అన్వేషించండి

Ammayi garu Serial Today October 10th: అమ్మాయి గారు సీరియల్: సూర్యప్రతాప్‌ని ఓడించడానికి చేతులు కలిపిన శత్రువులు.. రూప చేతిలో నామినేషన్ పేపర్లు!

Ammayi garu Today Episode సూర్య ప్రతాప్ నామినేషన్ పేపర్లు విజయాంబిక రూప చేతికి ఇప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాత్రి పూట రాజు, రూప కారులో మాట్లాడుకుంటూ ఉంటారు. కారులో లైటింగ్ చూసిన సూర్యప్రతాప్ కారు దగ్గరకు వస్తారు. రాఘవ దొరికితే పెద్దయ్య గారికి నిజం తెలుస్తుందని అప్పుడే తనని అల్లుడిగా ఒప్పుకుంటారని, అమ్మగారిని కూడా భార్యగా స్వీకరిస్తారని రాజు అంటాడు. ఇక సూర్య ప్రతాప్ వచ్చి కార్ డోర్ తీయగానే రాజు, రూపలు వెనకాలే దాక్కుంటారు. ఇక సూర్య ప్రతాప్ లోపలికి వెళ్లిపోతాడు. రూప కూడా రాజుని వెళ్లిపోమని అంటుంది. 

ఇక విజయాంబిక, దీపక్‌లు జీవన్, శ్వేతల్ని బయటకు తీసుకొస్తారు. గౌతమ్, రేణుకలు కూడా అక్కడే ఉంటారు. మిమల్ని బయటకు తీసుకురావడం వెనక మా స్వార్థం ఉందని విజయాంబిక అంటుంది. మేం అనుకున్నది సాధించాలి అంటే మా మేలు కోరుకొనే నువ్వు సీఎం అవ్వాలని దీపక్‌ని ఎమ్మెల్సీ చేయాలని విజయాంబిక అంటుంది. 

జీవన్: సూర్యప్రతాప్‌ని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నా అందుకు ఎన్ని కుట్రలైనా చేస్తా.
శ్వేత: ఎలక్షన్‌లో గెలవడానికి డబ్బు పంచితే చాలు అన్నయ్య ఆడవాళ్ల ముఖాన ఒక చీర, మగాలకు మందు ప్యాకెట్, బిర్యాని విసిరేస్తే వాళ్లే గెలిపిస్తారు.
గౌతమ్: డబ్బు గురించి మీరేం దిగులు పడకండి నేను ఇస్తాను. రూపని నాకు ఇచ్చి మాట ఇచ్చి ఆఖరికి రాజు, రూపల్ని పెళ్లి చేసి నన్ను పిచ్చి వాడిని చేశారు. ఇప్పటికి నా నుంచి రూప పోవడం లేదు. దాని మీద ప్రేమతో దాన్ని ఏం చేయలేను కనీసం సూర్యప్రతాప్‌ని అయినా ఇబ్బంది పెట్టి నా పగ తీర్చుకుంటా.
రేణుక: చిన్నప్పటి నుంచి రాజే నా భర్త అనుకున్నా మధ్యలో రూప వచ్చి నా ఆశలు మీద నీళ్లు జల్లేసింది. నా ఇళ్లు తాకట్టు పెట్టి అయినా నీకు సాయం చేస్తా.
జీవన్: నిజంగా మీమల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను ముందుకు తీసుకెళ్లడానికి మీరు ఇంతలా సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. మీ రుణం వుంచుకోను నేను సీఎం అవ్వగానే రేణుక నిన్ను కార్పొరేటర్‌ని చేస్తా. గౌతమ్ నిన్ను మినిస్టర్‌ని చేస్తా. విజయాంబిక గారు మీరు కోరుకున్నట్లే చేస్తా.
శ్వేత: అన్నయ్య రేపే నామినేషన్‌కి లాస్ట్ రోజు ప్రజలకు మనం పోటీలో ఉన్నామని చెప్దాం.
 

సూర్యప్రతాప్‌ నామినేషన్ వేయకుండా ఆపాలి అని జీవన్ అంటాడు. అందుకు ఏం చేయాలో మేం చేస్తాం అని అందరూ జీవన్‌కు సపోర్టు చేస్తారు. మరోవైపు మందారం హారతిని కలుస్తుంది. ఇద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటారు. నా బేబీ భవిష్యత్ బాలేదని పెళ్లి కాకుండానే తల్లినైన నా పరిస్థితి మొత్తం నీకు తెలుసు కదా అని అంటుంది. హారితి కథ వింటే నా కథ కనిపిస్తుందని మందారం ఫీలవుతుంది. తన భర్త చాలా మారిపోయాడని హారతి మందారంతో చెప్తుంది. హారతి లైఫ్‌లో జరిగిన వన్నీ నా లైఫ్‌లో జరిగుతున్నాయని అంటాడు. ఇక హారతి ఫోన్ విషయం చెప్తుంది. వేరే అమ్మాయితో మాట్లాడిస్తున్నాడని అంటుంది. దాంతో మందారం దీపక్‌ ఫోన్‌లో హారతితో మాట్లాడిన విషయం గుర్తు చేసుకుంటుంది. ఇక హారతిని బాయ్ ఫ్రెండ్ గురించి మందారం అడిగితే వాళ్లది పొలిటికల్ బ్యాగ్రౌండ్ అని చెప్తుంది. హారతికి మందారం ధైర్యం చెప్తుంది. ఇక మందారం సూర్యప్రతాప్‌తో కలిసి విషయం చెప్తే నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని రమ్మని హారతికి చెప్తుంది. దాంతో హారతి ఇప్పుడు వద్దని అంటుంది. 

మరోవైపు చంద్ర నామినేషన్ల పేపర్లు తీసుకొని ఇంటికి వస్తాడు. సూర్యప్రతాప్‌ వాటిని చూసి మురిసి పోతాడు. విజయాంబికను పిలిచి నీ చేతుల మీదే ఏం చేసినా నాకు కలిసి వస్తుందని నువ్వే ఈ నామినేషన్లు పేపర్లు రేపు నాకు ఇవ్వమని అంటాడు. దానికి విజయాంబిక ఈసారి రూపతో ఇప్పించమని అంటుంది. దాంతో సూర్యప్రతాప్‌ రూపని పిలిచి వాటిని ఇస్తాడు. ఇక సూర్యప్రతాప్‌ రూప నీకు విలువ ఇవ్వకపోయినా నువ్వు రూపకి ఇస్తావని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: సుమిత్ర ఇంట్లో కాంచన, కార్తీక్.. దీపకు జ్యోత్స్న, పారులు కూడా థ్యాంక్స్ చెప్పారే.. జ్యో పెళ్లి ఫిక్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget