Seethe Ramudi Katnam Serial Today September 24th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి చీరల రచ్చ.. మహాలక్ష్మీకి ఇచ్చిపడేసిన విద్యాదేవి, జనార్థన్‌లు!
Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవినే సుమతి అని సీత, రామ్‌లకు అనుమానం వచ్చి శివకృష్ణతో ఫోన్ చేయించి టీచర్‌తో మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode సూర్యకి ఆపరేషన్ అయి సూర్య నడిచేయడంతో శివకృష్ణ ఇంట్లో కూతుళ్లు అల్లుళ్లతో సందడిగా ఉంటుంది. అందరూ కలిసి సరదాగా భోజనం చేయాలని అనుకుంటారు. మరోవైపు మహాలక్ష్మీ సుమతి చీరలన్నీ ఓ మాట కట్టుకొని కిందకి తెస్తుంది. అర్చన వచ్చి ఏంటని అడిగితే సుమతి చీరలని సుమతికి సంబంధించి ఏ వస్తువులు ఉండొద్దని అది నాకు ఇష్టం లేదని అంటుంది. ఇక వాటిని చెత్తలో పడేయాలని రాజ్యాన్ని పిలుస్తుంది. రాజ్యం లేకపోవడంతో వాళ్ల చెల్లి వస్తుంది. మహాలక్ష్మీ ఆవిడకు ఆ చీరలు పట్టుకెళ్లిపోమని అంటుంది. ఇంతలో విద్యాదేవి వచ్చి ఆ చీరలు తీసుకెళ్లొద్దని అంటుంది.
అవి సుమతి గారి చీరలని విద్యాదేవి చెప్పడంతో పని మనిషి కింద పెట్టేసి వాటికి దండం పెడుతుంది. ఇక పని మనిషి వద్దని వెళ్లిపోతే మహాలక్ష్మీ వాటిని తీసుకెళ్లిపోమని అంటుంది. ఇక విద్యాదేవి సుమతి చీరలు మీరు ఎలా దానం చేస్తారు అని అంటుంది.
విద్యాదేవి: మీరు ఈ చీరలు దానం చేయడానికి వీల్లేదు. కావాలి అంటే మీ చీరలు ఇచ్చుకోండి
మహాలక్ష్మీ: మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. నేను సుమతి చీరలే ఇస్తానో మీ చీరలు ఇస్తానో మీకేంటి. అయినా ఇవన్నీ అడగటానికి మీరు ఎవరు. నన్ను ప్రశ్నించే హక్కు అధికారం మీకు లేదు.
జనార్థన్: నాకు అయినా సమాధానం చెప్తావా మహాలక్ష్మీ. సుమతి చీరల గురించి అడిగే హక్కు నాకు అయినా ఉందని అనుకుంటున్నావా మహాలక్ష్మీ. నేను అంతా విన్నాను. విద్యాదేవి మాట్లాడిన దాంట్లో తప్పేముంది. అయినా సుమతి చీరలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది. నీకు అవి ఏం అడ్డు ఉన్నాయ్. మనకు సుమతి ఎంత ముఖ్యమో తన జ్ఞాపకాలు కూడా అంతే ముఖ్యం. ఒకప్పుడు సుమతి లేదు అనుకున్నా ఇప్పుడు తను ఉందని తెలుసు కదా. ఇన్నాళ్లు తన జ్ఞాపకాల్లో బతికిన నేను ఇప్పుడు తను ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. సుమతి మీద ఈ విద్యాదేవి గారికి ఉన్న అభిమానం కూడా నీకు లేదా. సుమతికి నువ్వు ఇచ్చే విలువ ఇంతేనా. నా భార్య సుమతి విషయంలో మీరు తీసుకున్న కేర్‌కి చాలా థ్యాంక్స్ విద్యాదేవి గారు. సుమతిపై టీచర్‌కి విద్యాదేవికి ఉన్న విలువ నీకు లేదు.
మహాలక్ష్మీ: ఛా సుమతి విషయంలో నాకు ప్రతీ సారి ఏదో ఒక అవమానం జరుగుతూనే ఉంది.
మధు మరోసారి సీత, రామ్‌లకు థ్యాంక్స్ చెప్తుంది. ఇక మధు వాళ్లు తమ ఇంటికి బయల్దేరుతారు. సీత వాళ్లు కూడా బయల్దేరుతారు. ఇక సీత కొన్ని విషయాల్లో నాకు అనుమానం వస్తుందని తల్లిదండ్రులతో చెప్తుంది. ఒక్కోసారి ఆమె సుమతి అత్తమ్మ ఏమో అని అనుమానం వస్తుందని అంటుంది. రామ్ కూడా టీచర్ మా అమ్మే అనిపిస్తుందని అంటాడు. శివకృష్ణ, లలితలు కవర్ చేస్తారు. ఇక సీత తన తండ్రికి టీచర్‌కి కాల్ చేసి స్పీకర్ పెట్టి మాట్లాడమని అంటుంది. శివకృష్ణ టెన్షన్ పడతాడు. ఇక శివకృష్ణ విద్యాదేవికి కాల్ చేస్తాడు. సీతకి డౌట్ రాకుండా మాట్లాడుతాడు. ఇక సీతకు సాయం చేసినందుకు థ్యాంక్స్ అంటాడు.
విద్యాదేవి: అలా మాట్లాడుతారేంటి అన్నయ్య. సీత ఏమైనా పరాయిదా నా మేనకోడలే కదా. పైగా మేం అత్తా కోడళ్లమే కదా. రామ్ నా కొడుకు సీత నా కోడలు వాళ్ల వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నయ్య. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఏంటి అన్నయ్య సైలెంట్‌గా ఉన్నారు. రామ్ నా కొడుకు సీత నా కోడలే కదా. ఎప్పుడు అయితే నేను నీ చేతికి రాఖీ కట్టానో అప్పుడే నువ్వు నాకు తోడబుట్టిన వాడివి అయ్యావు. ఒక్కోసారి నాకు మీ సొంత చెల్లి అయింటే బాగున్నని అనిపిస్తుంది.
శివకృష్ణ: జన్మజన్మలకు నువ్వే నాకు చెల్లిగా పుట్టాలి అమ్మా విన్నారు కదా ఆవిడ ఏం మాట్లాడిందో ఇంకెప్పుడు ఇలాంటి అనుమానాలు పెట్టుకోకు.
సీత, రామ్‌లు వెళ్లిపోతారు. సుమతికి అనుమానం వచ్చే కవర్ చేసుంటుందని అనుకుంటారు. మహాలక్ష్మీ హాల్‌లో రామ్, సీతల ఫొటో చూసి ఆ ఫొటో నాకు చాలా ఇరిటేషన్ వస్తుందని సీత లేదు కాబట్టి దాన్ని తీసి పడేద్దామని అంటుంది. అర్చనకు తీసేయ్ మంటే భయపడుతుంది. దాంతో మహాలక్ష్మీ వెళ్లి ఆ ఫొటో తీసేస్తుంది. ఫొటో కింద పడేసే టైంకి రామ్, సీతలు ఇంటికి వస్తారు. దాంతో మహాలక్ష్మీ ఆగిపోతుంది. సీత వచ్చి మా ఫొటో ఎందుకు తీశారని అడుగుతుంది. దాంతో మహాలక్ష్మీ తన కొంగుతో ఫొటో తుడిచి బూజు తుడుస్తున్నా అని కవర్ చేస్తుంది. రామ్ మీరు గ్రేట్ పిన్ని అని పొగిడేస్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.