అక్షర గౌడ ఇన్‌స్టా ఐడీ కోసం తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. ఆ సిరీస్‌లో చూసి
ఇన్‌స్టాలో ప్రస్తుతం అక్షర గౌడ బిక్కీ గురించిన చర్చ ఎక్కువైంది. ఆమె ఇన్‌స్టా ఐడీ గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
తాజాగా హాట్‌స్టార్‌లో విడుదలైన the mystery of moksha island సిరీస్‌లో ఈ భామ నటించింది.
ఆ సిరీస్‌లో ఈ భామని చూసిన నెటిజన్లు ఆమె ఫోటోలతో మీమ్స్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్‌లు వేస్తున్నారు.
ఆమె ఐడీ iaksharagowda అంటూ ఆమె ఐడీని ట్యాగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఈమెకు పెళ్లి కూడా అయ్యింది. ఈమె భర్త పేరు ఆకాశ్ బిక్కీ. ఒకప్పుడు క్రికెటర్ యువరాజ్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ అంటూ పలు కథనాలు వచ్చాయి.
అయితే అక్షర గౌడ బిక్కీకి ఇదే మొదటి సిరీస్ కాదు. ఎన్నో సినిమాల్లోనూ, సిరీస్‌లలోనూ ఆమె నటించింది.
తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో నటించింది. తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. మన్మథుడు 2లో కూడా ఉంది.
తుపాకీ, ఆరంభం వంటి సినిమాల్లో కూడా నటించింది అక్షర గౌడ బిక్కీ. సినిమాలే కాకుండా పలు సిరీస్‌లు కూడా చేసింది.
తాజాగా The Mystery of Moksha Island అనే సిరీస్‌లో నటించింది.
ఈ సిరీస్ మిక్స్డ్ రివ్యూలు అందుకుంది కానీ.. అక్షర గౌడకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.