అన్వేషించండి

Satyabhama Today October 14th: సత్యభామ సీరియల్: సత్యకి గన్ గురి పెట్టిన రుద్ర.. నందినిని గదిలో లాక్ చేసి హర్షతో మైత్రి రొమాన్స్! 

Satyabhama Today Episode మైత్రి నందిని గదిలో లాక్ చేసి హర్షకి తాను నందినిలా నలుగు పెట్టడం నందినికి అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode విశాలాక్షి తన భర్తకి కాఫీ ఇస్తుంది. ఇంతలో శాంతమ్మ వచ్చి పండక్కి సత్యని పిలవమని అంటుంది. మనం పిలుస్తాం కానీ వాళ్లు రారు అని విశ్వనాథం అంటే పిలవడం మన ఆనవాయితీ అని శాంతమ్మ అంటుంది. దాంతో విశ్వనాథం భార్యతో సత్యకి ఫోన్ చేయమని అక్కడి పరిస్థతి బట్టి పిలుద్దామని అంటాడు. నందిని చీర పట్టుకొని వచ్చి మైత్రికి తన చీర ఇస్తానని ఇంట్లో వాళ్లతో చెప్తుంది. ఇంతలో మైత్రి వస్తుంది.

మైత్రి: నీ చీర నాకు ఎందుకు నందిని.
నందిని: నీ చీర నా చీర ఏంటి పండగ కదా కట్టుకో. 
మైత్రి: మనసులో నాకు కావాల్సింది నువ్వు పట్టుకున్న చీర కాదు నందిని నువ్వు కట్టుకున్న భర్త. బొట్టు పెట్టి తాంబూలంలా హర్షని ఇచ్చావ్ అంటే ఇక నీ జోలికి రాను. 
నందిని: అలా చూస్తావేంటి తీసుకో. నచ్చలేదా పోనీ ఏ చీర కావాలో నువ్వు సెలక్ట్ చేసుకుందువురా. రేపో మాపో ఫారిన్ నుంచి నా కోసం తీసుకురావా ఏంటి.
మైత్రి: నీది ప్రేమ కాదు రేపోమాపో నేను ఫారిన్ వెళ్లిపోతా అనే సంతోషం. ఆ మాత్రం తెలీదా ఏంటి. నన్ను ఇంట్లో నుంచి తరిమేయాలి అని ట్రై చేస్తున్నాడు.
శాంతమ్మ: ఇప్పటి నుంచే దాన్ని టెన్షన్ పెట్టకే. మైత్రి ఫారెన్‌లో ఒంటరిగా ఉండగలవా.
నందిని: టెన్షన్ పడకు అమ్మమ్మ హర్ష రెండు టికెట్లు తీస్తున్నాడు నువ్వు కూడా వెళ్దువు. 
శాంతమ్మ: మధ్యలో నన్ను ఇరికిస్తావేంటి.
విశ్వనాథం: సరదాగా అందిలే అమ్మ అయినా నిన్ను మేం ఎక్కడికి పంపిస్తాం.
మైత్రి: అయినా ఫారిన్ వెళ్లడం అనేది చిన్న విషయం కాదు డబ్బుతో కూడుకున్నది. 
నందిని: ఇది ఎగ్గొట్టడానికి ప్లాన్ చేస్తుందే. అంతగా అవసరం అయితే నేను నా పుట్టింటి నుంచి తెస్తాలే నువ్వు టెన్షన్ పడకు.
శాంతమ్మ: అవును కానీ పండగ హర్షకి తలంటాలి గుర్తుందా.
నందిని: గుర్తుండటం కాదు అన్నీ రెడీ చేసుకొనే వచ్చా. అవతల నా పెనిమిటి ఎదురు చూస్తూ ఉంటాడు తీసుకో మైత్రి.
మైత్రి: ఎవరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో చూస్తా. 

జయమ్మ దగ్గరకు సత్య వచ్చి మందులు వేసుకోమని అంటుంది. దానికి జయమ్మ నా కాళ్లు చేతులు బాగున్నాయి  కదా నేను నా పని చేసుకుంటానే నువ్వు మీ అత్త పనులు చూసుకో అంటే దానికి సత్య ఆవిడకు కాళ్లు చేతులు బాగున్నాయి కదా అని అయ్యయ్యో ఎదో ఫ్లోలో అనేశాను అమ్మమ్మ అంటుంది. దానికి జయమ్మ నువ్వు కావాలనే అన్నావని నాకు తెలుసని అంటుంది. మనద్దరం ఒకలాంటి వాళ్లం మనం అత్తాకోడళ్లు అయితే బాగున్నని జయమ్మ అంటే ఇదేదో బాగుందని సత్య అంటుంది. ఇద్దరూ నవ్వుకుంటారు. ఇంతలో బయట గన్ పేలిన శబ్ధం రావడంతో ఇద్దరూ ఉలిక్కి పడతారు. 

రుద్ర: ట్రిగర్ నొక్కి నట్లు రేణుక పీక నొక్కాలి అని ఉంది కానీ బాపు నన్న బతకనీయడే. మీ అక్కని షూట్ చేశానేమో అని భయపడ్డావా. మా మొగుడు పెళ్లాల మధ్య రావొద్దని చెప్పా పోలీసుల్ని పిలిచావ్ ఏమైంది నీ గురి తప్పింది నా పవర్ గెలిచింది. ఎప్పుడైనా సరే నన్ను ఎవరూ ఆపలేరు. మీ అక్క కడుపులో బిడ్డని కాపాడుతా అన్నావ్ ఏం చేయగలిగావ్. అని సత్యని గురి పెడతాడు. 
సత్య: చేసింది పాపం అదేదో పెద్ద గొప్ప అన్నట్లు మాట్లాడుతున్నారు. సిగ్గు పడండి బావగారు. చంపుకుంది మీ వారసుడిని చంపాలనుకుంటుంది మీ భార్యని అర్థమవుతుందా. చేసిన ఖర్మ తలకు చుట్టుకుంటుంది. అప్పుడు తెలుస్తుంది మీకు.

మరోవైపు నందిని హర్షని నలుగు పెట్టడానికి రమ్మని పిలుస్తుంది. ఇంతలో హర్ష వస్తాడు. నందినితో రొమాంటిక్‌గా మాట్లాడుతాడు. ఇక నందిని హర్షకి నలుగు పెడతానని రమ్మని పిలుస్తుంది. దాంతో హర్ష కూర్చొంటాడు. ఇదంతా మైత్రి చాటుగా చూసి నందిని హర్షకి నలుగు పెట్టకూడదని నందినికి కాల్ చేస్తుంది. నందిని గదిలోకి వెళ్లగానే తలుపు గడియ పెట్టేసి తాను హర్ష దగ్గరకు వస్తుంది. వెనకాలే రావడంతో హర్ష మైత్రిని చూడడు. నందినినే అనుకుంటాడు. మైత్రి హర్ష తలకు ఆయిల్ పెడుతుంది. ఇక నందిని డోర్ కొడితే సంధ్య వచ్చి డోర్ తీస్తుంది. ఎవరో కావాలనే డోర్ వేసేశారని చెప్తుంది. ఇక హర్ష దగ్గరకు వచ్చి అప్పుడే ఆయిల్ రాసుకున్నావేంటి నేను వస్తా అని చెప్పా కదా అంటుంది. దానికి హర్ష ఇప్పటి వరకు తానే పెట్టి ఇలా అంటుంది అనుకుంటాడు. దానికి ఎవరో దేవత రాసిందిలే అంటాడు. నందిని అనుమానంగా  మొత్తం చూస్తుంది.

మరోవైపు జయమ్మ అందరి కోసం తలంటదానికి పిలుస్తుంది. మహదేవయ్య రాను అంటే జయమ్మ సతాయించి పిలుస్తుంది. ఇక మహదేవయ్య, రుద్రలు వస్తారు. క్రిష్‌ మాత్రం వద్దని నా వల్ల అవేమీ కావని తనని వదిలేయమని అంటాడు. సత్య నలుగు పేరుతో కితకితలు పెడుతుందని గతంలో తనకు సత్య దురద గుంటాకు రాయడం గుర్తు చేస్తాడు. లోకంలో ఎవరినైనా నమ్ముతా కానీ నాపెళ్లాన్ని నమ్మను అని క్రిష్ అంటాడు. దానికి సత్య అయితే నేను కూడా నా మొగుడికి నలుగు పెట్టను వేరే ఎవరి మొగుడికైనా పెడతాను అంటే అందరూ నోరెళ్ల బెడతారు. ఇక జయమ్మ రౌడీలకు చెప్పి క్రిష్‌ని పట్టుకొని రమ్మని చెప్తుంది. దాంతో వాళ్లు క్రిష్‌ని తెచ్చి కూర్చొపెడతారు. ఇక భైరవి ఇన్నాళ్లకు నా పెనిమిటి జుట్టు నా చేతికి దొరికిందని అంటుంది. దాంతో మహదేవయ్య ఏయ్ ఉన్నవే నాలుగు వెంట్రుకలు కాస్త చూసుకో అంటాడు. ముగ్గురు ఆడవాళ్లు తమ భర్తలకు ఆయిల్ రాస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: Nara Rohit : నారా కుటుంబంలో పెళ్లి సందడి - హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన కేటీఆర్‌కు చేదు అనుభవం
KTR News: ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన కేటీఆర్‌కు చేదు అనుభవం
TSPSC Group 1 Admit Cards 2024 : తెలంగాణ గ్రూప్‌ వన్‌ హాల్ టికెట్లు వచ్చేశాయ్‌- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్‌ వన్‌ హాల్ టికెట్లు వచ్చేశాయ్‌- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Hyderabad News: సికింద్రాబాద్‌లో మరో దేవతా విగ్రహం ధ్వంసం- ఒక వ్యక్తి అరెస్టు- ఆలయాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్‌లో మరో దేవతా విగ్రహం ధ్వంసం- ఒక వ్యక్తి అరెస్టు- ఆలయాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Bigg Boss: ‘పెటా ఇండియా‘ ఆగ్రహం, హిందీ బిగ్ బాస్ నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్
‘పెటా ఇండియా‘ ఆగ్రహం, హిందీ బిగ్ బాస్ నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

80 వేల ఏళ్లకి ఒకసారి కనిపించే తోకచుక్క, తిరుపతిలో అద్భుత దృశ్యంBaba Siddique: సల్మాన్‌ ఖాన్‌కు ఫ్రెండ్ అయితే చంపేస్తారా?Baba Siddique: కత్రినా కోసం సల్మాన్-షారూఖ్ వార్! ఐదేళ్ల గడవకు ఫుల్‌స్టాప్ ఈయన వల్లేInd vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samson

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన కేటీఆర్‌కు చేదు అనుభవం
KTR News: ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన కేటీఆర్‌కు చేదు అనుభవం
TSPSC Group 1 Admit Cards 2024 : తెలంగాణ గ్రూప్‌ వన్‌ హాల్ టికెట్లు వచ్చేశాయ్‌- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్‌ వన్‌ హాల్ టికెట్లు వచ్చేశాయ్‌- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Hyderabad News: సికింద్రాబాద్‌లో మరో దేవతా విగ్రహం ధ్వంసం- ఒక వ్యక్తి అరెస్టు- ఆలయాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్‌లో మరో దేవతా విగ్రహం ధ్వంసం- ఒక వ్యక్తి అరెస్టు- ఆలయాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Bigg Boss: ‘పెటా ఇండియా‘ ఆగ్రహం, హిందీ బిగ్ బాస్ నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్
‘పెటా ఇండియా‘ ఆగ్రహం, హిందీ బిగ్ బాస్ నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్
Bishnoi is another Dawood : మరో దావూద్‌లా మారేందుకు లారెన్స్ బిష్ణోయ్ ప్రయత్నాలు - 700 మంది షూటర్లను రెడీ చేసుకున్నారా ?
మరో దావూద్‌లా మారేందుకు లారెన్స్ బిష్ణోయ్ ప్రయత్నాలు - 700 మంది షూటర్లను రెడీ చేసుకున్నారా ?
Andhra Pradesh: పల్లెపండగ వారోత్సవాలు ప్రారంభం, పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్ కల్యాణ్
పల్లెపండగ వారోత్సవాలు ప్రారంభం, పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్ కల్యాణ్
Weather Today: ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత
ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత
Arthamainda ArunKumar Season 2 : 'అర్థమైందా అరుణ్‌ కుమార్‌' రెండో సీజన్ వచ్చేస్తోంది, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
'అర్థమైందా అరుణ్‌ కుమార్‌' రెండో సీజన్ వచ్చేస్తోంది, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
Embed widget