Satyabhama Serial Today September 24th: సత్యభామ సీరియల్: వామ్మో మహదేవయ్య క్రిష్ జీవితాన్ని ఇలా మార్చేశావా.. క్రిష్ కన్న తండ్రి అతనేనా, మరో వారసుడూ ఉన్నాడా?
Satyabhama Today Episode క్రిష్ మహదేవయ్య తమ్ముడు చక్రవర్తి అని మహదేవయ్య చిన్న కొడుకు చక్రవర్తి దగ్గర ఉన్నాడనే నిజం తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode : ఇంట్లో అందరూ భోజనాలకు కూర్చొంటారు. సత్య క్రిష్‌ని చూస్తూ మనసులో నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసే నిజం తెలిసింది ఇది తెలిస్తే నువ్వు ఎలా తట్టుకోగలవు క్రిష్ అని అనుకుంటుంది. మహదేవయ్య, రుద్ర ప్రేమగా మాట్లాడుకుంటూ కిందకి దిగుతారు. అది చూసి సత్య మహదేవయ్య మాటలు గుర్తు చేసుకొని కోపంతో ఉంటుంది.
మహదేవయ్య: ఏమైంది అమ్మా అలా చూస్తున్నావ్.
జయమ్మ: నీకు రెండు వైపులా నీ కొడుకుల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. చిన్న కొడుకు నీ కుడి భుజం అయితే పెద్ద కొడుకు నీ ఎడమ భుజం.
మహదేవయ్య: రేయ్ చిన్న మీ బామ్మ ఏం చెప్పిందో విన్నావు కదరా.
క్రిష్: కరెక్ట్ చెప్పిందిరా.
మహదేవయ్య: తప్పు చెప్పిందిరా. నా బాధ్యతలు మోసే ముచ్చటకు వస్తే నా రెండు భుజాలు చిన్న ఒక్కడే. నా బలం బలగం అన్నీ చిన్నే. ఒక్క మాటలో చెప్పాలి అంటే నాకు అన్నీ చిన్నానే.
క్రిష్: నన్ను ఎక్కువ పొగిడేస్తున్నావ్ బాపు.
భైరవి: నిన్ను పొగిడితే పొగిడారు కానీ పెద్దొడిని అలా కరివేపాకులా తీసి పారేస్తే వాడి మనసు నొచ్చుకోదా.
జయమ్మ: అది సరే కానీ నువ్వు నీ పెద్ద కొడుకు గదిలోకి వెళ్లి చాలా సేపు ముచ్చట్లు పెట్టుకున్నారు ఏంటి సంగతి.
రుద్ర: కొన్ని జీవిత సత్యాలు చెప్పాడమ్మా మూసుకుపోయిన నా కళ్లు తెరిపించాడు. నేనేంటో నాకు తెలిసేలా చేశాడు. గుండెలో భారం మొత్తం దిగిపోయింది. రిలీఫ్‌గా ఉంది.
సత్య: ఇది చాలా అన్యాయం కదా బావగారు. ఆ జీవిత సత్యాలు మీ తమ్ముడికి కూడా తెలియాలి కదా. అదే మామయ్య మూసుకుపోయిన కళ్లు తెరుచుకుంటాయి. తనేంటో మీ చిన్నాకి కూడా తెలుస్తుంది. తన లైఫ్ తానే డిసైడ్ చేసుకుంటాడు.
క్రిష్: సత్య ఎవరికీ ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో బాపునకు బాగా తెలుసు. ఈ ఇంట్లో ఎవరి లైఫ్ ఎలా ఉండాలో బాపునే నిర్ణయిస్తాడు.
సత్య: అది నిజమే ఒప్పుకుంటాను ఈ ఇంట్లో అందరి తలరాత రాసిన దేవుడు మామయ్యే. కానీ నీ తల రాత నీకు తెలియాలి కదా అడగాలి కదా.
క్రిష్: అడిగితే వరాలు ఇచ్చేది దేవుడు అయితే అడగకుండా వరాలు ఇచ్చేది మా బాపునే.
మహదేవయ్య మేడ మీద సిగరెట్ కాల్చుతుంటే ఆయన తమ్ముడు చక్రవర్తి వచ్చి మహదేవయ్య కాలర్ పట్టుకుంటాడు. నువ్వు ఎవరి కాలర్ పట్టుకున్నావో తెలుసా చక్రవర్తి అని మహదేవయ్య అడుగుతాడు. దానికి చక్రవర్తి తెలుసు నమ్మించి మోసం చేసిన మోసగాడిని పట్టుకున్నా అంటాడు.. గౌరవాన్ని పోగొట్టుకున్నావని అంటాడు. నువ్వు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటని ఫుల్ ఫైర్ అడుగుతాడు. సహనం చచ్చిపోతే పిల్లి కూడా పులి మీద తిరగబడుతుందని అంటాడు.
మహదేవయ్య: నువ్వు కూడా నా సహనానికి పరీక్ష పెడుతున్నావ్. నా పర్మిషన్ లేకుండా ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావ్. నేను నీకు పెట్టిన కండీషన్ ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి. నేను మూడు లెక్క పెట్టేలోపు ఇక్కడి నుంచి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపో.
చక్రవర్తి: నేను పోను.
మహదేవయ్య: పోవాలి.
చక్రవర్తి: నేను పోతే నా వెంట నా కొడుకుని తీసుకుపోతా. ఎవరు ఆపుతారో చూస్తా.
మహదేవయ్య: ఎవర్రా నీ కొడుకు.
చక్రవర్తి: కృష్ణ. కృష్ణ.. చిన్నా..
మహదేవయ్య: ఇంకోసారి నీ నటి నుంచి ఆ మాట వస్తే గొంతు పిసికేస్తా తమ్ముడివి అని కూడా చూడను. లోకం దృష్టిలో వాడు నా కొడుకు నాతోనే ఉంటాడు.
చక్రవర్తి: కొడుకు అంటే ఎలా చూసుకోవాలి. గుండెల్లో పెట్టుకోవాలి కదా కానీ వాడిని చావు అంచుల వరకు తీసుకెళ్లావ్. క్షేమంగా చూసుకుంటా అని మాట ఇచ్చావని ఇన్ని రోజులు ఈ ఇంటి వంక చూడలేదు. వాడిని ఒక రౌడీలా పెంచావ్ నీలా తయారు చేశావ్. కానీ ఇప్పుడు వాడిని చావుకి బలి ఇస్తే ఎలా చూస్తూ ఉంటా. వాడిలో ఉన్నది నా రక్తం చూస్తూ ఎలా ఉంటా.
మహదేవయ్య: కానీ వాడు బాపు అని పిలిచేది నన్ను వాడిలో ఉన్నది నా మొండితనం నా పొగరు నా మీద ప్రేమ. నా కోసం ప్రాణం ఇచ్చే ప్రేమ అయినా నువ్వు వాడిని నా మీద ప్రేమతో ఇవ్వలేదు. అప్పుడేం జరిగిందో గతం గుర్తు చేయాలా.
గతంలో.. క్రిష్ పుట్టినప్పుడు..
భైరవికి రెండో కాన్పులో మగ పిల్లాడు పుడతాడు. ఇంతలో రౌడీలు కొందరు మహదేవయ్యతో గొడవకు దిగుతారు. మహదేవయ్య రౌడీలను చితక్కొట్టి చంపేస్తాడు. ఇక జయమ్మ మహదేవయ్య దగ్గరకు వచ్చి రౌడీయిజం వద్దని నీకు చెప్పినా వినవని నీ పిల్లలకు ప్రమాదమని అంటాడు. దాంతో మహదేవయ్య రుద్రని తీసుకొని జయమ్మని తన పుట్టింటికి వెళ్లిపోమని అంటాడు. జయమ్మ వెళ్లిపోయిన తర్వాత మహదేవయ్య దగ్గరకు చక్రవర్తి వచ్చి తనకు కూడా కొడుకు పుట్టాడని అంటాడు. ఇక తన బిడ్డను తీసుకొని మహదేవయ్య చక్రవర్తి బిడ్డను చూస్తానని అంటాడు. తన కొడుకుని తీసుకొని అక్కడికి వెళ్తాడు. ఇక చక్రవర్తి కొడుకొని తన చేతిలోకి తీసుకొని మహదేవయ్య తన కొడుకుని చక్రవర్తికి ఇస్తాడు. చక్రవర్తి తన భార్య ఒప్పుకోకపోవడంతో మహదేవయ్య చక్రవర్తి భార్య సీతని చంపేస్తాడు. చక్రవర్తి చాలా ఏడుస్తాడు. అన్నని రాక్షసుడా అని తిడుతూ ఏడుస్తాడు. ఇక చక్రవర్తి, సీతల కొడుకు క్రిష్‌ని మహదేవయ్య తన భార్య భైరవికి తమ బిడ్డగా చెప్తాడు.
ప్రస్తుతం..
క్రిష్ తన కొడుకని అందుకు తగ్గట్టు పెంచుతున్నానని నీకు ఇష్టమైతే చూడు లేకపోతే లేదు అంటాడు. ఇంకోసారి క్రిష్‌ని నీ కొడుకు అని అంటే బాగోదంటాడు. దాంతో చక్రవర్తి నీ కొడుకు నా దగ్గర ఉన్నాడని అది మర్చిపోవద్దని అంటాడు. క్రిష్‌ని అలా నీ కాళ్ల దగ్గర తిరిగే కుక్కలా మార్చేశావని మహదేవయ్య మీద ఫైర్ అవుతాడు. నీ కొడుకుని సంస్కార వంతుడిగా పెంచానని చక్రవర్తి అంటే నేను నీ కొడుకుని మగాడిలా పెంచానని ఒకసారి క్రిష్ ముందు నా గల్లా పట్టుకో వాడు నీ ప్రాణం తీసేస్తాడని అంటాడు మహదేవయ్య.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి చీరల రచ్చ.. మహాలక్ష్మీకి ఇచ్చిపడేసిన విద్యాదేవి, జనార్థన్‌లు!