Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today September 25th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీ తల్లి చనిపోయిందని లక్ష్మీతో చెప్పిన మనీషా.. భాస్కర్ గురించి తెలుసుకున్న మనీషా, దేవయాని!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ లక్కీ తల్లి గురించి ఆరా తీయడం మనీషా లక్ష్మీతో లక్కీ తల్లి చనిపోయిందని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today September 25th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీ తల్లి చనిపోయిందని లక్ష్మీతో చెప్పిన మనీషా.. భాస్కర్ గురించి తెలుసుకున్న మనీషా, దేవయాని! Chiranjeevi Lakshmi Sowbhagyavathi serial today september 25th episode written update in telugu Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today September 25th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీ తల్లి చనిపోయిందని లక్ష్మీతో చెప్పిన మనీషా.. భాస్కర్ గురించి తెలుసుకున్న మనీషా, దేవయాని!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/25/a56535bdc962227526f161a6a892584d1727229335793882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode వివేక్ తీసుకొచ్చిన డ్రస్ జాను వేసుకొస్తుంది. దాంతో వివేక్ జానుతో ఫొటోలు తీసుకుంటాడు. అది చూసిన దేవయాని రగిలిపోతుంది. దానికి మనీషా మీరు జాను మీద చేయాలనుకున్న ప్రయోగం చేయండని అంటుంది. మరోవైపు బర్త్‌డే పార్టీకి లక్ష్మీ మిత్ర కలిసి పిల్లల్ని తీసుకొని వస్తారు. మిత్ర జున్నుని లక్ష్మీ లక్కీని పట్టుకొని రావడం చూసి అందరూ కన్నుల పండుగలా చూస్తారు. తీరా చూస్తే అదంతా అరవింద ఊహ.
లక్కీని మిత్ర ముందు తీసుకొని వస్తే తర్వాత లక్ష్మీ జున్నుని తీసుకొస్తుంది. ఇక జున్ను ఫ్రెండ్స్ వచ్చి జున్నుతో మీ నాన్నని పరిచయం చేయమని అంటారు. జున్ను తీసుకొని వెళ్తాడు. పిల్లలు మిత్రని చూసి ఈయన లక్కీ నాన్న కదా అని అంటారు. లక్కీ వాళ్ల ఫ్రెండ్స్ మా ఇద్దరి నాన్న ఒక్కరే అని అంటుంది. మిత్ర కాదు అని చెప్పే లోపు లక్ష్మీ వచ్చి రెండు చేతులు జోడించి దండం పెట్టడంతో మిత్ర అవును అని చెప్తాడు. దాంతో పిల్లలు చాలా సంతోషిస్తారు. మనీషా, దేవయాని షాక్ అయిపోతారు. ఇక పిల్లలు జున్నుకి తండ్రి అంటే ఎంత ఇష్టమో చెప్తారు. ఇక జున్నుని తండ్రి లేరని చాలా ఏడిపించామని సారీ అని చెప్తారు. పిల్లలు ఎక్కువ సేపు మాట్లాడొద్దని అనుకున్న మనీషా అక్కడికి వచ్చి పిల్లల్ని పంపేసి మిత్రని వేరే చోటుకు పంపేస్తుంది.
ఇక లక్కీ ఓకావిడకు తను మా అమ్మ అని చెప్తుంది.. దాంతో ఆవిడ నువ్వు అచ్చం మీ అమ్మలా ఉన్నావని అంటుంది. లక్ష్మీకి అనుమానం వచ్చి అరవిందతో మాట్లాడటానికి వెళ్తుంది. లక్కీ ఎక్కడ పుట్టిందని అడుగుతుంది. హాస్పిటల్‌లో పుట్టిందని అరవింద చెప్తుంది. దాంతో లక్ష్మీ జున్ను కూడా ఓ హాస్పిటల్‌లో పుట్టాడని చెప్తుంది. ఇంకా లక్ష్మీ ఏవో ప్రశ్నలు అడిగేలోపు మనీషా వచ్చి ఆపేస్తుంది. అరవిందని పంపేస్తుంది.
మనీషా: మీరు మాట్లాడుకుంటుంది లక్కీ గురించే కదా.. లక్కీ ఎక్కడ పుట్టిందో ఎవరికీ పుట్టిందో నీకు తెలియాలి అంతే కదా. లక్కీ పుట్టినప్పుడు నేను అక్కడే ఉన్నాను. భాస్కర్ చెల్లికి నొప్పులు వస్తే మేం హాస్పిటల్‌కి చేర్చాం. ఆ టైంలో లక్కీ కూడా పుట్టింది. లక్కీ తల్లి అప్పుడే చనిపోయింది. అందుకే మిత్ర లక్కీని సొంత కూతురిలా పెంచుకుంటున్నాడు. లక్కీకి తప్ప ఈ విషయం అందరికీ తెలుసు. నువ్వు ఈ విషయం లక్కీకి చెప్పకు మిత్రకు తెలిస్తే చంపేస్తాడు.
లక్ష్మీ: లక్కీ జున్ను ఒకేసారి పుట్టడం యాదృచ్ఛికం అన్నమాట లక్కీకి నాకు ఏం సంబంధం లేదంట.
దేవయాని: నువ్వు సూపర్ మనీషా. ఒక టెన్షన్ పోయింది నీకు ఇంక ఆ భాస్కర్ టెన్షనే ఉంది.
మనీషా: అవును ఆంటీ.
పార్టీకి మిత్ర అందర్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటే అర్జున్ వస్తాడు. అర్జున్ హాయ్ చెప్పి చేయి అందిస్తే మిత్ర పట్టించుకోడు. ఇక జున్ను వచ్చి బాబా అని మాట్లాడుతాడు. ఇక జున్ను, లక్కీలకు అర్జున్ గిఫ్ట్‌లు ఇస్తాడు. ఇక జాను వస్తే డ్రస్ బాగుందని అర్జున్ చెప్తాడు. దాంతో దేవయాని రగిలిపోతుంది. అర్జున్ లక్ష్మీ గురించి అడిగి లక్ష్మీని కలవడానికి వెళ్తాడు. మరోవైపు జాను డ్రస్ మీద దేవయాని డ్రింక్ విసిరేసి దాక్కుండిపోతుంది. జాను డ్రస్ తుడుచుకుంటూ వెళ్తుంది. వివేక్ ఎదురైతే చాలా ఫీలవుతుంది. డ్రస్ మార్చుకోవడానికి వెళ్తుంది.
అర్జున్ లక్ష్మీని కలుస్తాడు. మిత్రతో నిజం చెప్పమని అంటాడు. లక్ష్మీ అప్పుడు ఇంకా తన మీద అనుమానం వస్తుందని అంటుంది. ఇక లక్ష్మీ యాక్సిడెంట్ కేసు గురించి అర్జున్‌ని అడుగుతుంది. దాంతో అర్జున్ అతన్ని ఎవరో చాలా రోజుల నుంచి బంధించి కొట్టారని అంటాడు. డాక్టర్ చెప్పింది చెప్తే ఆ మాటలు మనీషా దేవయాని విని భాస్కర్ అయింటాని అనుకుంటారు. దాంతో వెంటనే రౌడీలకు కాల్ చేసి వాళ్లని హాస్పిటల్‌కి పంపిస్తుంది. ఇక ఫొటో గ్రాఫర్ మిత్రని ఫ్యామిలీ ఫొటో తీస్తానని పిలుస్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తియిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)