Satyabhama Serial Today October 12th: సత్యభామ సీరియల్: అతి చనువుగా మైత్రి, హర్ష చూసేసిన నందిని.. రేణుకని చంపేస్తానన్న రుద్ర!
Satyabhama Today Episode రేణుకకి నిజం తెలిసిపోయిందని రుద్ర మహదేవయ్యకి చెప్పి రేణుకని చంపేస్తానని చెప్పడం మహదేవయ్య కొడుకుని తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode నందిని, హర్షలు మైత్రి గురించి మాట్లాడుకుంటారు. మైత్రి మీద ప్రేమతో మైత్రిని ఫారిన్ పంపాలని అనుకున్నావా లేక నా మీద ప్రేమతో పంపావా అని అడుగుతుంది. దానికి హర్ష నీ లాయర్ బుర్రకు ఓ దండం అని అంటాడు. ఇక ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. భార్యని దగ్గర అవ్వాలి అంటే సింపుల్ ఐడియా ఉందని నందిని అంటుంది. ఏంటి అని హర్ష అడిగితే లైట్ ఆపడం అంటుంది. హర్ష నవ్వుతూ లైట్ ఆపడానికి వెళ్తుంటే ఇంతలో మైత్రి పెద్దగా అరుస్తుంది.
హర్ష బయటకు వెళ్తే మైత్రి పడిపోయానని కాలు బెనికిందని అంటుంది. దాంతో హర్ష నందినిని పట్టుకొని తీసుకొని వస్తాడు. అదంతా నందిని చూస్తుంది. మైత్రి మనసులో ఇది కదా నాకు కావాల్సింది అనుకుంటుంది. ఇక మైత్రి నందిని చూస్తుంది వెళ్లు హర్ష ఏమైనా ప్రాబ్లమ్ అవుతుంది అంటే ఏం కాదులే అని హర్ష అంటాడు. నందిని కోపంతో వెళ్లిపోతుంది. మరోవైపు జరిగింది తలచుకొని మహదేవయ్య ఫుల్లుగా తాగుతుంటాడు. ఇంతలో రుద్ర అక్కడికి వస్తాడు.
మహదేవయ్య: నా మనసు కుతకుత ఉడుకుతుంది. ఈ సారి దెబ్బలతో విడిచిపెట్టను. చంపేస్తా నిన్ను పో. ఇంటికి చిన్న వారసుడు వస్తున్నాడు ఊరంతా పండగ చేయాలి. వాడిని పల్లకిలో ఊరేగించాలి అనుకుంటే నా ఆశలన్నీ అడియాశలు చేశావ్ పోరా.
రుద్ర: బాపు నేను ఆ పని చేయకపోయి ఉంటే ఇంటి మొత్తానికి నిప్పు అంటుకునేది. సోయ లేకుండా పోయే వాళ్లం.
మహదేవయ్య: ఏంద్రా నువ్వు అనేది.
రుద్ర: ఆ చిన్నా గాడు మనకు సమాధి కట్టేవాడు. నేను నర్శింహతో ఫోన్లో మాట్లాడుతుంటే రేణుక వింది. చిన్నాకి చెప్తా అని బెదిరించింది. దాన్ని చంపితే కానీ మనం బతకలేని పరిస్థితి. స్పాట్‌లో నిర్ణయం తీసుకున్నా చంపేద్దాం అనుకున్నా.
మహదేవయ్య: మరి బతికింది కదరా ఇప్పుడు ఆ చిన్నా గాడికి చెప్పింది అంతే ఇన్నాళ్లు నేను దాచిన నిజం బయటకు వచ్చేస్తుంది.
రుద్ర: నువ్వు నోరు లేపితే ఇప్పుడు బిడ్డ మాత్రమే చచ్చింది రేపు నువ్వు చస్తావ్ అన్నా.
మహదేవయ్య: అసలు నీ నోరు కుట్టేయాలిరా. ఇప్పుడు పొరపాటున నువ్వు దాన్ని చంపితే అందరూ నిన్నే అంటారురా. ఇప్పటి కైనా దానితో ప్రేమగా ఉండురా.
రుద్ర: నా వల్ల కాదు బాపు దానితో విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేయ్ ఏడాదికి ఒక్క వారసుడిని నీ చేతిలో పెడతా.
మహదేవయ్య: బుద్ధి తక్కువ వెధవ అది ఓ మూలన ఉంది కదరా ఇప్పటికైనా బుద్ధిగా ఉండు
రుద్ర: ఏదో ఒక రోజు దాని చావు నా చేతిలోనే బాపు.
రేణుక జరిగింది తలచుకొని ఏడుస్తుంటుంది. భైరవి రేణుక వచ్చి భర్త పరువు తీశావని ఇలా అందరిలో వాడిని దోషిలా నిలబెట్టావని అంటుంది. దానికి రేణుక మీ కొడుకు తప్పు చేయలేదు అనుకుంటారా అని అంటుంది. నాకు జరిగిన నష్టం చిన్నది కాదు అని అంటుంది. భైరవి మొత్తం రేణుకదే తప్పు అని అంటుంది. ఇంతలో సత్య అక్కడికి వస్తుంది. మీరు నిలదీయాల్సింది అక్కని కాదు బావగారిని అని అంటుంది. నీ వల్లే రేణుక రెచ్చిపోతుందని భైరవి అంటుంది. ఇక సత్య రేణుకకి పాలు తాగమని అంటే రేణుక నాకు బతకాలి అని లేదు అని ఏడుస్తుంది. జీవితంలో పిల్లల్ని కనే అదృష్టం లేకపోవడం వల్ల కుమిలిపోతుందని అత్తగా మర్చిపోయి తోటి ఆడదానిలా ఆలోచించమని అంటుంది. ఓదార్పుగా రేణుక తల నిమరాలి దగ్గరకు తీసుకోవాలి అనిపించడం లేదా అని సత్య అడుగుతుంది. దానికి రేణుక అత్తకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి కనీసం నా ఏడుపు నాకు ఎడ్వనివ్వండి అత్తయ్య అని అంటుంది. క్రిష్ రేణుక ఏడుపు చూసి బాధ పడతాడు. క్రిష్‌కి భైరవి కంప్లైంట్ ఇస్తుంది. దానికి క్రిష్ మొత్తం విన్నాను తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అని తన బిడ్డని అన్న చంపుకున్నాడని వదినా స్థానంలో ఇంకెవరూ ఉన్న అన్న పని అయిపోయేదని అంటాడు. సత్య రేణుకకు పాలు తాగిస్తుంది.
మరోవైపు హర్ష మైత్రి కాలికి బామ్ రాస్తాడు. మైత్రి మనసులో నువ్వు నందినితో ఉంటే జలషీగా ఉందని అందుకే ఇలా నాటకం ఆడానని అనుకుంటుంది. ఇంతలో హర్షకి నందిని కాల్ చేస్తుంది. దాంతో హర్ష వెళ్లిపోతాడు. మైత్రి కోపంతో రగిలిపోతుంది. మరోవైపు జయమ్మ కాశీ వెళ్తానని ఏర్పాటు చేయమని మహదేవయ్యకి చెప్తుంది. క్రిష్ బామ్మతో ఇంట్లో పరిస్థితులు బాలేనప్పుడు అందరూ నీ వైపు చూస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావని అడుగుతాడు. సత్య కూడా బామ్మని వెళ్లొద్దని అంటుంది. జయమ్మ రేణుకని పట్టుకొని ఏడుస్తూ ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఇంటికి అరిష్టం ఉందని శాంతి పూజ చేయించాలని అంటుంది. దాంతో మహదేవయ్య సత్యకు అన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.