రి గట్టిగా నవ్వుకుంటూ రావడంతో ఇంకా రగిలిపోతుంది) 
మైత్రి: హర్ష చాలా గ్రేట్ హస్బెంట్ నువ్వు చాలా లక్కీ నందిని.
నందిని: అది నాకు అనిపించాలి నీకు అనిపిస్తుందేంటి. నేను కూడా మీ దోస్త్ లేక్క జోక్ చేశా. 
విశాలాక్షి: అదేంట్రా బయటకు వెళ్లినప్పుడు నందినికి చెప్పాలి కదరా.
నందిని: చెప్పాలి అంటే నేను ఉన్నాను అని గుర్తు రావాలి కదా. 
 
నందిని గొడవ చేస్తుందని హర్ష మైత్రిని లోపలకు వెళ్లిపోమని అంటాడు. అయినా నందిని భర్తని వెటకారంగా పొగుడుతుంది. అసలు వాకింగ్‌కి వెళ్లారా ఎక్కడైనా కూర్చొని ముచ్చట్లు పెట్టారా అని అంటుంది. ఇద్దరూ ఫ్రెష్ అయి రండి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.. మైత్రి నందిని మాటలకు బాధ పడుతుంది. తనని పట్టించుకోవద్దని మైత్రికి హర్ష చెప్తాడు. 

మహదేవయ్య చిన్నా చిన్నా అని పెద్దగా పిలుస్తాడు. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. మహదేవయ్య తన ఎమ్మెల్యే టికెట్ మళ్లీ రిస్క్‌లో పడిందని చనిపోయిన ఎమ్మెల్యే కొడుకు రామచంద్ర తన టికెట్‌కు అడ్డు వస్తున్నాడని జనాల్లో తన పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నాడని కొడుకులకు చెప్తాడు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సింపతీతో గెలుస్తానని అధిష్టానం ముందు చెప్పాడని అంటాడు. సత్య మాట్లాడుతుంటే అందరితో పాటు క్రిష్ కూడా లోపలికి వెళ్లిపోమని అంటాడు. సత్య వెళ్లనని అంటుంది. మహదేవయ్య ఆ రామచంద్ర నోరు నొక్కేయాలి అని అవసరం అయితే చంపేయ్‌మని అంటాడు. తెలివిగా రుద్రని తిట్టి కొట్టి క్రిష్‌కి పని అప్పగిస్తాడు. సత్య షాక్ అయిపోతుంది. ఇక సత్య క్రిష్‌ని వెళ్లొద్దని అంటే మహదేవయ్య క్రిష్‌తో నువ్వు వెళ్లడం నీ పెళ్లానికి ఇష్టం లేదు నవ్వు వద్దులే రుద్రని పంపుతా అని అంటే క్రిష్ నిన్ను ఎమ్మెల్యేని చేసే వరకు నాదే బాధ్యత అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తాను తీసిన గోతిలో తానే పడ్డ మహాలక్ష్మీ.. జనాతో అక్షింతలూ తప్పలేదుగా పాపం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
Dussera Holidays: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
Ysrcp: జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Second Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లతపవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
Dussera Holidays: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
Ysrcp: జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
YS Jagan: 'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
T20 World Cup 2024 : మహిళల టీ 20 ప్రపంచ కప్‌? - ఈ విషయాలు మీకు తెలుసా?
మహిళల టీ 20 ప్రపంచ కప్‌? - ఈ విషయాలు మీకు తెలుసా?
Tax Changes From 1st Oct: మీ జేబుకు చిల్లుపెట్టే కొత్త టాక్స్‌ రూల్స్‌ - అక్టోబర్‌ 01 నుంచే అమలు!
మీ జేబుకు చిల్లుపెట్టే కొత్త టాక్స్‌ రూల్స్‌ - అక్టోబర్‌ 01 నుంచే అమలు!
Devara 2: ‘దేవర 2’లో ముంబై డాన్ గా ‘యానిమల్’ స్టార్- వెండి తెర రక్తంతో తడిసిపోవాల్సిందేనట!
‘దేవర 2’లో ముంబై డాన్ గా ‘యానిమల్’ స్టార్- వెండి తెర రక్తంతో తడిసిపోవాల్సిందేనట!
Embed widget