అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today September 25th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తాను తీసిన గోతిలో తానే పడ్డ మహాలక్ష్మీ.. జనాతో అక్షింతలూ తప్పలేదుగా పాపం!

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ సీత కస్టమర్ చీర కట్ చేయాలని ప్రయత్నిస్తే సీత ప్లాన్‌తో మహా తన చీరే ముక్కలు చేసుకొని అందరితో మాటలు పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ హాల్‌లో సీత, రామ్‌లు ఫొటో తీసేయాలి అనుకుంటుంది. ఇంతలో సీత, రామ్‌లు రావడంతో ఫొటో మీద దుమ్ము తుడుస్తున్నానని కవర్ చేస్తుంది. సీత అనుమానిస్తే రామ్ మాత్రం పిన్నికి మనం అంటే చాలా ఇష్టం సీత అని మహాలక్ష్మీని పొగుడుతాడు. ఇక సూర్య ఆపరేషన్‌కి డబ్బు ఇచ్చినందుకు అందరూ మిమల్ని పొగిడారని రామ్ చెప్తాడు.

సీత: అందరూ మిమల్ని బాగా పొగిడారు అత్త. మా అక్క అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. రామ్ వెళ్లిపోగానే.. ఏంటి అత్తలు మా ఫొటో బయట పడేయాలి అని అనుకున్నారు కదా మేం రావడం లేటు అయింటే అదే చేసేవాళ్లు. 
అర్చన: అదేం లేదు సీత. 
సీత: నేను పెద్దగా చదువుకోకపోవచ్చు కానీ మిమల్ని చాలా చదివేశాను. ఏది ఏమైనా ఆ ఫొటో చాలా అదృష్టం చేసుకుంది మీ చీరతో తుడిచారు. అదే చేతితో ఆ ఫొటో ఎక్కడ తీశారో అక్కడ పెట్టేయండి. ఆ మాత్రం భయం ఉండాలి. ఇంకోసారి ఇలా చేస్తే మీ చేతి మీద సీత అని పచ్చబొట్టు వేయిస్తా ఎప్పటికీ తీయించుకోలేరు. నాతో పెట్టుకోకండి చిత్తడి చిత్తడి అయిపోతుంది. 
మహాలక్ష్మీ: రామ్ ఉండగా సీతని ఏం చేయలేం.
అర్చన: మనసులో రామ్ లేకపోయినా సీతని ఏం చేయలేవ్.

రాత్రి రామ్ గదిలో సీత కోసం ఎదురు చూస్తుంటాడు. సీత మాత్రం బయట బట్టలు కుట్టుకుంటుంది. రామ్ సీత దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలని నేను వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ బట్టలు కుడుతున్నావా ఇంత కష్టం నీకు అవసరమా అని అడుగుతాడు. ఇక రామ్ కూడా సీతకు సాయం చేస్తాడు. ఇద్దరూ ఆడుతు పాడుతూ పని చేస్తుంటే అలుపేముంది అని పాట పాడుతూ పని చేస్తుంటారు. మహాలక్ష్మీ అది చూస్తుంది. ఇద్దరూ పాటలు పాడుతూ పని చేస్తున్నారా మీ పని చెప్తా అని అనుకుంటుంది. ఇక సీత చీర పని పూర్తి చేసుకొని బ్యాగ్‌లో పెట్టి అక్కడ పెడుతుంది. రామ్ రొమాంటిక్‌గా మాట్లాడి సీతని తీసుకొని వెళ్లిపోతాడు. 

మహాలక్ష్మీ అక్కడికి వచ్చి బిజినెస్‌లో నాతోనే పోటీ పడతావా అని సీత డిజైన్ చేసిన చీరని కత్తెరతో కట్ చేసేస్తుంది. ఉదయం సీత అందరినీ హాల్ లోకి పిలుస్తుంది. తాను కుట్టిన చీర ఎవరో కత్తించారని అంటుంది. మహాలక్ష్మీ వచ్చి నా మీద నీకు అనుమానమా అని నా మీద నింద వేసే అని అంటుంది. సీతకి బిజినెస్ చేయడం రాదని ఇక బొటిక్ మూసేయ్ అని మహాలక్ష్మీ అంటుంది. దాంతో సీత నా కస్టమర్ చీర బాగానే ఉంది ముక్కలైంది మీ చీర అని ట్విస్ట్ ఇస్తుంది. ఇక ఆ చీర సింగపూర్ నుంచి జనార్థన్ తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చాడని అర్చన అంటే మహాలక్ష్మీ చీరని జాగ్రత్తగా చూసుకోలేదని సీత అంటుంది. పంది కొక్కులు చీరని చింపేశాయని సీత అంటూ పంది కొక్కు పేరు పెట్టి ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. ఇక జనార్థన్‌ని రెచ్చగొట్టడంతో జనా మహా మీద చిరాకు పడతాడు. ఇక అందరూ మహాలక్ష్మీని ఓదార్చినట్లు మాట్లాడుతారు. 

రాత్రి మహాలక్ష్మీ చీర కత్తిరించడానికి వెళ్లినప్పుడు కరెంట్ పోతుంది. అదే టైంలో సీత చీర మార్చేస్తుంది. దాంతో మహాలక్ష్మీ తన చీర తానే కట్ చేస్తుంది. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీ తల్లి చనిపోయిందని లక్ష్మీతో చెప్పిన మనీషా.. భాస్కర్‌ గురించి తెలుసుకున్న మనీషా, దేవయాని!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
Pushpa 2 Stampede: 'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
Pushpa 2 Leaked: 'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
Embed widget