అన్వేషించండి

Satyabhama Serial Today November 18th: సత్యభామ సీరియల్: చక్రవర్తే క్రిష్ తండ్రి అని తెలుసుకున్న సత్య.. ఇంటి నుంచి వెళ్లిపోయిన మైత్రి!

Satyabhama Today Episode మైత్రి ఇంటి నుంచి వెళ్లిపోవడం ఆపలేకపోయానని హర్ష బాధ పడటంలో నందిని హర్షని గది నుంచి బయటకు గెంటేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode అందరూ హాల్‌లో ఉంటే మైత్రి తన బ్యాగ్ తీసుకొని వస్తుంది. చెప్పకుండా ఫారెన్‌కి వెళ్తున్నావా అని నందిని అడిగితే మా ఇంటికి వెళ్తున్నా అని మైత్రి అంటుంది. మైత్రిని వెళ్లకుండా ఆపమని సంధ్య అంటుంది. దాంతో హర్ష ఏం అనకుండా గమ్మునుంటాడు. మైత్రి మాత్రం హర్ష తనని తీసుకొచ్చాడు కాబట్టి హర్ష ఉండమంటే ఉంటానని చెప్తుంది. అయినా హర్ష ఏం అనడు. 

మైత్రి: మనసులో ఇంటిళ్లపాది నేను వెళ్లిపోవాలి అనే చూస్తున్నారు. కానీ పిచ్చిది సంధ్య అది తెలీక నన్ను ఉండిపోమంటుంది. అందుకే అందరూ సైలెంట్‌గా ఉన్నారు. 
నందిని: మనసులో దీనికి తెగింపు ఎక్కువైంది నా ముందే నా మొగుడు దగ్గరకు వెళ్తుంది.
మైత్రి: మాట్లాడవేంటి హర్ష వెళ్లమంటావా.
హర్ష: వెళ్లిపోతాను అంటే ఇంతకు ముందు రెండు సార్లు ఆపాను ప్రతీ సారి ఆపితే బాగోదు. నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను.
నందిని: హమ్మయ్యా ఏమైంది నా పెనిమిటికి. మైత్రిని ఆపడం లేదు.
మైత్రి: ఓహో నిర్ణయం నాకు వదిలి పెట్టావా నేను మాత్రం నిర్ణయం దేవుడికి వదిలిపెట్టా అని రెండు వేళ్లు హర్ష ముందు పెడుతుంది. 

హర్ష వేలు పట్టుకొనే టైంకి మైత్రి చేయి లాగేస్తుంది. వెళ్లాలనే నిర్ణయించుకున్నాను అని చెప్తుంది. విశాలాక్షి దగ్గరకు వెళ్లి మీరు నాకు ఎంతో ప్రేమ చూపిస్తే నేను మీకు చాలా బాధ పెట్టానని అంటుంది. తర్వాత నందిని దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుంటుంది. ఈ రోజుతో పీడ విరగడైపోతుందని నందిని అనుకుంటే మైత్రి మనసులో తప్పక వెళ్తున్నా మళ్లీ కోడలిగా ఈ ఇంటిలో అడుగుపెడతా అనుకొని వెళ్లిపోతుంది.

సత్య: తనలో తాను క్రిష్ చెప్పిందే నిజం మామయ్య చిన్నమామయ్య కొడుకుని తన కొడుకుని అటూ ఇటూ మార్చారు. సంజయ్ తన రక్తం పంచుకు పుట్టిన కొడుకు కాబట్టి తను ఎక్కడ గాయ పడతాడో అని వెంపర్లాడాడు. చిన్న మామయ్య కూడా సంజయ్‌ వైపు కాకుండా క్రిష్‌నే సమర్దిస్తున్నాడు. కచ్చితంగా ఇద్దరి మామయ్యల కొడుకులు మారారు. క్రిష్ తండ్రి ఎవరో తెలిసిపోయింది కానీ ఇది చిన్నమామయ్యకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో తెలుసుకోవాలి. 
మైత్రి: తన ఇంటికి చేరుకొని తల్లిదండ్రుల ఫొటో పట్టుకొని ఏడుస్తుంది. క్రిష్ ధైర్యం చెప్పి ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయ్ వెంటనే వస్తానని అంటాడు. నన్ను వదిలి నువ్వు పోవచ్చు కానీ ప్రతీ రోజూ నా కోసం వస్తావు. నా వల్ల నీకు నందినికి మధ్య గొడవలు వచ్చి ఏదో ఒక రోజు నువ్వు శాశ్వతంగా నా దగ్గరకే వచ్చేలా చేస్తా.

రేణుక కొబ్బరి కాయ కొడుతుంటుంది. అది పగలకపోవడంతో క్రిష్ వచ్చి నేను కొబ్బరి కొడతా అని వేరే పని చూసుకోమని క్రిష్‌ పంపేస్తాడు. ఇక చక్రవర్తి వచ్చి అలా వద్దురా సుత్తితోనో రాయితోనో కొట్టు అంటాడు. ఏం కాదు అని క్రిష్ అని మళ్లీ కొడితే చేతికి దెబ్బతగులుతుంది. దాంతో చక్రవర్తి కంగారు పడతాడు. తన రుమాలుతో కట్టు కట్టి నీ కోసం ఆలోచించేవాళ్లు ఉన్నారు అని కొట్లాటలకు పోవద్దని మాట్లాడుతారు. అదంతా సత్య వింటుంది. చక్రవర్తి మాటలకు క్రిష్‌ తన కొడుకే అని చిన్నమామయ్యకు తెలుసుండాలని అనుకుంటుంది. 

మరోవైపు రాత్రి నందిని అద్దం చూసి మురిసిపోతూ రెడీ అవుతుంటే శాంతమ్మ వచ్చి నందినిని ఇమిటేట్ చేస్తుంటుంది. మైత్రి చెక్కేసింది కాబట్టి మొగుడుని కట్టిపడేయడానికి సోకులకు పోతున్నావు అని అంటుంది. ఇక శాంతమ్మ నందినికి మల్లెపూలు ఇచ్చి ఇవి పెట్టుకో నా మనవడు నీకు వదలడు అంటుంది. ఇక శాంతమ్మని నిందిని పంపేస్తుంది. ఇక నందిని పూలు పెట్టుకొని రెడీ అవుతుంది. హర్ష వస్తే శాంతమ్మ హర్షతో లోపల జాతర జరుగుతుంది ఆ జిడ్డు ముఖాన్ని సబ్బుతో రుద్దు ఓళ్లు దగ్గరపెట్టుకో అని సెటైర్ వేస్తుంది. హర్ష వచ్చి తనని చూసి మురిసిపోతాడని నందిని అనుకొని దాక్కుంటుంది. ఇంతలో హర్ష వచ్చి మైత్రిని ఆపలేకపోయానని ఫీలవుతాడు. మర్చిపో అని నందిని అంటుంది. నా వల్ల కాదని మైత్రి చాలా బాధ పడుతుందని హర్ష అంటాడు. నువ్వు బాధ పడింది మైత్రి కోసమా అని నందిని హర్షని తిట్టి లాక్కొని బయటకు తోసేస్తుంది. రాత్రంతా గదిలోకి రావొద్దని హర్షని తోసేసి పూలు విసిరేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: ఒకర్ని ఒకరు కాల్చుకున్న క్రిష్, సంజయ్‌.. కొడుకుల కోసం మహదేవయ్య, చక్రవర్తిల మాటల యుద్ధం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget