Satyabhama Serial Today October 5th: సత్యభామ సీరియల్: సత్య పెట్టిన పజిల్ కోసం తిప్పలు పడుతున్న క్రిష్.. రేణుక సీమంతాన్ని రుద్ర ఆపేస్తాడా?
Satyabhama Today Episode రేణుకకు నెలలు నిండుతున్నాయని సీమంతం చేద్దామని అందరూ నిర్ణయించుకోవడం రుద్ర వద్దని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది.
Satyabhama Serial Today Episode మహదేవయ్య పెత్తనం సత్యకి ఇచ్చేయ్మని చెప్పడంతో భైరవి కోపంతో ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో పంకజం భైరవి దగ్గరకు వచ్చి టీ ఇస్తూ సత్య పర్మిషన్ తీసుకొనే ఇస్తున్నా ఏం కాదు అని రెచ్చగొడుతుంది. నేనేం తినాలి అన్నా దాన్ని పర్మిషన్ తీసుకోవాలా అని భైరవి కోప్పడుతుంది.
పంకజం: పెత్తనం చేజారిపోయినప్పుడు తల దించుకోవాలి కానీ తల ఎగరేయకూడదమ్మా.
భైరవి: నా దగ్గర పని చేస్తూ నన్నే అంటావా.
పంకజం: ముందే చెప్పా కదమ్మా చిన్న కోడలు చాపకింద నీరులా తయారవుతోందని మీకు తెలుసి రాలేదు. మీ కున్న ఒక్కోక్క అధికారాన్ని మీ చిన్న కోడలు లాగేసుకుంటుంది. అయ్యగారు కూడా ఆమెకే పర్మిషన్ ఇస్తుంది. పడక కుర్చీ ఎక్కడేసుకోవాలా అని మీరు లోకేషన్ వెతుక్కోండి.
భైరవి: చివరకు పంకజం కూడా లోకువ అయిపోతున్నా చివరకు నా బాధ్యతలు నేను తీసుకుంటా చిన్న కోడలా నిన్ను బయటకు తోలేస్తా.
క్రిష్: ప్రపంచంలో భార్య పుట్టిన రోజు తెలియని భర్త నేనే ఉంటానేమో. ఏం బతుకురా నీది. నా బాధకి బాపు దగ్గర అయింట్ మెంట్ దొరకొచ్చు సత్య ప్రశ్నకి బాపు దగ్గర సమాధానం తెలియొచ్చు అడిగి చూస్తా. అని మహదేవయ్య అరుబయట సిగరెట్ తాగుతుంటే అక్కడికి వెళ్లి కాళ్ల కింద కూర్చొని కాక పట్టడానికి కూర్చొంటాడు.
మహదేవయ్య: ఏంట్రా ఏదైనా పని ఉందా.
క్రిష్: ఏయ్ నీకు ఎలా తెలిసిపోయింది బాపు.
మహదేవయ్య: నీ ముఖం చూడగానే తెలిసిపోయింది.
క్రిష్: జనరల్‌గా మాట్లాడుదామని వచ్చా మనకు ఎన్ని తెలుగు నెలలు ఉన్నాయి బాపు.
మహదేవయ్య: తెలీదని నీళ్లు నములుతారు. మోసాలు గురించి అడుగు చెప్తా మాసాల గురించి నాకేం తెలీదు.
క్రిష్: మనసులో నీకేంటి బాపు ఫస్ట్ నైట్ అయి పిల్లలకు పెళ్లి చేసి కాళ్లమీద కాళ్లు వేసుకొని హ్యాపీగా ఉన్నావ్ నా పని చూడు పస్తులున్నా.
మహదేవయ్య: ఏంట్రా ఏమైంది ఏదో గొనుగుతున్నావ్.
క్రిష్ పంకజం దగ్గరకు వెళ్లి నిల్చొంటాడు. పంజకం కొంగు కప్పుకుంటుంది. దానికి క్రిష్ ఇది ఏదో తేడాగా ఆలోచిస్తుందని అనుకొని నువ్వేం కప్పుకోకు నేను ఓ ప్రశ్న అడటానికి వచ్చానని అంటాడు. ఇక క్రిష్ తెలుగు మాసాలు ఎన్ని అని పంకజాన్ని అడుతాడు. దానికి పంకజం నా కూతురికి నాలుగు మాసాలు. నా మొగుడు నాకు చీర కొంటా అని 11 మాసాలు అయింది. ఈ మాసాలు తప్ప నాకు మరేవీ తెలీవని అంటుంది. క్రిష్ నెత్తి కొట్టుకొని వచ్చేస్తాడు. ఇక బాబీకి కాల్ చేసి నేను చెప్పింది ఏం చేశావని అడుగుతాడు. ఇంతలో సత్య కాఫీ తీసుకొని వస్తుంది.
సత్య: ఏంటి మాస్టారూ జుట్టు పీక్కుంటున్నారు. మీరు కత్తి అనుకున్నాను కానీ సుత్తిలా ఉన్నారు.
క్రిష్: రాత్రి వరకు ఆగు నేను కత్తినో సుత్తినో నీకే తెలుస్తుంది. పక్క రెడీ చేసుకో పూలు నువ్వు తెచ్చుకున్నా సరే నన్ను తెమ్మాన్నా సరే. గడియ నువ్వు పెట్టినా సరే నన్ను పెట్టమన్నా సరే.
సత్య: నువ్వు సమాధానం రెడీ చేసుకో నేను మిగతావి చూసుకుంటా.
మహదేవయ్య ఇంట్లో అందర్ని జయమ్మ పిలుస్తుంది. రేణుకకి సీమంతం చేయాలని చెప్తుంది. అందరూ సంతోషిస్తారు. ఈ విషయం మర్చిపోయావేంటి అని భైరవిని మహదేవయ్య తిడతాడు. రేణుక సీమంతం గ్రాండ్‌గా చేద్దామని సత్య అంటుంది. ఇంటి ముందు ఫ్లెక్సీ కూడా పెడదామా అంటాడు క్రిష్.
రేణుక: అంత హంగామా అవసరమా
సత్య: ఆ మాత్రం ఉండాలి అక్కా. పుట్టబోయేది మొదటి వారసుడు అసలైన వారసుడు హంగామా చేయకపోతే ఎలా మామయ్య గారు.
రుద్ర: నాకు ఇష్టం లేదు. సీమంతం చేయకపోతే పుట్టే బిడ్డ ఆగిపోతుందా కావాలంటే ఒక దావత్ చేయండి చాలు.
మహదేవయ్య: ఎవరికిరా నీకా. కడుపులో బిడ్డని మోయడం కనడం చిన్నమాట ఇంకో జన్మ ఇవ్వడం గౌరవం ఇవ్వాలి.
క్రిష్: అన్నా ఏంటి నీ లొల్లి నీ మనసు ఇంకా మారలేదా.
సత్య: అనవసరంగా మనం ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు క్రిష్.
క్రిష్: అంటే ఏంటి మనం పరాయి వాళ్లమా.
జయమ్మ: ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావ్
సత్య: అంటే నా ఉద్దేశం అది కాదు బామ్మ ఎలాగూ బావగారు అంటే మామయ్య గారికి ప్రత్యేక ఇష్టం.
భైరవి: అలా అని నీకు చెప్పారా.
సత్య: నేను చెప్పింది నిజమే కదా మామయ్య.
క్రిష్: అలా అంటావేంటి సత్య బాపునకు అందరూ సమానమే.
సత్య: అలాంటప్పుడు యూత్ లీడర్ పోస్ట్ నీకు ఎందుకు ఇచ్చారు పెద్ద కొడుకు ఉన్నారు కదా.
క్రిష్: అందరూ ఇక్కడే ఉన్నారు కదా నువ్వు ఏం అడగాలి అనుకుంటున్నావో అడుగు.
సత్య: అయ్యోరామా నేను ఏదో సరదాగా అన్నాను అందరూ కోపంగా ఉన్నారేంటి. పెద్ద కొడుకు వారసుడిని ఇస్తున్నప్పుడు ఆ కొడుకు మీద ఇష్టం ఉండదా ఏంటి. మామయ్య గారు సైలెంట్‌గా ఉన్నారు అంటే నా స్టేట్ మెంట్ కరెక్టే కదా. అయినా మామయ్య గారు ఓకే అన్నారు కాబట్టి ఊరంతా తెలిసేలా గ్రాండ్‌గా చేయాలి అంతే కదా మామయ్య.
మహదేవయ్య: అంతే అంతే..
శాంతమ్మ ఇచ్చిన క్లాస్‌కి నందిని చక్కగా రెడీ అయి పూజ చేయడానికి వస్తుంది. ఇంతలో మైత్రి పూజ చేసేస్తుంది. నందిని ఫీలైపోతుంది. మైత్రి చక్కగా చీరకట్టుకొని హారతి ఇస్తుంటే విశాలాక్షి మైత్రిని పొగిడేస్తుంది. విశ్వనాథం కూడా మైత్రిని పొగుడుతాడు. దాంతో నందిని చాలా రగిలిపోతుంది. ఇక మైత్రి శాంతమ్మే తనకు పూజ చేయమని చెప్పిందని పూజ చేయగానే ఇంటి మనిషిగా అనిపించిందని అంటే నందిని కోపంగా శాంతమ్మని చూస్తుంది. శాంతమ్మ నా పని అయిపోయిందని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.