Satyabhama Serial Today October 26th: సత్యభామ సీరియల్: సత్యని నెట్టేసి మరీ నర్శింహని చంపబోయిన క్రిష్.. మహదేవయ్య ఒక్క కేకతో సీన్ రివర్స్!
Satyabhama Today Episode ఎమ్మెల్యే టికెట్ కోసం మహదేవయ్యని నర్శింహ అవమానించడం క్రిష్ నర్శింహని చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode హర్ష, నందిని, మైత్రి, సంధ్యలు జీపులో హైదరాబాద్ మొత్తం సరదాగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతుంటారు. నందిని భర్తకి ఫ్రూట్స్ తినిపించడం చూసి తట్టుకోలేకపోయిన మైత్రి కావాలనే నీరు తాగుతూ నందిని మీద పడేస్తుంది. తర్వాత సారీ చెప్తుంది. మరోవైపు మహదేవయ్య వాళ్లు హైదరాబాద్ చేరుకుంటారు. క్రిష్ సత్యని ఉండమని పని చూసుకొని వస్తానని చెప్తే సత్య వస్తానని మారాం చేస్తుంది. మహదేవయ్య కూడా రానివ్వమని అంటాడు.
మహదేవయ్య: మహదేవయ్య పవర్ ఏంటో నా చిన్న కోడలికి కూడా తెలియాలిగా. టికెట్ విషయంతో తేడా వస్తే ఏం చేయాలో తెలుసుకదా.
సత్య: క్రిష్ నాకు ఇచ్చిన మాట కూడా గుర్తింది కదా.
పీఏ: సార్ మీరు కాసేపు వెయిట్ చేయండని లోపల నర్శింహ ఉన్నారు.
మహదేవయ్య: నర్శింహ వస్తే నేను వెయిట్ చేయడం ఏంటి నేను వస్తే ఆ నర్శింహ లేచి బయటకు వెళ్లిపోవాలి.
నర్శింహ మినిస్టర్‌కి డబ్బులు ఇస్తాడు. దాంతో మినిస్టర్ ఎమ్మెల్యే టికెట్ నీదే ఇక వెళ్లు అని అంటాడు. దాంతో మహదేవయ్య నర్శింహని ఆపి ఉండమని అంటాడు. నాకు ఇవ్వాల్సిన టికెట్ ఈయనకు ఇవ్వడం ఏంటి అని అంటాడు. దానికి మినిస్టర్ అధిష్టానం లెక్కలు మారాయని అంటాడు. ఇక నర్శింహనాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈయనకు కార్పొరేటర్‌ని చేయండని అంటాడు. ఇక నర్శింహ మహదేవయ్యని కించ పరచడం అక్కడున్న వారంతా నవ్వడంతో మహదేవయ్యతో పాటు క్రిష్‌కి కూడా కోపం వస్తుంది. మహదేవయ్య ప్రచారానికి వెళ్తే జనం రాళ్లు విసురుతారని అంటాడు. నీ చిన్న కొడుకు పెళ్లాం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు నీ చేయి దాటిపోయాడని నేను ఉండగా నీకు ఎమ్మెల్యే టికెట్ రాదని అంటాడు.
ఇక నా బాపునే అన్ని మాటలు అంటావా అని నర్శింహని చితక్కొడతాడు. సత్య మధ్యలో ఆపాలని ప్రయత్నిస్తే సత్యని నెట్టేస్తాడు. నర్శింహని మహదేవయ్య కాళ్ల దగ్గర పడేస్తాడు. మినిస్టర్ మహదేవయ్యతో నీ కొడుకుని ఆపు ఎమ్మెల్యే టికెట్ నీకే ఇస్తానని అంటాడు. సత్య ఎంత ఆపినా ఆగని క్రిష్ మహదేవయ్య చిన్నా అని ఒక్క మాట అనడంతో నర్శింహని పొడవబోయిన క్రిష్ ఆగిపోతాడు. మినిస్టర్ డబ్బులు నర్శింహకి ఇచ్చి పారిపోమని అంటాడు. ఇక మహదేవయ్య మినిస్టర్‌తో చెప్పుడు మాటలు వినొద్దు నేను అంతకంటే పెద్ద సూట్ కేస్ పంపిస్తా అంటాడు.
ఇక బయట నర్శింహ ఉంటే ఒక్కసారి వార్నింగ్ ఇస్తానని చెప్పి వెళ్తాడు. ఇక మహదేవయ్య చూశావా ఆ బాపు పిచ్చోడిని రెచ్చగొట్టాలన్నా ఆపలన్నా నేనే చేయాలని అంటాడు. నువ్వు ఎన్ని చేసినా నీ మొగుడు నీ మాట వినడని అంటుంది. ఓడిపోయా అని ఒప్పుకోమని అంటాడు. క్రిష్‌ని మార్చుకోవడానికి ఇంకా పెద్దగా ప్రయత్నాలు చేస్తానని అంటుంది సత్య. ఇక మహదేవయ్య సత్యని తీసుకెళ్లి హైదరాబాద్ తిప్పి తీసుకురా అని అంటాడు. నిన్ను ఒక్కడిని వదలను అని క్రిష్ అంటాడు. మామయ్య గారు ధైర్యంగా ఉంటే నీకు ఏంటి భయం నాకు హైదరాబాద్ తిరగాలి అని అంటుంది. మహదేవయ్య ఇక నేను సత్యని తీసుకెళ్లు అంటాడు. దాంతో క్రిష్ సత్యలు వెళ్లిపోతారు.
పాస్ పోర్ట్ పని పూర్తి చేసేస్తారు హర్ష వాళ్లు. ఇక టికెట్స్ హర్ష చేతికి ఇస్తారు. ఇక హైదరాబాద్ అంతా తిరుగుదామని అంటుంది సంధ్య. ఇక మైత్రిని బస్ ఎక్కిద్దామని అంటే సంధ్య నువ్వు ఉండొచ్చు కదా అంటుంది. వాళ్లిద్దరూ సరదాగా తిరుగుతారని అంటున్నారని మైత్రి అంటే వాళ్లు సరదాగా ఉంటే నేను ఒంటరిగా ఉంటాను కదా నువ్వు నాకు తోడుగా ఉండు అంటుంది. ఇక హర్ష అందరినీ తీసుకొని వాటర్ ఫాల్స్‌కి వెళ్తాడు. క్రిష్, సత్య కారులో వెళ్తుంటే సత్య చిరాకుగా ఉంటుంది. క్రిష్ చూసి ఏదో ఒకటి చేసి సత్య మూడ్ మార్చేయాలి అంటాడు. ఆడవాళ్లు మొత్తాన్ని పొగిడేస్తాడు. ఆడవాళ్లు బుంగ మూతి పెట్టినా అందంగా ఉంటారు మగాళ్లకు ఎందుకు అందం ఇవ్వలేదు. నేను బంగ మూతి పెడతా అంటాడు. దాంతో సత్య నవ్వేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌కి ఆశలు ఉంటాయ్ నువ్వు భార్యగా ఉండాల్సిందే: అనసూయ మాటలకు ఆలోచనలో దీప