అన్వేషించండి

Karthika Deepam 2 Serial October 10th: కార్తీకదీపం 2 సీరియల్: సుమిత్ర ఇంట్లో కాంచన, కార్తీక్.. దీపకు జ్యోత్స్న, పారులు కూడా థ్యాంక్స్ చెప్పారే.. జ్యో పెళ్లి ఫిక్స్!

Karthika Deepam 2 Serial Episode దీప కాంచన, కార్తీక్‌లను సుమిత్ర ఇంటికి తీసుకురావడం అందరూ సంతోషించడం మరోవైపు జ్యోత్స్నకు వేరే పెళ్లిని తండ్రి తాత ఫిక్స్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప సుమిత్రను తన ఇంట్లో పూజకు పిలిస్తే సుమిత్ర తన ఇంట్లోనే పూజ చేయమని అంటుంది. ఆ మాటలు విన్న జ్యోత్స్న మా అమ్మ నా గురించి పట్టించుకోకుండా దీప పూజ చేయమని అంటుంది. దీప ఏదో తన సొంత కూతురిలా నేను పరాయి దానిలా నన్ను పట్టించుకోవడం లేదని కోపంతో నానమ్మ మీద విరుచుకుపడుతుంది. పూజ వెనక ఇంకేదో కారణం ఉందని అది మనం కనిపెట్టాలని జ్యోత్స్న అంటుంది. 

దీప  ఇంట్లో దీపం పెట్టుకుంటుంది. అనసూయ పాపని పడుకోబెడుతుంది. తర్వాత దీప అనసూయ దగ్గరకు వస్తుంది. అనసూయ దీపతో నువ్వు చేయాలనుకున్న పని మంచిదే కానీ ఇక్కడే ఆపేయ్ అంటుంది. కార్తీక్ బాబు కాబట్టి వాళ్ల తాత తిడితే పడ్డాడు కానీ వాళ్ల అమ్మ తట్టుకోలేదని అంటుంది. దానికి దీప సుమిత్రమ్మ బాధ చూడలేక ఇలా చేస్తున్నా అని అంటుంది. ఈ రెండు కుటుంబాలను కలపాల్సిన బాధ్యత తనదే అని తన వల్లే జ్యోత్స్న పెళ్లి ఆగిపోయింది కాబట్టి వీళ్లని కలిపి కార్తీక్ పెళ్లి చేసి వెళ్లిపోదామని అంటుంది. ఇక నర్శింహ పోలీసులకు దొరకలేదు కాబట్టి మనం ఇక్కడ ఉండటం అంత మంచిది  కాదు కాబట్టి త్వరగా వెళ్లిపోదాం అంటుంది. ఇక నర్శింహ చాటుగా దీప ఇంటికి వచ్చుంటాడు. దీపని చంపి తన తల్లిని ఊరు పంపిస్తా అనుకుంటాడు. 

దీప సుమిత్ర ఇంట్లో పూజకు అన్నీ సిద్ధం చేస్తుంది. శివనారాయణ, దశరథ్ కనిపించరు. అడగడానికి దీప సుమిత్ర దగ్గరకు వెళ్లుంది. సమిత్ర పాపని రెడీ చేస్తుంటుంది. దానికి సుమిత్ర బయటకు  వెళ్లారని పూజకు రారు అని చెప్తుంది. దీప ఊపిరి పీల్చుకుంటుంది. వాళ్లు రాకుండా పూజ చేసేయొచ్చు అనుకొని కార్తీక్, కాంచనల్ని ఇంటికి రప్పించడానికి ఒప్పించాలి అనుకుంటుంది. ఇక సమిత్ర పాపకి బంగారు నగలు పెడుతుంది. దీప వద్దని మా స్థాయి అది కాదని అంటుంది. జ్యోత్స్న, పారిజాతం కూడా అక్కడికి వస్తారు. ఇంతలో కార్తీక్ వాళ్లు రావడంతో అనసూయ దీపని పిలుస్తుంది. దీప వాళ్ల దగ్గరకు వెళ్తుంది. పూజ మీ పుట్టింట్లో అని దీప కాంచన వాళ్లతో చెప్తుంది. 

కాంచన: అబద్ధం చెప్పి మమల్ని రప్పించావ్ కదూ.
దీప: క్షమించండి అమ్మ పూజ మా ఇంటి దగ్గరే అనుకుంటే సుమిత్రమ్మ అక్కడికి మార్చారు.
కార్తీక్: ఆ విషయం మాకు ఫోన్ చేసి చెప్పి ఉంటే ఇంటి దగ్గరే ఆగిపోయే వాళ్లం కదా. ఈ ఇంటి వాళ్లకి నువ్వు సొంత మనిషివేమో కానీ మేం ఇప్పుడు పరాయి వాళ్లం.
దీప: కాదు బాబు దూరంగా ఉన్నంత మాత్రాన మీరు దూరం కాదు దగ్గర ఉన్న నేను సొంతం కాదు. ఎప్పటికైనా మీరు సొంతమైన వాళ్లు ఈ పరాయి దాని కోసం ఇంత దూరం వచ్చారు ఆ గుమ్మంలోకి రాలేరా. మీ తాతయ్య వాళ్లు కూడా లేరు. మీరు వస్తున్న మాట ఎవరికీ తెలీదు.
కాంచన: మా నాన్న అన్నయ్య ఇంట్లో లేకపోయినా నేను  ఆ ఇంటికి రాలేను. పద కార్తీక్.
దీప: అలా అనొద్దమ్మా అక్కడ పూజ చేసేది నేను నా కోసం రండి. అక్కడ మిమల్ని ఆపేవాళ్లు లేరు. 
కాంచన: ఆ ఇంటికి రావాలి అంటే మనసు ఒప్పుకోవడం లేదు దీప
దీప: నా కోసం నా మనుషులుగా రండి అమ్మా. 
కాంచన: నువ్వేంమంటావ్ రా.
కార్తీక్: నీ ఇష్టం అమ్మ కానీ అక్కడ నిన్ను ఎవరు ఏమన్నా నేను ఊరుకోను.

ఇంతలో శౌర్య వస్తుంది. కాంచన రెండు చేతులు జోడించి శౌర్య నిజంగానే బాలాత్రిపుర సుందరిలానే ఉందని అంటుంది. దీప కార్తీక్‌తో అమ్మవారే పిలుస్తున్నారు రండి అని అంటుంది. ఇక కార్తీక్ వాళ్లు వచ్చిన విషయం చెప్పడానికి సుమిత్ర దగ్గరకు దీప వెళ్తుంది. అందరూ హాల్‌లో ఉంటారు. సుమిత్రతో దీప పూజకు నాకు తెలిసిన వాళ్లని పిలిచాను పర్లేదా అంటుంది. దానికి పారిజాతం సెటైర్లు వేస్తుంది. శౌర్య సుమిత్రతో అమ్మమ్మా ఎవరు వచ్చారో చూడు అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. జ్యోత్స్న, పారిజాతం, సుమిత్ర చాలా సంతోషిస్తారు. 

సుమిత్ర కాంచనను పట్టుకొని ఏడుస్తుంది. మన కుటుంబానికి ఎంత కష్టం వచ్చిందని ఏడుస్తారు. కొద్ది రోజులు ఓపిక పట్టు వదినా మళ్లీ మనం అంతా కలుస్తాం అని సుమిత్ర చెప్తుంది. ఇక కాంచన గోడ మీద ఫ్యామిలీ ఫొటో లేకపోవడం చూసి ఏమైందని అడుగుతుంది. నాన్న తీసి విసిరేశాడా అని అడుగుతుంది. మా ఫొటోలకే ఇంట్లో చోటు లేకపోతే ఇంట్లో ఏం చోటు ఉంటుందని అంటుంది. మేం ఇప్పుడు దీప మనుషుల్లా వచ్చాం అని కాంచన అంటే దానికి జ్యోత్స్న దీప కోసం వస్తే దీప మనుషులు అయిపోతారా అత్త నువ్వు ఎప్పటికీ ఇంటి ఇంటి ఆడబిడ్డవే అని అంటుంది. ఇక దీపతో మేం చేయలేని పని నువ్వు చేశావ్ థ్యాంక్స్ దీప అని చెప్తుంది. పారిజాతం కూడా దీపను పొగుడుగుతుంది. సుమిత్ర కూడా దీపకు థ్యాంక్స్ చెప్తుంది. ఇక శివనారాయణ, దశరథ్‌ పెళ్లి సంబంధం మాట్లాడుకొని ఇంటికి వస్తుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: సహస్ర, విహారి నిశ్చితార్థం జరుగుతుందా? కనకాన్ని విహారి చూస్తాడా? ఏర్పాట్లు మాత్రం అదుర్స్!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
Godavari Serial Today July 13th: 'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!
'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!
Nindu Manasulu Serial Today July 13th: నిండు మనసులు: గణ జీవితంలో మర్చిపోలేని రోజు ఇదే..! పక్కా సాక్ష్యాలతో నిజం నిరూపించేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ జీవితంలో మర్చిపోలేని రోజు ఇదే..! పక్కా సాక్ష్యాలతో నిజం నిరూపించేసిన ప్రేరణ, సిద్ధూ!
Podarillu Serial Today July 13th:కేశవ్‌కు బ్రేకప్‌ చెప్పేసిన శైలూ...విడాకులు కోసం చక్రికి ఫోన్ చేసిన లాయర్‌
పొదరిల్లు: కేశవ్‌కు బ్రేకప్‌ చెప్పేసిన శైలూ...విడాకులు కోసం చక్రికి ఫోన్ చేసిన లాయర్‌

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Embed widget