అన్వేషించండి

Satyabhama Serial Today November 19th: సత్యభామ సీరియల్: క్రిష్ మీ కన్న కొడుకు అని నాకు తెలుసు చిన్న మామయ్య: చక్రవర్తిని నిలదీసిన సత్య

Satyabhama Today Episode క్రిష్ మీ కన్న కొడుకు అని నాకు తెలుసని సత్య చక్రవర్తిని ప్రశ్నించడం చక్రవర్తి కాదు అని బుకాయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode నందిని హర్షని గది నుంచి బయటకు తోసేస్తుంది. ఎవరూ చూడలేదు కదా అని హర్ష తల పట్టుకుంటే శాంతమ్మ పెద్దగా నువ్వుతూ నేను చూసేశానురా అంటుంది. అబ్బా అనుకుంటూ హర్ష వెళ్లి నానమ్మ పక్కన కూర్చొంటాడు. ఇక మరోవైపు చక్రవర్తి దిగులుగా కూర్చొని ఉంటే అక్కడికి సంజయ్ వస్తాడు. 

సంజయ్: డాడ్ సరదాగా బిజినెస్ చేయాలి అనుకుంటున్నా రెండు కోట్లు ఇవ్వండి.
చక్రవర్తి: కెరీర్ అంటే ఎవరూ సరదాగా తీసుకోరు అయినా నువ్వు నా బిజినెస్ చూసుకో కొత్తగా ఏం వద్దు.
సంజయ్: ఇది నా లైఫ్ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు రేపటికి రెండు కోట్లు ఏర్పాటు చేయండి అంతే. 
సత్య: కొంత మందిని మనం ఎంత సొంత మనుషులు అనుకున్నా మన మనసు ఒప్పుకోదు. కొంత మందిని ఎంత దూరం పెట్టాలి అనుకున్నా ప్రాణం ఒప్పుకోదు. సంజయ్‌తో మాట్లాడటం మీకు ఇష్టం లేదా చిన్నమామయ్య.
చక్రవర్తి: ఎందుకు అలా అడిగావమ్మా.
సత్య: సంజయ్ డబ్బులు అడిగితే ఇవ్వను అన్నారు. మాట్లాడుతా అంటే పంపేశారు. సూటిగా అడుగుతున్నాను కన్న కొడుకు రెండు కోట్లు అడిగితే ఇవ్వలేదు. అన్న కొడుకు 5 కోట్లు అడిగితే ఇచ్చారు. 
చక్రవర్తి: ఇవ్వకూడదా. అయినా నేను డబ్బు ఇచ్చింది అన్నయ్యకి. ఏమీ లేని చోట నువ్వు ఏదో ఉన్నట్లు అన్నట్లు అడుగుతున్నావ్.
సత్య: చిన్న మామయ్య క్రిష్‌ని మీరు ఎక్కువగా అభిమానించడానికి కారణం ఏంటి. రహస్యం దాస్తున్నారు కదా. మామయ్య మీరు రహస్యం దాస్తున్నారు. మీకు కోపం వచ్చినా తప్పో ఒప్పో కూడా నాకు తెలీదు కానీ ఇది నా అవసరం. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నిజం చెప్పాల్సిందే.
చక్రవర్తి: నువ్వేం నిజం గురించి మాట్లాడుతున్నావ్.
సత్య: సంజయ్ పుట్టినప్పుడు జరిగిన బిడ్డల మార్పిడి గురించి. సత్య అలా అడగగానే చక్రవర్తి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. సత్య వెంటపడి మామయ్య నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మామయ్య. మీరు నిజం దాచడం వల్ల నష్టపోయింది ఎవరో కాదు మీ కన్న కొడుకు.
చక్రవర్తి: నా కన్న కొడుకు సంజయ్ నీ మనసులో ఏమైనా ఆలోచనలు ఉంటే పక్కన పెట్టేయ్.
సత్య: మీ కన్న కొడుకుని లాక్కొని తన కొడుకుని మీ చేతిలో పెట్టారు మీ అన్నయ్య. ఆయన స్వార్థంతో అలా చేస్తే మీరు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. ఈ రోజు మీరు తప్పుకున్నా ఏదో ఒక రోజు క్రిష్‌కి నిజం తెలుస్తుంది. ఇంట్లో ఎన్ని జరిగినా పట్టించుకొని మీరు క్రిష్‌కి బులెట్ తగలగానే వచ్చేశారు. అంతెందుకు ఈ రోజు కూడా మీరు సంజయ్‌ని పక్కన పెట్టి మరీ క్రిష్‌ కోసం టెన్షన్ పడ్డారు. 
చక్రవర్తి: నువ్వు ఏదో అనుకుంటున్నావ్ సత్య నన్నువదిలేయ్ సత్య అందర్ని ఇబ్బంది పెట్టకు. 
సత్య: ఒకసారి క్రిష్‌ని పిలుస్తా సూటిగా క్రిష్‌ కళ్లల్లోకి చూసి నిజం చెప్పండి అప్పుడు నమ్ముతా. మామయ్య క్రిష్‌ని కాపాడుకోవాలి అనుకుంటున్నా సపోర్ట్ చేయండి మామయ్య. ప్లీజ్. క్రిష్కి ప్రమాదం అన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఏం సమాధానం చెప్పకుండా చక్రవర్తి వెళ్లిపోతాడు.

మరోవైపు నందిని నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతుంది. బయటకు వచ్చి చూస్తే శాంతమ్మ పక్కన హర్ష చక్కగా నిద్రపోయి ఉంటాడు. దాంతో నందిని కోపంతో శాంతమ్మ మీద నీళ్లు చల్లుతుంది. హర్షని సర్ది చెప్పి పంపలేదని తిడుతుంది. దాంతో శాంతమ్మ హర్షని కొట్టి లేపుతుంది. లోపలికి వెళ్లమని నెట్టేస్తుంది. హర్ష నందిని దగ్గరకు వెళ్తాడు. హర్ష నందిని దగ్గరకు వెళ్లి గుంజీలు తీస్తూ ఇక తప్పులు చేయను మైత్రి విషయం తీసుకోరానని అంటాడు. ఇక నందిని మళ్లి పూలు తీసుకుంటుంది. 

సత్య చక్రవర్తి ప్రవర్తనను తలచుకొని ఏంటి మామయ్య ఇలా అబద్ధం చెప్తున్నారు నిజం చెప్పొచ్చు కదా అని అనుకుంటుంది. ఇక క్రిష్‌ వస్తాడు. అయినా సత్య డల్‌గా ఉంటుంది. క్రిష్ వచ్చి గుడ్ న్యూస్ అని తన బాబాయ్ డబ్బు ఇవ్వడంతో బాపు ఎమ్మెల్యే టికెట్ ఖరారు అయిందని చక్రవర్తిని ఇంట్లోనే ఉండమని చెప్పమని సత్యతో చెప్తాడు. సత్య క్రిష్తో ఆయన నీ మాటే వింటారని చెప్తుంది. నీ కంటే మీ బాబాయ్‌కి ఎవరూ ఇష్టం ఉండరని సత్య అంటుంది. దాంతో క్రిష్ మా బాపు కంటే ఎవరికీ నేను ఇష్టం ఉండదని అంటాడు. రేపు నీకు ఓ గుడ్‌న్యూస్ చెప్తానని సత్య అనుకుంటుంది. మనసులో రేపు మహదేవయ్య గుట్టు రట్టు చేసి చక్రవర్తి నోరు తెరిచి నిజం చెప్పేలా చేస్తానని అంటుంది. క్రిష్ మాట్లాడుతున్నా వినకుండా గుడ్ నైట్ చెప్పేసి పడుకుంటుంది. 

ఉదయం సంజయ్ సంధ్యని ట్రాప్ చేయడానికి ప్లాన్స్ చేస్తుంటాడు. ఎలా అయినా సంధ్య నెంబరు తీసుకోవాలని అనుకుంటాడు. రెస్టారెంట్‌లో సంధ్య ఉంటే తన దగ్గరకు వెళ్లి మాట్లాడుతాడు. దేవుడు మనల్ని కలుపుతున్నాడని సంధ్యతో పులిహోర కలుపుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: చక్రవర్తే క్రిష్ తండ్రి అని తెలుసుకున్న సత్య.. ఇంటి నుంచి వెళ్లిపోయిన మైత్రి! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Embed widget